logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వినాయక నవరాత్రి ఉత్సవాలకు డీజే పూర్తిగా నిషేధం : ఎస్ఐ తక్కియుద్దీన్ డీజే పూర్తిగా నిషేధం : ఎస్ఐ తక్కియుద్దీన్ రాజాపేట సెప్టెంబర్ 15 వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, నిమజ్జనం సమయంలో డీజెలు పూర్తిగా నిషేధమని రాజపేట ఎస్సై తక్కియుద్దీన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి పది గంటల తర్వాత మైకుల వినియోగం నిషేధమని, మంటపం ఏర్పాటు చట్టపరమైన అనుమతులు అవసరమని పోలీసు విద్యుత్తు శాఖల నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు రాత్రివేళలో మంటపాల వద్ద కమిటీ సభ్యులు కాపలాగా ఉండాలని బాధ్యతలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం సమయాన్ని ముందుగా సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించిన మార్గంలోనే నిమజ్జనం జరగాలని ఊరేగింపులో డీజేలు అనుమతి లేవన్నారు.

5 hrs ago
user_Bhupathi Srinivas
Bhupathi Srinivas
రాజపేట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
5 hrs ago
3010bd66-bf81-442e-8376-344fee74bb6e

వినాయక నవరాత్రి ఉత్సవాలకు డీజే పూర్తిగా నిషేధం : ఎస్ఐ తక్కియుద్దీన్ డీజే పూర్తిగా నిషేధం : ఎస్ఐ తక్కియుద్దీన్ రాజాపేట సెప్టెంబర్ 15 వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, నిమజ్జనం సమయంలో డీజెలు పూర్తిగా నిషేధమని రాజపేట ఎస్సై తక్కియుద్దీన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి పది గంటల తర్వాత మైకుల వినియోగం నిషేధమని, మంటపం ఏర్పాటు చట్టపరమైన అనుమతులు అవసరమని పోలీసు విద్యుత్తు శాఖల నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు రాత్రివేళలో మంటపాల వద్ద కమిటీ సభ్యులు కాపలాగా ఉండాలని బాధ్యతలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం సమయాన్ని ముందుగా సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించిన మార్గంలోనే నిమజ్జనం జరగాలని ఊరేగింపులో డీజేలు అనుమతి లేవన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలో MEOల కొరతపై కవిత ఆందోళన ప్రతి మండలానికి ఎంఈఓ ఉండాలి తెలంగాణలో సుమారు 620 మండలాలు ఉండగా, ప్రతి మండలానికి ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) ఉండాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కవిత అన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 8 మండలాల్లో మాత్రమే పర్మనెంట్ MEOలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. విద్యాశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన MEO పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా పరిపాలనపై ప్రభావం పడుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి శాశ్వత MEOను నియమించి విద్యాశాఖను బలోపేతం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    1
    తెలంగాణలో MEOల కొరతపై కవిత ఆందోళన ప్రతి మండలానికి ఎంఈఓ ఉండాలి
తెలంగాణలో సుమారు 620 మండలాలు ఉండగా, ప్రతి మండలానికి ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) ఉండాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కవిత అన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 8 మండలాల్లో మాత్రమే పర్మనెంట్ MEOలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
విద్యాశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన MEO పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా పరిపాలనపై ప్రభావం పడుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి శాశ్వత MEOను నియమించి విద్యాశాఖను బలోపేతం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన
ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు.
ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
    1
    బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు
హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన
పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం. బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్‌ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్‌ చైర్మన్‌ మీనాక్షి డాక్టర్‌ మోహన్‌నాయక్‌ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్‌ రమేష్‌, స్వామి, మల్లేష్‌, నర్సింలు, బాలచందర్‌, యాదగిరి, భాస్కర్‌, ఎల్లయ్య, సురేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
    2
    మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం.
బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్‌
మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్‌ చైర్మన్‌ మీనాక్షి డాక్టర్‌ మోహన్‌నాయక్‌ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్‌ రమేష్‌, స్వామి, మల్లేష్‌, నర్సింలు, బాలచందర్‌, యాదగిరి, భాస్కర్‌, ఎల్లయ్య, సురేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
    user_మహమ్మద్
    మహమ్మద్
    నిజాంపేట, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    1
    ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ 
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    9 hrs ago
  • వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.
    1
    వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి
కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.