logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన మామిడి పర్శరాం ఇటీవల గుండె పోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో బత్తిని స్వామిగౌడ్ మృతి చెందిన పర్శరాం కుటుంబానికి 50 కిలోల బియ్యం బస్తాను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బిల్లమీది పరశురాం, ఏనుగుల లింగారెడ్డి, ఉత్కం పరశురాం, కత్తి వీరయ్య, చెర్ల శ్రీనివాస్, కొమ్ము కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
Bollam Saireddy జయం న్యూస్ మీడ
Interior designer Manakondur, Karimnagar•
1 hr ago
bf6c263d-6d36-41f1-8d26-f4dec632134b

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన మామిడి పర్శరాం ఇటీవల గుండె పోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో బత్తిని స్వామిగౌడ్ మృతి చెందిన పర్శరాం కుటుంబానికి 50 కిలోల బియ్యం బస్తాను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బిల్లమీది పరశురాం, ఏనుగుల లింగారెడ్డి, ఉత్కం పరశురాం, కత్తి వీరయ్య, చెర్ల శ్రీనివాస్, కొమ్ము కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయాయని ఆటో యూనియన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని, కుటుంబాలను పోషించలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ఆటోలు బంద్ చేసి, సమ్మెకు దిగాలని వారు తీర్మానించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల ఆటో డ్రైవర్ల అధ్యక్ష, కార్యదర్శులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆటో డ్రైవర్‌కు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మరియు ఆటో డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు, ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీవో ఆఫీసులో వాహనాల ఫిట్నెస్ పైన రేడియం వేస్తూ చేస్తున్న కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు నెలలో ఆటో డ్రైవర్లందరూ ఏకమై సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    1
    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయాయని ఆటో యూనియన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని, కుటుంబాలను పోషించలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ఆటోలు బంద్ చేసి, సమ్మెకు దిగాలని వారు తీర్మానించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల ఆటో డ్రైవర్ల అధ్యక్ష, కార్యదర్శులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆటో డ్రైవర్‌కు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మరియు ఆటో డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో పాటు, ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీవో ఆఫీసులో వాహనాల ఫిట్నెస్ పైన రేడియం వేస్తూ చేస్తున్న కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు నెలలో ఆటో డ్రైవర్లందరూ ఏకమై సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని చర్ల బూత్కూరు గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు ప్రక్రియకు సంబంధించిన సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ పిలుపు మేరకు బూత్ ఇన్‌ఛార్జులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు ఈ కేంద్రాన్ని ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు నమోదు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సహాయ కేంద్రంలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుకర్, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, వార్డ్ మెంబర్ తప్పెట్ల నరేష్‌తో పాటు బీఎల్ఏలు, బీఎల్ఓలు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని చర్ల బూత్కూరు గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు ప్రక్రియకు సంబంధించిన సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ పిలుపు మేరకు బూత్ ఇన్‌ఛార్జులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు ఈ కేంద్రాన్ని ప్రారంభించి, పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు నమోదు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సహాయ కేంద్రంలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుకర్, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, వార్డ్ మెంబర్ తప్పెట్ల నరేష్‌తో పాటు బీఎల్ఏలు, బీఎల్ఓలు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • వడ్లను లారీల కొద్దీ యథేచ్ఛగా అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, వరి ధాన్యం ఎక్కడికి తరలిపోతుందనే అంశంపై ఎటువంటి నిఘా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులలో కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడం అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఈ వరి ధాన్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రైస్ మిల్లర్లు, అధికారులు, బడా నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీల కొద్దీ వడ్లను అక్రమంగా అమ్ముకుంటుంటే అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
    1
    వడ్లను లారీల కొద్దీ యథేచ్ఛగా అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, వరి ధాన్యం ఎక్కడికి తరలిపోతుందనే అంశంపై ఎటువంటి నిఘా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులలో కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడం అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు.

ఈ వరి ధాన్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రైస్ మిల్లర్లు, అధికారులు, బడా నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీల కొద్దీ వడ్లను అక్రమంగా అమ్ముకుంటుంటే అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్థులంతా కలిసి దరిద్ర దేవతగా భావించే ‘జెట్టక్క’ను ఊరి నుంచి తరిమికొట్టారు. వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రామంలో సరైన వర్షాలు కురవడం లేదని, అందుకే అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, ప్రజల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ సర్పంచ్ గండి నారాయణ తెలిపారు. ఈ ఆచారంలో భాగంగా జెట్టక్కను గ్రామం నుండి వెళ్లగొట్టాలనే ఉద్దేశంతో గ్రామస్థులు తమ ఇళ్లలోని పాత వస్తువులు, బట్టలు, చీపురుకట్టలు, చాటలను సేకరించారు. వీటిని డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ గ్రామ శివారు వరకు ర్యాలీగా తీసుకెళ్లి పడేశారు. కొన్ని పాత వస్తువులను ట్రాక్టర్ల ద్వారా కూడా గ్రామ శివారుకు తరలించారు. జెట్టక్క (దరిద్ర దేవత) బయటకు వెళ్లి, లచ్చక్క (లక్ష్మీదేవి) గ్రామంలోకి ప్రవేశించాలని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని గ్రామ ప్రజలు, నాయకులు ఆకాంక్షించారు. అలాగే వర్షాల కోసం రానున్న రోజుల్లో కప్పతల్లి ఆట, వరుణ యాగం కూడా నిర్వహిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్థులంతా కలిసి దరిద్ర దేవతగా భావించే ‘జెట్టక్క’ను ఊరి నుంచి తరిమికొట్టారు. వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రామంలో సరైన వర్షాలు కురవడం లేదని, అందుకే అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, ప్రజల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ సర్పంచ్ గండి నారాయణ తెలిపారు.

ఈ ఆచారంలో భాగంగా జెట్టక్కను గ్రామం నుండి వెళ్లగొట్టాలనే ఉద్దేశంతో గ్రామస్థులు తమ ఇళ్లలోని పాత వస్తువులు, బట్టలు, చీపురుకట్టలు, చాటలను సేకరించారు. వీటిని డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ గ్రామ శివారు వరకు ర్యాలీగా తీసుకెళ్లి పడేశారు. కొన్ని పాత వస్తువులను ట్రాక్టర్ల ద్వారా కూడా గ్రామ శివారుకు తరలించారు. జెట్టక్క (దరిద్ర దేవత) బయటకు వెళ్లి, లచ్చక్క (లక్ష్మీదేవి) గ్రామంలోకి ప్రవేశించాలని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని గ్రామ ప్రజలు, నాయకులు ఆకాంక్షించారు. అలాగే వర్షాల కోసం రానున్న రోజుల్లో కప్పతల్లి ఆట, వరుణ యాగం కూడా నిర్వహిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు కలవడం వల్ల చేప పిల్లలు మృతి చెందుతున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి, మత్స్యకారుల జీవనాధారానికి ఎంతో కీలకమైన తోటపల్లి రిజర్వాయర్ను కాలుష్యానికి గురిచేయడం సరికాదని ఆయన శనివారం అన్నారు. కలుషితమైన ఈ నీటిని పంటలకు ఉపయోగించడం వల్ల భూముల సారవంతం తగ్గే ప్రమాదం ఉందని, అలాగే పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రిజర్వాయర్లోకి వ్యర్థ జలాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలన్నారు. ప్రజా సమస్యలపై నిరసనగా బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, నాయకులు లింగాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ దుమాల మహేష్, వంగల నరేష్, వార్డు సభ్యులు తిప్పరపు మహేష్, పొట్లపెల్లి శివ, రామంచ పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు కలవడం వల్ల చేప పిల్లలు మృతి చెందుతున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి, మత్స్యకారుల జీవనాధారానికి ఎంతో కీలకమైన తోటపల్లి రిజర్వాయర్ను కాలుష్యానికి గురిచేయడం సరికాదని ఆయన శనివారం అన్నారు.

కలుషితమైన ఈ నీటిని పంటలకు ఉపయోగించడం వల్ల భూముల సారవంతం తగ్గే ప్రమాదం ఉందని, అలాగే పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రిజర్వాయర్లోకి వ్యర్థ జలాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలన్నారు.

ప్రజా సమస్యలపై నిరసనగా బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, నాయకులు లింగాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ దుమాల మహేష్, వంగల నరేష్, వార్డు సభ్యులు తిప్పరపు మహేష్, పొట్లపెల్లి శివ, రామంచ పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    Tour operator గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఉపసర్పంచ్ ధూమాల మహేష్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు గ్రామ సర్పంచ్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే, వాటిని ప్రజల ముందు ఉంచాలని ఆయన సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని ఆయన హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా ధూమాల మహేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి వేణు, లింగాల వెంకటేష్, దొంతరవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఉపసర్పంచ్ ధూమాల మహేష్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు గ్రామ సర్పంచ్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే, వాటిని ప్రజల ముందు ఉంచాలని ఆయన సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని ఆయన హితవు పలికారు.

రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా ధూమాల మహేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి వేణు, లింగాల వెంకటేష్, దొంతరవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న 14 మంది బదిలీ ఉద్యోగులకు ఆదివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి బదిలీపై వేములవాడకు వచ్చిన ఈ ఉద్యోగులను, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి అధికారికంగా రిలీవ్ చేశారు. భీమేశ్వర సదన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి ఉద్యోగులందరికీ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వేములవాడ దేవస్థానంలో గత రెండేళ్లుగా ఉద్యోగులు అంకితభావంతో అందించిన సేవలను కొనియాడారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామివారి సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఈవో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకలో అటు ఆనందంతో పాటు ఇటు వీడ్కోలు బాధ కూడా స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఈఈ రాజేష్, ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థాన అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ విధి నిర్వహణలో క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేసి దేవస్థానం అభివృద్ధికి ఈ ఉద్యోగులు విశేషంగా కృషి చేశారని పలువురు అధికారులు వారిని అభినందించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న 14 మంది బదిలీ ఉద్యోగులకు ఆదివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి బదిలీపై వేములవాడకు వచ్చిన ఈ ఉద్యోగులను, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి అధికారికంగా రిలీవ్ చేశారు.

భీమేశ్వర సదన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి ఉద్యోగులందరికీ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వేములవాడ దేవస్థానంలో గత రెండేళ్లుగా ఉద్యోగులు అంకితభావంతో అందించిన సేవలను కొనియాడారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామివారి సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఈవో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకలో అటు ఆనందంతో పాటు ఇటు వీడ్కోలు బాధ కూడా స్పష్టంగా కనిపించింది.

ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఈఈ రాజేష్, ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థాన అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ విధి నిర్వహణలో క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేసి దేవస్థానం అభివృద్ధికి ఈ ఉద్యోగులు విశేషంగా కృషి చేశారని పలువురు అధికారులు వారిని అభినందించారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    26 min ago
  • కరీంనగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    2
    కరీంనగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.