Shuru
Apke Nagar Ki App…
గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా కేంద్రం ప్రారంభం బెజ్జూర్ గ్రామ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సర్పంచ్ దుర్గం సరోజ–తిరుపతి, వైద్యుడు శ్రావణ్ శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
Krishna
గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా కేంద్రం ప్రారంభం బెజ్జూర్ గ్రామ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సర్పంచ్ దుర్గం సరోజ–తిరుపతి, వైద్యుడు శ్రావణ్ శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- *टिपर लॉरी में आग लग गई.. देखते ही देखते जलकर खाक हो गई* तेलंगाना: नलगोंडा जिले के चंदूर मंडल के तुम्मलपल्ली गांव में आग लग गई। सड़क बढ़ाने के काम के लिए गांव की ओर जा रही टिपर लॉरी में अचानक आग लग गई। अधिकारियों ने बताया कि आग बिजली के शॉर्ट सर्किट की वजह से लगी। टिपर देखते ही देखते पूरी तरह जलकर खाक हो गया। हादसे में ड्राइवर गंभीर रूप से घायल हो गया। उसे अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने बताया कि उसकी हालत गंभीर है। पुलिस घटना की जांच कर रही है।1
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్థానిక వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాత్రి వార్డులోని పలు కాలనీలలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. ప్రజలు ఇళ్లు, వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు అధ్యక్షుడు సయ్యద్ హాజీ, సయ్యద్ హఫీజ్, మోహన్, బిలాల్, తదితరులు పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ జిల్లా : గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్ షాపులో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం3
- కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్‌లోని ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తంగళ్ళపల్లి మండలంలో మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.4
- కామారెడ్డి: ఐదు రోజుల పాటు నీటి సరఫరా మార్పులు, కల్వారల్ సమీపంలో జీఆర్పీ పైప్లాన్ మార్పిడి, గ్యాప్ క్లోజింగ్, 3.20 కి.మీ. పైప్లాన్ కమిషనింగ్ పనుల నేపథ్యంలో మార్చి 9 నుంచి ఐదు రోజుల పాటు పైప్లాన్ మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, భిక్కనూర్ మండలాలు, కామారెడ్డి మున్సిపాలిటీ ప్రాంతాలకు ప్రత్యామ్నాయ రోజుల్లో నీటి సరఫరాను కొత్త లైన్ ద్వారా అందించనున్నారు.1
- ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.1
- కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.1