logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో నిర్వాహకులకు సూచనలు అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని లక్షెట్టిపేట ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల మేలుకోసమే ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తుందన్నారు. అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

2 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
2 hrs ago
80b0c04f-f31c-4b67-9590-863bc8f1c1c9

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో నిర్వాహకులకు సూచనలు అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని లక్షెట్టిపేట ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల మేలుకోసమే ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తుందన్నారు. అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్ కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    1
    ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్
కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు
ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు
జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి
    1
    గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల  పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని 
మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన  కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    41 min ago
  • కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.
    1
    శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.
    user_కర్ణాల నాగరాజు
    కర్ణాల నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది. కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    1
    మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది.
కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.
ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    6 hrs ago
  • ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు
    1
    ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం 
ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    1
    జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ
జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.