ధర్మవరంలో బీజేపీలో చేరిన వెంకట చౌదరి, వెంకటేశ్వర రెడ్డి వందలాది కార్యకర్తలతో బైక్ ర్యాలీ – ఆర్కే ఫంక్షన్ హాల్‌లో ఘన కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన వెంకట చౌదరి గారు, నల్ల బోయినపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి గారు తమ అనుచరులు, సన్నిహితులు, మిత్రబృందంతో కలిసి గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమం ధర్మవరం ఆర్కే ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు తాసిల్దార్ కార్యాలయం నుంచి వందలాది బీజేపీ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించగా, ర్యాలీ ఆర్కే ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. అనంతరం జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు గారు, మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు గారు నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన వెంకట చౌదరి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వానికి ఆకర్షితులై బీజేపీలో చేరడం అభినందనీయమన్నారు. ఇది ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. 2019–2024 మధ్య రాష్ట్రంలో జరిగిన దుర్వ్యవస్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని, భూ కబ్జాలు, అక్రమాలు, దౌర్జన్యాల నుంచి విముక్తి కోరుతూ ప్రజలు సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపించారని అన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని, ఈవీఎంలపై చేస్తున్న ఆరోపణలు రాజకీయ దివాలాకోరుతనమేనని విమర్శించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పీఏబీఆర్ కాలువ మరమ్మతులకు రూ.29 లక్షలు మంజూరు చేయించారని, పది రోజుల్లో తాడిమర్రి మండలానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే విద్యుత్, తాగునీరు, రహదారులు, వైద్యం, గృహ నిర్మాణం, పాఠశాలలు, రైతుల సంక్షేమం వంటి అన్ని రంగాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ, దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన సత్యకుమార్ యాదవ్ గారు పేదల కష్టాలను అర్థం చేసుకుని పాలన చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ధర్మవరంలో బీజేపీలో చేరిన వెంకట చౌదరి, వెంకటేశ్వర రెడ్డి వందలాది కార్యకర్తలతో బైక్ ర్యాలీ – ఆర్కే ఫంక్షన్ హాల్‌లో ఘన కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన వెంకట చౌదరి గారు, నల్ల బోయినపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి గారు తమ అనుచరులు, సన్నిహితులు, మిత్రబృందంతో కలిసి గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమం ధర్మవరం ఆర్కే ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు తాసిల్దార్ కార్యాలయం నుంచి వందలాది బీజేపీ కార్యకర్తలతో బైక్
ర్యాలీ నిర్వహించగా, ర్యాలీ ఆర్కే ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. అనంతరం జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు గారు, మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు గారు నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన వెంకట చౌదరి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వానికి ఆకర్షితులై బీజేపీలో చేరడం అభినందనీయమన్నారు. ఇది ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీపై
ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. 2019–2024 మధ్య రాష్ట్రంలో జరిగిన దుర్వ్యవస్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని, భూ కబ్జాలు, అక్రమాలు, దౌర్జన్యాల నుంచి విముక్తి కోరుతూ ప్రజలు సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపించారని అన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని, ఈవీఎంలపై చేస్తున్న ఆరోపణలు రాజకీయ దివాలాకోరుతనమేనని విమర్శించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పీఏబీఆర్ కాలువ మరమ్మతులకు రూ.29 లక్షలు మంజూరు చేయించారని, పది రోజుల్లో తాడిమర్రి మండలానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే విద్యుత్, తాగునీరు, రహదారులు, వైద్యం, గృహ నిర్మాణం,
పాఠశాలలు, రైతుల సంక్షేమం వంటి అన్ని రంగాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ, దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన సత్యకుమార్ యాదవ్ గారు పేదల కష్టాలను అర్థం చేసుకుని పాలన చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ యోగి వేమన జయంతి రాష్ట్ర పండుగల చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు వీటిలో భాగంగానే ఎంపీడీవో ఎమ్మార్వో అధికారులు జయంతి ఏర్పాట్లను శనివారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 19వ తేదీన వేమన జయంతి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.1
- 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.1
- Post by Bondhu Suresh1
- శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.1
- మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి1
- దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అండగా నిలిచిన సీఎంచంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ , గత అరాచక వైచిపి పాలనలో కోవిడ్ సమయంలో వైద్యులకు సంబంధించి వారికి కావలసిన రక్షణ పరికరాలు అందించాలని అడిగిన పాపానికి దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను ఎంతో దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి మండుటెండలో నడి రోడ్డుపై దొర్లించి ఆయన మరణానికి కారణమైన సైకో జగన్ అకృత్యానికి బలైన సుధాకర్ కుటుంబంలో కుమారుడు లలిత్ ప్రసాద్ కు డిప్యూటీ తహసిల్దార్ గా పదోన్నతి కల్పించటం తో పాటు ,కోటి రూపాయలు కుటుంబానికి అందించడం కోసం నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షించ తగ్గ విషయమని,అలాగే తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం కల్పించడం, అలాగే సైకో ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఎ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కు ఉద్యోగవకాశం కల్పించడం పట్ల , టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ బాబు గారికి బాధితుల పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని కాబట్టి దళిత, బడుగు ,బలహీనవర్గ సామాజిక వర్గాలు ఎప్పుడు టిడిపికి వెన్ను దన్నుగా ఉండాలని, ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మీడియా కోఆర్డినేటర్ కేశగాళ్ల శ్రీనివాసులు, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రామాంజినేయులు,బుక్కపట్నం శ్రీనివాసులు, నారాయణస్వామి, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు1
- పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో ఎంపీ బీకే పార్థసారధి కుమారుడు సాయి కళ్యాణ్ ఆధ్వర్యంలో కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కార్మికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన కార్మికులకు తెలియజేశారు.1
- Post by Bondhu Suresh1