logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి నంద్యాల, జూలై 31 : ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని సానుకూల దృక్పథంతో పరిశీలించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. 'వన్ మంత్ - ఫోర్ విజిట్' కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట రెడ్డివారి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌లు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. అందిన ప్రతి అర్జీని స్వయంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, వారి సమస్యలను నేరుగా తెలుసుకొని వేగవంతంగా పరిష్కరించడమే 'వన్ మంత్ - ఫోర్ విజిట్' కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే  శ్రీశైలం నియోజకవర్గంలో ఆత్మకూరు, మహానంది, వెలుగోడు మండలాలలో 900కు పైగా అర్జీలు స్వీకరించామని, వాటిలో అత్యధికంగా రెవెన్యూ, సంక్షేమం తదితర శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి అర్జీపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్య వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న అనంతరమే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.  సమస్య పరిష్కారమైన వెంటనే సంబంధిత ఉత్తర్వులు లేదా చర్యల ప్రతిని అర్జీదారునికి అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో స్వీకరించిన అన్ని వినతులను కలెక్టరేట్ బృందం డిజిటలైజ్ చేసి వెంటనే సంబంధిత శాఖలకు పంపించి నిరంతర పర్యవేక్షణ చేపడుతుందని తెలిపారు. సున్నిపెంట ప్రాంతంలో అధికంగా ఇళ్ల స్థలాలు, గృహాలు, పెన్షన్లు, విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ, ప్రాథమిక వసతులకు సంబంధించిన సమస్యలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను అర్హతల మేరకు పరిశీలించి, స్థలం మాత్రమే కోరిన వారి వివరాలను వేరుగా నమోదు చేయాలని, ఇల్లు మరియు స్థలం రెండూ అవసరమైన వారి ప్రతిపాదనలను ఆర్డీఓకు పంపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సున్నిపెంటలో కొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు ఇళ్లకు ఒకే విద్యుత్ మీటర్ ఉండటం వల్ల పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోతున్నాయని వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ, గతంలో కేటాయించిన గృహాల జాబితాను పరిశీలించి ప్రతి ఇంటికి ప్రత్యేక విద్యుత్ మీటర్, విద్యుత్ కనెక్షన్ కల్పించేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెస్ట్రన్ కాలనీతో పాటు ఇతర కాలనీల్లో వీధి దీపాలు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కొరత ఉందని ప్రజలు తెలియజేశారని, సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అడవి మృగాల సంచారం దృష్ట్యా వీధి దీపాల ఏర్పాటు అత్యవసరమని పేర్కొంటూ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో అంచనాలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. సున్నిపెంట తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల వరకు నిధులు మంజూరు చేసిందని, టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా పైప్‌లైన్లు, మోటార్లు, ప్రత్యామ్నాయ నీటి వనరులను సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రోడ్లు ఉన్న ప్రాంతాల్లో డ్రెయినేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ కార్యాచరణ రూపొందించి డ్రెయినేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల ద్వారా ఇప్పటికే అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని, త్వరలో సున్నిపెంట ప్రాంత యువతకు ఉపయోగపడేలా మరో భారీ ఉద్యోగ మేళా నిర్వహించి సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారిని ఆదేశించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే స్వీకరించి నెల రోజుల్లో పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో జిల్లా కేంద్రానికే పరిమితమైన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాలను ఇప్పుడు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మండల స్థాయికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సున్నిపెంట ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే సుమారు రూ.14 కోట్లతో సిమెంట్ రోడ్ల పనులు పూర్తయ్యాయని, సీఎస్ఆర్ నిధులతో రూ.95 లక్షల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గతంలో రూ.6 కోట్లు, ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ కింద మరో రూ.9.11 కోట్లు మంజూరు కావడంతో మొత్తం రూ.15 కోట్లకు పైగా నిధులు కేటాయించబడినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీజీఆర్‌ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని ప్రజా వినతులు శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన బండె సారమ్మ తనకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. 2) శ్రీశైలం మండలం సున్నిపెంటలోని శ్రీశైలం కాలనీ నివాసితులు తమ కాలనీలో గత అనేక సంవత్సరాలుగా తీవ్ర తాగునీటి సమస్య నెలకొని ఉందని, దీంతో సొంత ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని తెప్పించుకోవాల్సి వస్తోందని, దీనివల్ల ఆర్థిక భారం పెరగడంతో పాటు నీటి కొరత కారణంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల కాలనీకి శాశ్వత పరిష్కారంగా రెగ్యులర్ పైప్‌లైన్ కనెక్షన్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. 3) శ్రీశైలం మండలం సున్నిపెంట బండ్లబజార్‌కు చెందిన పి. శివప్రసాద్ తమ కాలనీలో విద్యుత్ స్తంభాలు లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే అడవి మృగాల సంచారం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. కావున కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

10 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
10 hrs ago
10a6e05c-c525-40db-b14b-0de71dfc2bac

ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి నంద్యాల, జూలై 31 : ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని సానుకూల దృక్పథంతో పరిశీలించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. 'వన్ మంత్ - ఫోర్ విజిట్' కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట రెడ్డివారి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌లు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. అందిన ప్రతి అర్జీని స్వయంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, వారి సమస్యలను నేరుగా తెలుసుకొని వేగవంతంగా పరిష్కరించడమే 'వన్ మంత్ - ఫోర్ విజిట్' కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే  శ్రీశైలం నియోజకవర్గంలో ఆత్మకూరు, మహానంది, వెలుగోడు మండలాలలో 900కు పైగా అర్జీలు స్వీకరించామని, వాటిలో అత్యధికంగా రెవెన్యూ, సంక్షేమం తదితర శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి అర్జీపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్య వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న అనంతరమే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.  సమస్య పరిష్కారమైన వెంటనే సంబంధిత ఉత్తర్వులు లేదా చర్యల ప్రతిని అర్జీదారునికి అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో స్వీకరించిన అన్ని వినతులను కలెక్టరేట్ బృందం డిజిటలైజ్ చేసి వెంటనే సంబంధిత శాఖలకు పంపించి నిరంతర పర్యవేక్షణ చేపడుతుందని తెలిపారు. సున్నిపెంట ప్రాంతంలో అధికంగా ఇళ్ల స్థలాలు, గృహాలు, పెన్షన్లు, విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ, ప్రాథమిక వసతులకు సంబంధించిన సమస్యలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను అర్హతల మేరకు పరిశీలించి, స్థలం మాత్రమే కోరిన వారి వివరాలను వేరుగా నమోదు చేయాలని, ఇల్లు మరియు స్థలం రెండూ అవసరమైన వారి ప్రతిపాదనలను ఆర్డీఓకు పంపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సున్నిపెంటలో కొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు ఇళ్లకు ఒకే విద్యుత్ మీటర్ ఉండటం వల్ల పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోతున్నాయని వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ, గతంలో కేటాయించిన గృహాల జాబితాను పరిశీలించి ప్రతి ఇంటికి ప్రత్యేక విద్యుత్ మీటర్, విద్యుత్ కనెక్షన్ కల్పించేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెస్ట్రన్ కాలనీతో పాటు ఇతర కాలనీల్లో వీధి దీపాలు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కొరత ఉందని ప్రజలు తెలియజేశారని, సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అడవి మృగాల సంచారం దృష్ట్యా వీధి దీపాల ఏర్పాటు అత్యవసరమని పేర్కొంటూ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో అంచనాలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. సున్నిపెంట తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల వరకు నిధులు మంజూరు

99c53ab1-ef3b-4eb0-be39-aa129c8bac1a

చేసిందని, టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా పైప్‌లైన్లు, మోటార్లు, ప్రత్యామ్నాయ నీటి వనరులను సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రోడ్లు ఉన్న ప్రాంతాల్లో డ్రెయినేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ కార్యాచరణ రూపొందించి డ్రెయినేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల ద్వారా ఇప్పటికే అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని, త్వరలో సున్నిపెంట ప్రాంత యువతకు ఉపయోగపడేలా మరో భారీ ఉద్యోగ మేళా నిర్వహించి సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారిని ఆదేశించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే స్వీకరించి నెల రోజుల్లో పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో జిల్లా కేంద్రానికే పరిమితమైన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాలను ఇప్పుడు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మండల స్థాయికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సున్నిపెంట ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే సుమారు రూ.14 కోట్లతో సిమెంట్ రోడ్ల పనులు పూర్తయ్యాయని, సీఎస్ఆర్ నిధులతో రూ.95 లక్షల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గతంలో రూ.6 కోట్లు, ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ కింద మరో రూ.9.11 కోట్లు మంజూరు కావడంతో మొత్తం రూ.15 కోట్లకు పైగా నిధులు కేటాయించబడినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీజీఆర్‌ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని ప్రజా వినతులు శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన బండె సారమ్మ తనకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. 2) శ్రీశైలం మండలం సున్నిపెంటలోని శ్రీశైలం కాలనీ నివాసితులు తమ కాలనీలో గత అనేక సంవత్సరాలుగా తీవ్ర తాగునీటి సమస్య నెలకొని ఉందని, దీంతో సొంత ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని తెప్పించుకోవాల్సి వస్తోందని, దీనివల్ల ఆర్థిక భారం పెరగడంతో పాటు నీటి కొరత కారణంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల కాలనీకి శాశ్వత పరిష్కారంగా రెగ్యులర్ పైప్‌లైన్ కనెక్షన్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. 3) శ్రీశైలం మండలం సున్నిపెంట బండ్లబజార్‌కు చెందిన పి. శివప్రసాద్ తమ కాలనీలో విద్యుత్ స్తంభాలు లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే అడవి మృగాల సంచారం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. కావున కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో ధర్నా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లకు,కార్మికులకు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆవులయ్య మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య భీమా కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టానికైనా వెనకాడ బొమని హెచ్చరించారు.
    1
    కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో ధర్నా 
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లకు,కార్మికులకు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆవులయ్య  మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య భీమా కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టానికైనా వెనకాడ బొమని హెచ్చరించారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ఎల్లంపల్లి తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశం కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఎల్లంపల్లి శ్రీ తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మైదుకూరు ఖండ పరిధిలోని ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం మండలాల గ్రామ కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ కడప జిల్లా సంయోజక్ శ్రీ తమిడేపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాజంలో సమరసత, సేవా కార్యక్రమాలు, ధార్మిక చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహ సంయోజక్ బుసిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి, అనంతపురం కన్వీనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, మైదుకూరు మున్సిపాలిటీ కన్వీనర్ ఎం. వీరారెడ్డి తదితరులు పాల్గొని సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఎల్లంపల్లి తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశం
కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఎల్లంపల్లి శ్రీ తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మైదుకూరు ఖండ పరిధిలోని ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం మండలాల గ్రామ కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ కడప జిల్లా సంయోజక్ శ్రీ తమిడేపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాజంలో సమరసత, సేవా కార్యక్రమాలు, ధార్మిక చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహ సంయోజక్ బుసిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి, అనంతపురం కన్వీనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, మైదుకూరు మున్సిపాలిటీ కన్వీనర్ ఎం. వీరారెడ్డి తదితరులు పాల్గొని సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
    1
    ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష

ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. 

ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష
ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. 
ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ టీయూ లోగో ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
    1
    తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ టీయూ లోగో  ను  తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    8 hrs ago
  • ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు: మున్సిపల్ కమిషనర్ ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ చేపలు, కోళ్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే నిషేధిత సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ కవర్లు,కప్పులు, ఇతర ఉత్పత్తులను వ్యాపారులు స్వచ్ఛందంగా అప్పగించాలని ఆదేశించారు.
    1
    ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు: మున్సిపల్ కమిషనర్
ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తనిఖీలు
నిర్వహించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ చేపలు, కోళ్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే నిషేధిత సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ కవర్లు,కప్పులు, ఇతర ఉత్పత్తులను వ్యాపారులు స్వచ్ఛందంగా అప్పగించాలని ఆదేశించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి చేసిన మంచి గురించి ప్రజలకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పసుపులేటి వెంకటేష్ గారు పీవీ శివకుమార్ గారు దేశు నారాయణ గారు ఆర్వేటి గంగప్ప గారు నాగభూషణ గారు జనార్ధన గారు రాములు గారు
    2
    శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. 
సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ
డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి  చేసిన
మంచి గురించి ప్రజలకు తెలియజేశారు...
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు 
పసుపులేటి వెంకటేష్ గారు
పీవీ శివకుమార్ గారు 
దేశు నారాయణ గారు 
ఆర్వేటి గంగప్ప గారు 
నాగభూషణ గారు
జనార్ధన గారు 
రాములు గారు
    user_Pv sivakumar
    Pv sivakumar
    Photographer ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం ప్రోగ్రాం ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లి పెన్నా హైస్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భావన, కరస్పాండెంట్ రామయ్య, ప్రిన్సిపల్ దాక్షాయణి అధ్వర్యంలొ "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు" పురస్కరించుకొని సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు కీటక జనిత వ్యాధుల గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారు మాట్లాడుతు ప్రతి ఒక కుటుంబము చెక్,క్లీన్,కవర్ పాటించాలని తెలియపరిచారు. అలాగనే ప్రతిఒక్కరు దోమతెరలలోనే నిద్రించాలని తెలియపరిచారు.డాక్టర్ భావన గారు మాట్లాడుతు14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అమ్మాయిలందరు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు.సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు ఆగస్టు 3నుండి 8 వరకు జరగబోవు డిపిటి,టిడి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 5,10,16 సంవత్సరాల పిల్లలు వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలియ జేశారు.అనంతరం మంటపంపల్లి గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము,MLHP చంద్రిక,స్త్రీ ఆరోగ్య కార్యకర్త సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం ప్రోగ్రాం ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లి పెన్నా హైస్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భావన, కరస్పాండెంట్ రామయ్య, ప్రిన్సిపల్ దాక్షాయణి అధ్వర్యంలొ "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు" పురస్కరించుకొని సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు కీటక జనిత వ్యాధుల గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారు మాట్లాడుతు ప్రతి ఒక కుటుంబము చెక్,క్లీన్,కవర్ పాటించాలని తెలియపరిచారు. అలాగనే ప్రతిఒక్కరు దోమతెరలలోనే నిద్రించాలని తెలియపరిచారు.డాక్టర్ భావన గారు మాట్లాడుతు14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అమ్మాయిలందరు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు.సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు ఆగస్టు 3నుండి 8 వరకు జరగబోవు డిపిటి,టిడి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 5,10,16 సంవత్సరాల పిల్లలు వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలియ జేశారు.అనంతరం మంటపంపల్లి గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము,MLHP చంద్రిక,స్త్రీ ఆరోగ్య కార్యకర్త సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
    1
    సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం ప్రోగ్రాం


  ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లి పెన్నా హైస్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భావన, కరస్పాండెంట్ రామయ్య, ప్రిన్సిపల్ దాక్షాయణి  అధ్వర్యంలొ "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు" పురస్కరించుకొని సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు  కీటక జనిత వ్యాధుల గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారు మాట్లాడుతు ప్రతి ఒక కుటుంబము చెక్,క్లీన్,కవర్ పాటించాలని తెలియపరిచారు. అలాగనే ప్రతిఒక్కరు దోమతెరలలోనే నిద్రించాలని తెలియపరిచారు.డాక్టర్ భావన గారు మాట్లాడుతు14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అమ్మాయిలందరు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు.సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు ఆగస్టు 3నుండి 8 వరకు జరగబోవు డిపిటి,టిడి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 5,10,16 సంవత్సరాల పిల్లలు వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలియ జేశారు.అనంతరం మంటపంపల్లి గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము,MLHP చంద్రిక,స్త్రీ ఆరోగ్య కార్యకర్త సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం ప్రోగ్రాం
ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లి పెన్నా హైస్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భావన, కరస్పాండెంట్ రామయ్య, ప్రిన్సిపల్ దాక్షాయణి  అధ్వర్యంలొ "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు" పురస్కరించుకొని సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు  కీటక జనిత వ్యాధుల గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారు మాట్లాడుతు ప్రతి ఒక కుటుంబము చెక్,క్లీన్,కవర్ పాటించాలని తెలియపరిచారు. అలాగనే ప్రతిఒక్కరు దోమతెరలలోనే నిద్రించాలని తెలియపరిచారు.డాక్టర్ భావన గారు మాట్లాడుతు14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అమ్మాయిలందరు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు.సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు ఆగస్టు 3నుండి 8 వరకు జరగబోవు డిపిటి,టిడి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 5,10,16 సంవత్సరాల పిల్లలు వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలియ జేశారు.అనంతరం మంటపంపల్లి గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము,MLHP చంద్రిక,స్త్రీ ఆరోగ్య కార్యకర్త సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • వర్షంలో కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర వర్షంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.
    1
    వర్షంలో కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర

తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర వర్షంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    8 hrs ago
  • వైయస్ ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
    1
    వైయస్  ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి
పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ
చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ
సానుభూతి తెలియజేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.