ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సహకారంతో హైవే పక్కన నూతన చలివేంద్రం గోనెగండ్ల మండల కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వాల్మీకి నాగేష్ నాయుడు గారి నివాసంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన మద్దూర్ సుభాష్ చంద్రబోస్ ని శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. వాల్మీకి నాగేష్ నాయుడు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉందని, బీసీ వర్గాల ఐక్యతతో పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో 2029 ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీ విజయానికి బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పరిశీలకులు మద్దూర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. పార్టీ కార్యకర్తలందరితో సమన్వయం చేసుకొని 2029 ఎన్నికల్లో ఎమ్మిగనూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. తమ కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలు అందించాలని కోరారు.అలాగే పార్టీ ద్వారా ఇప్పటికే కొన్ని పదవులు పొందిన నాయకులకు సంబంధించిన కార్డుల విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఉన్నదని, చాలా మంది కార్యకర్తలు తమకు కార్డులు అందలేదని బాధపడుతున్నారని నాయకులు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని చంద్రబోస్ ని కోరారు. పార్టీ ఇచ్చిన పదవులకు సంబంధించిన కార్డులు ఇవ్వకుండా అడ్డంకులు కల్పించడం తగదని, అవసరమైతే ఈ విషయంపై పార్టీ అధినేతను కలిసి ఫిర్యాదు చేస్తామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోనెగండ్ల మండల ఉపాధ్యక్షులు పేట అల్లబకాష్, మండల ప్రధాన కార్యదర్శులు లింగన్న, బి. శీను,నాయకులు హుస్సేన్ , అల్లబండ గౌస్ , పెయింటర్ రెహమాన్, కారుమంచి చాంద్ , షాషా, కే. హరి , చంద్రశేఖర్ , అలీ బహుదూర్ , భారతం నజీర్ , మాల చిన్న స్వామి, కంపల మునిస్వామి గిరిని ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సహకారంతో హైవే పక్కన నూతన చలివేంద్రం గోనెగండ్ల మండల కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వాల్మీకి నాగేష్ నాయుడు గారి నివాసంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన మద్దూర్ సుభాష్ చంద్రబోస్ ని శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. వాల్మీకి నాగేష్ నాయుడు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉందని, బీసీ వర్గాల ఐక్యతతో పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో 2029 ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీ విజయానికి బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పరిశీలకులు మద్దూర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. పార్టీ కార్యకర్తలందరితో సమన్వయం చేసుకొని 2029 ఎన్నికల్లో ఎమ్మిగనూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి
చేస్తామని చెప్పారు. తమ కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలు అందించాలని కోరారు.అలాగే పార్టీ ద్వారా ఇప్పటికే కొన్ని పదవులు పొందిన నాయకులకు సంబంధించిన కార్డుల విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఉన్నదని, చాలా మంది కార్యకర్తలు తమకు కార్డులు అందలేదని బాధపడుతున్నారని నాయకులు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని చంద్రబోస్ ని కోరారు. పార్టీ ఇచ్చిన పదవులకు సంబంధించిన కార్డులు ఇవ్వకుండా అడ్డంకులు కల్పించడం తగదని, అవసరమైతే ఈ విషయంపై పార్టీ అధినేతను కలిసి ఫిర్యాదు చేస్తామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోనెగండ్ల మండల ఉపాధ్యక్షులు పేట అల్లబకాష్, మండల ప్రధాన కార్యదర్శులు లింగన్న, బి. శీను,నాయకులు హుస్సేన్ , అల్లబండ గౌస్ , పెయింటర్ రెహమాన్, కారుమంచి చాంద్ , షాషా, కే. హరి , చంద్రశేఖర్ , అలీ బహుదూర్ , భారతం నజీర్ , మాల చిన్న స్వామి, కంపల మునిస్వామి గిరిని ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.
- కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.4
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.1
- కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.1
- కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు.2
- పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4