logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనంతపురం, జనవరి 7: అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు బుధవారం ఉదయం సింగనమల మండలంలోని ఆకులేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న 100 రోజుల ప్రత్యేక విద్యా కార్యక్రమం పురోగతిపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమ లక్ష్యాలను విద్యార్థులు ఎంతవరకు సాధిస్తున్నారన్న విషయంపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల బోధన సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన డీఈఓ ప్రసాద్ బాబు, ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా మరింత కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. బోధనలో నాణ్యత పెంచడంతో పాటు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్న కోడిగుడ్లను పరిశీలించారు. కోడిగుడ్ల నాణ్యత, నిల్వ విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థుల ఆరోగ్యంపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. అలాగే వికాస్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించి సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు విధులకు సకాలంలో హాజరవుతున్నారా లేదా అన్న విషయాన్ని కూడా డీఈఓ పరిశీలించారు. క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గార్లదిన్నె మండలం లోలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎం.పి.పి.ఎస్) ను కూడా డీఈఓ సందర్శించారు. అక్కడ కూడా విద్యార్థులకు పంపిణీ చేస్తున్న కోడిగుడ్లను పరిశీలించి, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తో పాటు ఆకులేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, బోధనా సిబ్బంది, అలాగే లోలూరు ఎం.పి.పి.ఎస్ ప్రధానోపాధ్యాయుడు మరియు బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

1 day ago
user_JG Reddy
JG Reddy
Journalist పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
1 day ago
44a9f4d5-80bc-4ba4-8d6b-d7fff6941191

అనంతపురం, జనవరి 7: అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు బుధవారం ఉదయం సింగనమల మండలంలోని ఆకులేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న 100 రోజుల ప్రత్యేక విద్యా కార్యక్రమం పురోగతిపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమ లక్ష్యాలను విద్యార్థులు ఎంతవరకు సాధిస్తున్నారన్న విషయంపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల బోధన సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన డీఈఓ ప్రసాద్ బాబు, ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా మరింత కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. బోధనలో నాణ్యత పెంచడంతో పాటు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్న కోడిగుడ్లను పరిశీలించారు. కోడిగుడ్ల నాణ్యత, నిల్వ విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థుల ఆరోగ్యంపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. అలాగే వికాస్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించి సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు విధులకు సకాలంలో హాజరవుతున్నారా లేదా అన్న విషయాన్ని కూడా డీఈఓ పరిశీలించారు. క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గార్లదిన్నె మండలం లోలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎం.పి.పి.ఎస్) ను కూడా డీఈఓ సందర్శించారు. అక్కడ కూడా విద్యార్థులకు పంపిణీ చేస్తున్న కోడిగుడ్లను పరిశీలించి, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తో పాటు ఆకులేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, బోధనా సిబ్బంది, అలాగే లోలూరు ఎం.పి.పి.ఎస్ ప్రధానోపాధ్యాయుడు మరియు బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల ముందస్తు సంక్రాంతి సంబరాలు పీలేరు జనవరి 8 : స్థానిక పీలేరు పట్టణంలో సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే వి.ఎస్.ఎన్ విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా ఎంతో ఘనంగా నిర్వహించారు. మొదటగా వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల అధినేత్రి వి.మాధవి  విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి భోగి,సంక్రాంతి మరియు కనుమ పండుగల ఆవశ్యకత, గొప్పతనాన్ని గురించి వివరించారు. తదుపరి విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఆటలు పోటీలు నిర్వహించారు. విద్యార్థినులకు రంగోళి, ఖోఖో పోటీలు మరియు విద్యార్థులకు గాలి పతంగులు, కబడ్డి, క్రికెట్ వంటి ఆటల పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, పాల్గొన్నారు. చివరగా వి.ఎస్.ఎన్ ఒలంపియాడ్ ప్రిన్సిపాల్ సురేష్ పండుగలను విద్యార్థులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ కుటుంబ సభ్యులు మరియు బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలి అని కుటుంబ విలువలు గురించి తెలిపి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాములు అందురు విద్యార్థులలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.
    1
    వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల ముందస్తు సంక్రాంతి సంబరాలు
పీలేరు జనవరి 8 :
స్థానిక పీలేరు పట్టణంలో సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే వి.ఎస్.ఎన్ విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా ఎంతో ఘనంగా నిర్వహించారు.
మొదటగా వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల అధినేత్రి వి.మాధవి  విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి భోగి,సంక్రాంతి మరియు కనుమ పండుగల ఆవశ్యకత, గొప్పతనాన్ని గురించి వివరించారు.
తదుపరి విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఆటలు పోటీలు నిర్వహించారు.
విద్యార్థినులకు రంగోళి, ఖోఖో పోటీలు మరియు విద్యార్థులకు గాలి పతంగులు, కబడ్డి, క్రికెట్ వంటి ఆటల పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, పాల్గొన్నారు.
చివరగా వి.ఎస్.ఎన్ ఒలంపియాడ్ ప్రిన్సిపాల్ సురేష్ పండుగలను విద్యార్థులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ కుటుంబ సభ్యులు మరియు బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలి అని కుటుంబ విలువలు గురించి తెలిపి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాములు అందురు విద్యార్థులలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.
    user_JG Reddy
    JG Reddy
    Journalist పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    29 min ago
  • ఇచ్చిన డబ్బులు అడిగితే అక్రమ కేసు లేనా
    1
    ఇచ్చిన డబ్బులు అడిగితే అక్రమ కేసు లేనా
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    7 hrs ago
  • చంద్రగిరిలో జవాన్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా లంచం అడుగుతున్న టీడీపీ నేతలు #STV9: రూ.2 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఇల్లు కట్టుకోనివ్వమని స్థానిక టీడీపీ నేత బాలాజీ వార్నింగ్ #chandhragi
    1
    చంద్రగిరిలో జవాన్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా లంచం అడుగుతున్న టీడీపీ నేతలు
#STV9: రూ.2 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఇల్లు కట్టుకోనివ్వమని స్థానిక టీడీపీ నేత బాలాజీ వార్నింగ్ #chandhragi
    user_Stv9 Press
    Stv9 Press
    Journalist చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Sullurpeta, Tirupati•
    1 hr ago
  • మండల సర్వేయర్ పై పోలీసులకు ఫిర్యాదు. పలమనేరు జనవరి 9 (ప్రజా ప్రతిభ) : అంబేద్కర్ భవన స్థలాన్ని సర్వే చేయకుండానే చేసినట్లు తప్పుడు ఎండార్స్ ఇచ్చిన గంగవరం మండల సర్వేర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలమనేర్ నియోజకవర్గం అంబేద్కర్ భవనాల అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం గంగవరం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు డి.వి. మునిరత్నం, ఎం. శ్రీనివాసులు,మణి, మహేష్, రెడ్డి ప్రసాద్, హరి మాట్లాడుతూ నెల రోజుల క్రితం అంబేద్కర్ భవన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన శ్రీలంక శరణార్థులకు అంబేద్కర్ వాదులకు వాగ్వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని కోరుతూ మండల తహసిల్దార్ కు విన్నవించామన్నారు. వారు నిర్లక్ష్యం చేయడంతో16--12---25 వ తేదీన జిల్లా కలెక్టరేట్లో జరిగే పి జి ఆర్ ఎస్ లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 6వ తేదీ వివాదంలో ఉన్న అంబేద్కర్ భవన స్థలాన్ని సర్వే చేయడానికి వస్తున్నామని వాట్సాప్ ద్వారా మండల సర్వేర్ నోటీసు పంపించారని వివరించారు. ఆరోజు సాయంత్రం వరకు దళిత, బహుజన నాయకులు అధికారులు వస్తారని పడిగాపులు కాసినా ఎవరు రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగామన్నారు. ఇప్పటివరకు సర్వేనెంబర్ 314 స్థలం సబ్ డివిజన్ కాకపోయినా మండల సర్వే314/3 గా సబ్ డివిజన్ అయినట్లు క్రియేట్ చేసి మాకు పంపిన ఎండార్స్ లో పంపారని ఆరోపించారు. 31----12---2025 వతేది మేము పి జి ఆర్ ఎస్ లో నమోదు చేసుకొన్న ఫిర్యాదు మేరకు అధికారులు వచ్చి సమస్య పరిష్కరించినట్లుగా తప్పుడు ఎండార్స్ ఇచ్చి అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. దళితులు పట్ల అధికారులకు, అగ్రవర్ణాలకు వివక్ష ఉన్నదనే విషయం నగ్నమెరిగిన సత్యం అని ,అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశం పొందిన అధికారులు కూడా అంబేద్కర్ కోసం కేటాయించిన స్థలం విషయములో వివక్ష చూపుతూ తప్పుడు సమాచారం ఇవ్వడం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. మండల సర్వేయర్ దళితులు పట్ల చూపుతున్న వ్యవహార శైలిని ఎండగడుతూ అతనిపైన చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ను కోరారు, ఈ కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు
    1
    మండల సర్వేయర్ పై పోలీసులకు ఫిర్యాదు.
పలమనేరు జనవరి 9 (ప్రజా ప్రతిభ) :
అంబేద్కర్ భవన స్థలాన్ని సర్వే చేయకుండానే చేసినట్లు తప్పుడు ఎండార్స్ ఇచ్చిన గంగవరం మండల సర్వేర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలమనేర్ నియోజకవర్గం అంబేద్కర్ భవనాల అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం గంగవరం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు డి.వి. మునిరత్నం, ఎం. శ్రీనివాసులు,మణి, మహేష్, రెడ్డి ప్రసాద్, హరి మాట్లాడుతూ  నెల రోజుల క్రితం అంబేద్కర్ భవన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన శ్రీలంక శరణార్థులకు  అంబేద్కర్ వాదులకు వాగ్వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని కోరుతూ మండల తహసిల్దార్ కు విన్నవించామన్నారు. వారు నిర్లక్ష్యం చేయడంతో16--12---25 వ తేదీన జిల్లా కలెక్టరేట్లో జరిగే పి జి ఆర్ ఎస్ లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 6వ తేదీ వివాదంలో ఉన్న అంబేద్కర్ భవన స్థలాన్ని సర్వే చేయడానికి వస్తున్నామని వాట్సాప్ ద్వారా మండల సర్వేర్ నోటీసు పంపించారని వివరించారు. ఆరోజు సాయంత్రం వరకు దళిత, బహుజన నాయకులు అధికారులు వస్తారని పడిగాపులు కాసినా ఎవరు రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగామన్నారు. ఇప్పటివరకు సర్వేనెంబర్ 314 స్థలం సబ్ డివిజన్ కాకపోయినా మండల సర్వే314/3 గా సబ్ డివిజన్ అయినట్లు క్రియేట్ చేసి మాకు పంపిన ఎండార్స్ లో పంపారని ఆరోపించారు.  31----12---2025 వతేది మేము పి జి ఆర్ ఎస్ లో నమోదు చేసుకొన్న ఫిర్యాదు మేరకు అధికారులు వచ్చి సమస్య పరిష్కరించినట్లుగా తప్పుడు ఎండార్స్ ఇచ్చి అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. దళితులు పట్ల అధికారులకు, అగ్రవర్ణాలకు వివక్ష ఉన్నదనే విషయం నగ్నమెరిగిన సత్యం అని ,అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశం పొందిన అధికారులు కూడా అంబేద్కర్ కోసం కేటాయించిన స్థలం విషయములో వివక్ష చూపుతూ తప్పుడు సమాచారం ఇవ్వడం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. మండల సర్వేయర్ దళితులు పట్ల చూపుతున్న వ్యవహార శైలిని ఎండగడుతూ అతనిపైన చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ను కోరారు, ఈ కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    4 hrs ago
  • PPP విధానం ఆపండి
    1
    PPP విధానం ఆపండి
    user_K.సూర్యనారాయణ
    K.సూర్యనారాయణ
    Political party office Podalakur, Spsr Nellore•
    3 hrs ago
  • చిత్తూరు... సెంటర్... పలమనేరు ... బైరెడ్డిపల్లి మండలo బైరెడ్డిపల్లి లో ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్ట్ ... 16 కేజీల గంజాయి స్వాధీనం ... నాయుడుపేట to పలమనేర్ కు గంజాయి సప్లై చేసిన స్మగ్లర్ ... స్మగ్లర్ నుండి ఇతర మండలాల విక్రయదారులకు చేరుకుంటున్న గంజాయి ... ప్రధాన స్మగ్లర్లు పట్టుకుని ఊచలు లెక్క పెట్టిస్తాం అంటున్న పోలీసులు ... వినియోగదారులకు సైతం పోలీస్ కౌన్సిలింగ్ ఇస్తాం
    1
    చిత్తూరు...
సెంటర్... పలమనేరు 
... బైరెడ్డిపల్లి మండలo బైరెడ్డిపల్లి లో ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్ట్ 
... 16 కేజీల గంజాయి స్వాధీనం 
... నాయుడుపేట to  పలమనేర్  కు గంజాయి సప్లై చేసిన స్మగ్లర్ 
... స్మగ్లర్ నుండి ఇతర మండలాల విక్రయదారులకు చేరుకుంటున్న గంజాయి
... ప్రధాన స్మగ్లర్లు పట్టుకుని   ఊచలు లెక్క పెట్టిస్తాం అంటున్న పోలీసులు
... వినియోగదారులకు సైతం పోలీస్ కౌన్సిలింగ్ ఇస్తాం
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఆసుపత్రిలో తండ్రి ప్రేమను చూపించిన హృదయవిదారక వీడియో. అనారోగ్యంతో ఉన్న తన కూతురిని సంతోషంగా ఉంచేందుకు తండ్రి నవ్వుతూ, ఆమెతో మాట్లాడుతూ పక్కనే ఉండే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
    1
    ఆసుపత్రిలో తండ్రి ప్రేమను చూపించిన హృదయవిదారక వీడియో.
అనారోగ్యంతో ఉన్న తన కూతురిని సంతోషంగా ఉంచేందుకు తండ్రి నవ్వుతూ, ఆమెతో మాట్లాడుతూ పక్కనే ఉండే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.