logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు సిరిసిల్ల పట్టణం గీతానగర్ పీఎంశ్రీ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఒత్తిడి కలగకుండా, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణం గీతానగర్ లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంపు ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈరోజు జిల్లాలోని 9 పీఎంశ్రీ పాఠశాలతో పాటు, కేజీబీవీ రుద్రంగి లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రోజు వారీగా ఈరోజు నుండి 17 వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించ బడతాయని పేర్కొన్నారు. ఈరోజు మౌలిక వసతుల పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సమ్మర్ క్యాంపుల ప్రారంభం, రెండవ రోజు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు రెమిడియల్ తరగతుల ప్రారంభం, ఇంటర్మీడియట్ విద్యార్థుల రెమిడియల్ తరగతుల ముగింపు, మూడవ రోజు పాఠశాల విద్యా కార్యక్రమాలపై సర్పంచ్‌లతో నియోజకవర్గ స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహణ, నాలుగవ రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహణ, ఐదవ రోజు పుస్తక పఠనం ప్రాముఖ్యతపై జిల్లా, మండల గ్రంథాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ఆరవ రోజు ఆర్ట్, క్రాఫ్ట్ & కల్చరల్ డే నిర్వహణ, ఏడవ రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా నాట్యం, సంగీతం, చేతి రాత, చిత్రలేఖనం, కర్రసాము ఆటలు నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతీ రోజు విద్యార్థులకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఏ పాఠశాల విద్యార్థులైనా ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యా వారోత్సవాల ముగింపు రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి అత్యుత్తమైన మార్కులను పొందిన విద్యార్థులకు సన్మానం చేసి, నగదు బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. సిరిసిల్ల గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయని, ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించే స్థాయిలో డిమాండ్ ఉందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో ముందుకు రావడానికి చురుకుగా ఉన్న విద్యార్థులను ఇస్రో కు పంపిస్తామని, ఇప్పటికే చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. జీవితంలో విద్యార్థులు చదువుతో పాటు అన్నీ విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలని, అందుకే ఈ సమ్మర్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు నైపుణ్యాలను వెలికితీసేలా ఏదైనా ఒక హాబీ ఉండాలని, లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా కష్టపడి, జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో 589 మార్కులు సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని అంకాలపు సిరికి సన్మానం చేసి అభినందించారు. అనంతరం సమ్మర్ క్యాంపు విద్యార్థులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, మండల విద్యాధికారి రఘుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
1 hr ago

విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు సిరిసిల్ల పట్టణం గీతానగర్ పీఎంశ్రీ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఒత్తిడి కలగకుండా, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణం గీతానగర్ లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంపు ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈరోజు జిల్లాలోని 9 పీఎంశ్రీ పాఠశాలతో పాటు, కేజీబీవీ రుద్రంగి లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రోజు

వారీగా ఈరోజు నుండి 17 వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించ బడతాయని పేర్కొన్నారు. ఈరోజు మౌలిక వసతుల పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సమ్మర్ క్యాంపుల ప్రారంభం, రెండవ రోజు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు రెమిడియల్ తరగతుల ప్రారంభం, ఇంటర్మీడియట్ విద్యార్థుల రెమిడియల్ తరగతుల ముగింపు, మూడవ రోజు పాఠశాల విద్యా కార్యక్రమాలపై సర్పంచ్‌లతో నియోజకవర్గ స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహణ, నాలుగవ రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహణ, ఐదవ రోజు పుస్తక పఠనం ప్రాముఖ్యతపై జిల్లా, మండల గ్రంథాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ఆరవ రోజు ఆర్ట్, క్రాఫ్ట్ & కల్చరల్ డే నిర్వహణ, ఏడవ రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా నాట్యం, సంగీతం, చేతి రాత, చిత్రలేఖనం, కర్రసాము ఆటలు నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతీ రోజు విద్యార్థులకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఏ పాఠశాల విద్యార్థులైనా ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యా వారోత్సవాల ముగింపు రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి అత్యుత్తమైన మార్కులను పొందిన విద్యార్థులకు సన్మానం చేసి, నగదు బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. సిరిసిల్ల గీతానగర్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయని, ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించే స్థాయిలో డిమాండ్ ఉందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో ముందుకు రావడానికి చురుకుగా ఉన్న విద్యార్థులను ఇస్రో కు పంపిస్తామని, ఇప్పటికే చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. జీవితంలో విద్యార్థులు చదువుతో పాటు అన్నీ విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలని, అందుకే ఈ సమ్మర్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు నైపుణ్యాలను వెలికితీసేలా ఏదైనా ఒక హాబీ ఉండాలని, లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా కష్టపడి, జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో 589 మార్కులు సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని అంకాలపు సిరికి సన్మానం చేసి అభినందించారు. అనంతరం సమ్మర్ క్యాంపు విద్యార్థులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, మండల విద్యాధికారి రఘుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత వేసవి ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసంతో పాటు పలు అంశాల్లో శిక్షణ అందిస్తారు. మే 11 నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్ విద్యార్థులకు సూచించారు.
    4
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత వేసవి ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసంతో పాటు పలు అంశాల్లో శిక్షణ అందిస్తారు. మే 11 నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్ విద్యార్థులకు సూచించారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి* *బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలి.* ⁠*పోలీస్ స్టేషన్ లో సామాన్యులకు న్యాయం జరగడం లేదు.* . AIFB బండారి శేఖర్ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని ప్లే కార్డులతో మంచిర్యాల చౌరస్థలో నిరసన చేయడం జరిగింది. - బీజేపీ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ AIFB కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రంగా ఖండించారు. వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేశారు. సామాన్యులకు ఒక న్యాయం ధనవంతులకు, ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పోలీస్ వ్వవస్థ పూర్తిగా బ్రష్టు పట్టిందని ఏద్ధవ చేశారు. సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భగీరథ్‌పై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా హోంశాఖ, డీజీపీ ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు., తక్షణమే అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, న్యాయం చేయాలనీ అన్నారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితురాలి కుటుంబంపైనే కరీంనగర్‌లో అక్రమంగా కేసులు బాణయించి వేదించడం అన్యాయమని అన్నారు. నిందితుడి వేధింపులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన రాజకీయ, అధికార బలంతో కేసును ఉపసంహరించుకోవాలంటూ బాధితులను బెదిరించడం జరుగుతుందని, కేసును కూడా పక్కదోవ పట్టించే పరిస్థితి కనపడుతున్నదని అన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తూ, బాలిక కుటుంబంపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.బాలిక కుటుంబనికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బద్రినేత, అరుణ్ , కల, లత, అరుణ, శారదా శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు
    2
    అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి*
*బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలి.*
⁠*పోలీస్ స్టేషన్ లో సామాన్యులకు న్యాయం జరగడం లేదు.*
.
AIFB బండారి శేఖర్ 
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని ప్లే కార్డులతో మంచిర్యాల చౌరస్థలో నిరసన చేయడం జరిగింది.  
- బీజేపీ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ AIFB కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రంగా ఖండించారు. వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేశారు. సామాన్యులకు ఒక న్యాయం ధనవంతులకు, ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పోలీస్ వ్వవస్థ పూర్తిగా బ్రష్టు పట్టిందని ఏద్ధవ చేశారు. సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
భగీరథ్‌పై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా హోంశాఖ, డీజీపీ ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు., తక్షణమే అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, న్యాయం చేయాలనీ అన్నారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితురాలి కుటుంబంపైనే కరీంనగర్‌లో అక్రమంగా కేసులు బాణయించి వేదించడం అన్యాయమని అన్నారు. నిందితుడి వేధింపులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాలిక  రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుందని అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ తన రాజకీయ, అధికార బలంతో కేసును ఉపసంహరించుకోవాలంటూ బాధితులను బెదిరించడం జరుగుతుందని, కేసును కూడా పక్కదోవ పట్టించే పరిస్థితి కనపడుతున్నదని అన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తూ, బాలిక కుటుంబంపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.బాలిక కుటుంబనికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బద్రినేత, అరుణ్ , కల, లత, అరుణ, శారదా శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
    1
    రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
    user_Srinivas Nerella
    Srinivas Nerella
    Yoga instructor మల్యాల, జగిత్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి,తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లాలోని మెట్ పెల్లి మండలంలోని ఆత్మకూర్, ఆత్మ నగర్, వెల్లుల్ల గ్రామంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులు, ధాన్యంకొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో  మాట్లాడుతూ....కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని  దాన్యంను ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నందున ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు కురిస్తే రైతులు చెట్ల కింద, కరెంటు పోల్స్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పరిశీలనలో మండల తహసిల్దార్ నీత, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
    1
    వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి,తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల
జిల్లాలోని మెట్ పెల్లి మండలంలోని ఆత్మకూర్, ఆత్మ నగర్, వెల్లుల్ల గ్రామంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులు, ధాన్యంకొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో  మాట్లాడుతూ....కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని  దాన్యంను ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నందున ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు కురిస్తే రైతులు చెట్ల కింద, కరెంటు పోల్స్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ పరిశీలనలో మండల తహసిల్దార్ నీత, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • కామారెడ్డి జిల్లా : ప్రతి రైతుకు 11 నెంబర్లతో యూనికోడ్ కేటాయించాలి రెవెన్యూ శాఖను ఆదేశించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఫార్మర్ రిజిస్టీ ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనికోడ్) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది. భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నిర్మించబడుతుంది. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరములను రైతు యొక్క ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడి ని కేటాయించడం జరుగుతుంది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు ఏ రకమైన చట్టబద్ధ యాజమాన్య హక్కును కల్పించదు. కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఈ రైతులకు ఫార్మర్ ఐడి కేటాయించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిచిన పథకాలు అయిన రైతు భరోసా రుణమాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ రకమైన సంబంధం లేదు. రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్ ఐడి) పొందుటకు మీ ఆధార్ మరియు భూ యాజమాన్య పాస్ పుస్తకము ఆధార్ కు లింక్ చేయబడిన మొబైల్ నెంబరు తీసుకొని సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ ఐడీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
    1
    కామారెడ్డి జిల్లా : ప్రతి రైతుకు 11 నెంబర్లతో యూనికోడ్ కేటాయించాలి రెవెన్యూ శాఖను ఆదేశించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ఫార్మర్ రిజిస్టీ
ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనికోడ్) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది.
భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నిర్మించబడుతుంది. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరములను రైతు యొక్క ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడి ని కేటాయించడం జరుగుతుంది.
ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు ఏ రకమైన చట్టబద్ధ యాజమాన్య హక్కును కల్పించదు. కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఈ రైతులకు ఫార్మర్ ఐడి కేటాయించడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ సంబంధిచిన పథకాలు అయిన రైతు భరోసా రుణమాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ రకమైన సంబంధం లేదు.
రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్ ఐడి) పొందుటకు మీ ఆధార్ మరియు భూ యాజమాన్య పాస్ పుస్తకము ఆధార్ కు లింక్ చేయబడిన మొబైల్ నెంబరు తీసుకొని సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ ఐడీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • రామాయంపేట పట్టణ అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కౌన్సిలర్ శంకర్ గౌడ్. రామాయంపేట: మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిలర్ జె. శంకర్ గౌడ్ గళమెత్తారు. అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 40 ఫీట్ల ప్రధాన రహదారి విస్తరణకు తక్షణమే మార్కింగ్ చేసి, బాధితులకు ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేశారు. బజాజ్ షోరూం వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, జాప్యం చేయకుండా పూర్తి చేయాలని కోరారు.​గత బీఆర్ఎస్ పాలనలో రామాయంపేట వెనుకబాటుకు గురైందని విమర్శిస్తూ.. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్, ఎమ్మెల్యేలు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన TUFIDC నిధులతో పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.
    1
    రామాయంపేట పట్టణ అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కౌన్సిలర్ శంకర్ గౌడ్.
రామాయంపేట: మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిలర్ జె. శంకర్ గౌడ్ గళమెత్తారు. అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 40 ఫీట్ల ప్రధాన రహదారి విస్తరణకు తక్షణమే మార్కింగ్ చేసి, బాధితులకు ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేశారు. బజాజ్ షోరూం వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, జాప్యం చేయకుండా పూర్తి చేయాలని కోరారు.​గత బీఆర్ఎస్ పాలనలో రామాయంపేట వెనుకబాటుకు గురైందని విమర్శిస్తూ.. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్, ఎమ్మెల్యేలు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన TUFIDC నిధులతో పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter రామాయంపేట, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ లో వినతి పత్రాన్ని అందజేసిన బిఆర్ఎస్వి నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ ఒక మైనర్ బాలిక విషయం లో బండి సంజయ్ కుమారిని పై వస్తున్న ఆరోపణల్లో నిష్పక్షపాతంగా న్యాయం జరగాలంటే బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అలాగే అతని కుమారునిపై కేసు నమోదై 48 గంటలు గడిచిపోతున్న కూడా అరెస్ట్ చేయలేదని pocso కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కు బదులు బెయిలబుల్ సెక్షన్ లు పెట్టారని అన్నారు.pocso ఆక్ట్ లో సెక్షన్ 8 ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
    1
    సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ లో వినతి పత్రాన్ని అందజేసిన బిఆర్ఎస్వి నాయకులు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ ఒక మైనర్ బాలిక విషయం లో బండి సంజయ్ కుమారిని పై వస్తున్న ఆరోపణల్లో నిష్పక్షపాతంగా న్యాయం జరగాలంటే బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అలాగే అతని కుమారునిపై కేసు నమోదై 48 గంటలు గడిచిపోతున్న కూడా అరెస్ట్ చేయలేదని pocso కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కు బదులు బెయిలబుల్ సెక్షన్ లు పెట్టారని అన్నారు.pocso ఆక్ట్ లో సెక్షన్ 8 ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్‌లో బండి సంజయ్ కొడుకు సాయి భగీరత్‌ను పోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు నాయకుల ప్లకార్డులు ప్రదర్శించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బారాసా సవాల్ విసిరింది.
    3
    కరీంనగర్‌లో బండి సంజయ్ కొడుకు సాయి భగీరత్‌ను పోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు నాయకుల ప్లకార్డులు ప్రదర్శించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బారాసా సవాల్ విసిరింది.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    8 hrs ago
  • ఉద్యమాలకు పేరుబడిన కరీంనగర్, నేరాలకు ప్రతీకగా చర్చకు రావడం దురదృష్టకరం : ప్రెస్ మీట్ లో brs నాయకులు  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ దావా వసంత సురేష్,పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆయిల్నేని వెంకటేశ్వర రావుతో కలిసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమాలకు పేరుబడిన కరీంనగర్ నేరాలకు ప్రతీకగా చర్చకు రావడం దురదృష్టకరం అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు నైతిక విలువలు ఉంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. భగీరథ్ పై ఉద్దేశ పూర్వకముగా నేరానికి అనుగుణమైన సెక్షన్లు పెట్టకుండా తప్పించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలన్నారు.
    1
    ఉద్యమాలకు పేరుబడిన కరీంనగర్, నేరాలకు ప్రతీకగా చర్చకు రావడం దురదృష్టకరం : ప్రెస్ మీట్ లో brs నాయకులు 
జగిత్యాల 
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ దావా వసంత సురేష్,పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆయిల్నేని వెంకటేశ్వర రావుతో కలిసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉద్యమాలకు పేరుబడిన కరీంనగర్ నేరాలకు ప్రతీకగా చర్చకు రావడం దురదృష్టకరం అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు నైతిక విలువలు ఉంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.
భగీరథ్ పై ఉద్దేశ పూర్వకముగా నేరానికి అనుగుణమైన సెక్షన్లు పెట్టకుండా తప్పించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.