కోటి తలంబ్రాల దీక్షలో బొలిబోత్తుల దేవదాస్ దంపతులు పద్మశాలి సంఘం అధ్యక్షునిగా దేవదాస్ ఎన్నో సేవలందించారు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని భద్రాచల రామయ్య కళ్యానానికి మేము సిద్ధం అంటూ రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి రామభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన పద్మశాలి సంఘం అధ్యక్షులు, విశ్రాంత ఉపాధ్యాయులు బోలిబోత్తుల దేవదాస్ నీరజ దంపతులు. వడ్లను ఓలిచి తలంబ్రాలుగా మార్చి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారికి సోమవారం తన నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ మన చేతులతో ఓలిచి అందించే తలంబ్రాలు సాక్షాత్తు భద్రాచల సీతారాముల కళ్యానానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు దేవదాస్ గారు సామాజికంగా ఎన్నో సేవలు చేశారని ఈ సందర్బంగా సీతారాముల జ్ఞాపిక అందజేసి రామకోటి రామరాజు ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ గోటి తలంబ్రాలలో పాల్గొనాలన్నారు. గోటి తలంబ్రాలు కావాలనుకునే వారు రామకోటి కార్యక్రమంలో తీసుకోవాలన్నారు.
కోటి తలంబ్రాల దీక్షలో బొలిబోత్తుల దేవదాస్ దంపతులు పద్మశాలి సంఘం అధ్యక్షునిగా దేవదాస్ ఎన్నో సేవలందించారు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని భద్రాచల రామయ్య కళ్యానానికి మేము సిద్ధం అంటూ రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి రామభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన పద్మశాలి సంఘం అధ్యక్షులు, విశ్రాంత ఉపాధ్యాయులు బోలిబోత్తుల దేవదాస్ నీరజ దంపతులు. వడ్లను ఓలిచి తలంబ్రాలుగా మార్చి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారికి సోమవారం తన నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ మన చేతులతో ఓలిచి అందించే తలంబ్రాలు సాక్షాత్తు భద్రాచల సీతారాముల కళ్యానానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు దేవదాస్ గారు సామాజికంగా ఎన్నో సేవలు చేశారని ఈ సందర్బంగా సీతారాముల జ్ఞాపిక అందజేసి రామకోటి రామరాజు ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ గోటి తలంబ్రాలలో పాల్గొనాలన్నారు. గోటి తలంబ్రాలు కావాలనుకునే వారు రామకోటి కార్యక్రమంలో తీసుకోవాలన్నారు.
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి తండా కు చెందిన గిరిజన దంపతులకు నెల రోజుల క్రితం మగ బిడ్డ జన్మించారు. తొలి కాన్పులో మగ బిడ్డ జన్మించిన ఆనందంగా ఉన్న దంపతులు కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు ఓ మధ్యవర్తి ద్వారా బాలు తల్లిదండ్రులను కలిసి బేరం పెట్టారు. 50 వేలకు బేరం కుదిరింది. డబ్బులు ఇచ్చిన కామారెడ్డి కి చెందిన దంపతులు తీసుకు వెళ్ళారు. అయితే బాబు పుట్టిన తరవాత అంగన్వాడిలో పాలు, ఇతర పోషక ఆహారం కు బాలింత రాకపోవడం తో అనుమానం కలిగిన అంగన్వాడీ టీచర్ ఆరా తీసింది. విషయం అడగడం తో ఇంటికి తాళం వెళ్ళిపోయారు. అధికారులు రంగంలోకి దిగి పోలీస్ లకు సమాచారం అందించారు. కామారెడ్డి లో ఉన్న నెల రోజుల పసికందును తీసుకొని సఖి కేంద్రం కు తరలించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి నట్టు నిర్వాహకురాలు రేణుక తెలిపారు. నెల రోజుల పసి కందు ను విక్రయించడం పై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.1
- యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లా : యువకుల ర్యాష్ డ్రైవింగ్ పై గజ్వెల్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. * గజ్వెల్ మున్సిపల్ సంగాపూర్ రోడ్డు లో ర్యాష్ డ్రైవింగ్ వీడియోను తీసుకున్న యువకులు * ర్యాష్ డ్రైవింగ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యువకులు * వీడియో వైరల్ గా మారడంతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులను గజ్వెల్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ * మళ్లీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు చేస్తానని హెచ్చరిక * విద్యార్థులు రాకపోకల సమయంలో పిచ్చి చేష్టలు చేస్తే చర్యలు తప్పవని యువకులను హెచ్చరించిన సీఐ రవి కుమార్1