logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

క్యాంపు కార్యాలయంలో తన సోదరితో రాఖీ కట్టించుకున్న ఎమ్మెల్యే మురళి నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తన క్యాంపు కార్యాల యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరీ మలోత్ సరోజిని వారి కుమారుడు యువన్ చేత రాఖీలు కట్టించుకున్నారు ఈ సందర్భంగా మహబూబాబాద్ నియోజక వర్గ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మురళి నాయక్ పేర్కొన్నారు సోదరీమణుల ప్రేమ ఆప్యాయతలు ఎల్లప్పుడూ తనకు అండగా నిలుస్తాయని అన్నారు.

2 hrs ago
user_ఆంగోత్ లక్ష్మణ్
ఆంగోత్ లక్ష్మణ్
మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
2 hrs ago
37dedb16-3cc7-4643-8942-4c38b313f29d
17258b85-b51a-40e3-87ff-c7af7f74f7a0
9f376ae3-32a3-443f-940c-139d4bbdce97

క్యాంపు కార్యాలయంలో తన సోదరితో రాఖీ కట్టించుకున్న ఎమ్మెల్యే మురళి నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తన క్యాంపు కార్యాల యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరీ మలోత్ సరోజిని వారి కుమారుడు యువన్ చేత రాఖీలు కట్టించుకున్నారు ఈ సందర్భంగా మహబూబాబాద్ నియోజక వర్గ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మురళి నాయక్ పేర్కొన్నారు సోదరీమణుల ప్రేమ ఆప్యాయతలు ఎల్లప్పుడూ తనకు అండగా నిలుస్తాయని అన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • బెయిల్ .. 40 ఏళ్లు పరార్... హత్య కేసులో జీవిత ఖైదీ.. పేరు మార్చుకుని ఉద్యోగం.. 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు.. చివరకు అరెస్టు.. ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్ పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుం డా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపాడు .. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ఏకంగా 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు. గెలుచుకొన్నాడు .. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. అయ్యాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది 1982లో మహబూబాబాద్ లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, ఈ కేసులో నిందితుడుగా ఉన్న వీరన్న కు వరంగల్ అద నపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. పెరోల్ పై 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ ల కళ్ళకు దొరకకుండా తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని పట్టు కుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి 2013లో పదవీ విరమణ చేశాడు. కోసమేరుపు ఏమిటంటే పెన్షన్ కూడా పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు కూడా అందుకున్నరు 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టు కోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పుడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయ త్నాలు చేశారు 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు ఎట్టకేలకు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వీరన్న ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు.... అయితే వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు. మూడేళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పాందడం ఆశ్చర్యకరమని.... అంతే కాకుండా జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల అలసత్వం తెలియజేస్తోందని అందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్య త్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా చూడాలని హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు తెలియజేసింది ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాక రిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అతడిపై విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షను అనుభవించాల్సిం దేనని స్పష్టం చేశారు న్యాయమూర్తి.... ఫెరోల్ నిరాకరణతో..ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
    1
    బెయిల్ .. 40 ఏళ్లు పరార్... హత్య కేసులో జీవిత ఖైదీ..

పేరు మార్చుకుని ఉద్యోగం.. 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు.. చివరకు అరెస్టు..
ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్ పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుం డా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపాడు .. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ఏకంగా 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు. గెలుచుకొన్నాడు .. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. అయ్యాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది 
1982లో మహబూబాబాద్ లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, ఈ కేసులో  నిందితుడుగా ఉన్న వీరన్న కు వరంగల్ అద నపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. 
పెరోల్ పై 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ ల కళ్ళకు దొరకకుండా తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని పట్టు కుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి  2013లో పదవీ విరమణ చేశాడు. కోసమేరుపు ఏమిటంటే పెన్షన్ కూడా పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు కూడా అందుకున్నరు 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టు కోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పుడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయ త్నాలు చేశారు 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు ఎట్టకేలకు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్   వీరన్న ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు....
అయితే 
వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు.  మూడేళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పాందడం ఆశ్చర్యకరమని....  అంతే కాకుండా జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల అలసత్వం తెలియజేస్తోందని అందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్య త్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా  చూడాలని హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు  తెలియజేసింది ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాక రిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అతడిపై విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షను అనుభవించాల్సిం దేనని స్పష్టం చేశారు న్యాయమూర్తి.... ఫెరోల్ నిరాకరణతో..ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • రాఖీ పండుగ వేళ ఆయుర్వేద విద్యార్థుల నిరసన.. స్టైఫండ్ పెంపు జీవో కోసం ఆందోళన వరంగల్: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పండుగను ఆనందంగా జరుపుకుంటుండగా, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు, హౌస్ సర్జన్లు మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కొనసాగించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ హక్కులు, భవిష్యత్తు కోసం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. స్టైఫండ్ పెంపు కోసం ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఆయుష్ వైద్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. స్టైఫండ్ పెంపు జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు, హౌస్ సర్జన్లు స్పష్టం చేశారు.
    1
    రాఖీ పండుగ వేళ ఆయుర్వేద విద్యార్థుల నిరసన.. స్టైఫండ్ పెంపు జీవో కోసం ఆందోళన
వరంగల్: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పండుగను ఆనందంగా జరుపుకుంటుండగా, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు, హౌస్ సర్జన్లు మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కొనసాగించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ హక్కులు, భవిష్యత్తు కోసం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. స్టైఫండ్ పెంపు కోసం ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఆయుష్ వైద్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
స్టైఫండ్ పెంపు జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు, హౌస్ సర్జన్లు స్పష్టం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • 🎯 “నడిరోడ్డుపై పోలీసుల దాష్టీకం.. కోదాడలో అసలేం జరిగింది?” సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో షాపుల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు.. మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐ.. ఆందోళన చేస్తున్న బాధితులపై దాడికి పాల్పడి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడ్డొచ్చిన మహిళలను సైతం పోలీసులు నెట్టివేసి, పలువురు బాధితులను అరెస్ట్ చేశారని వారు పేర్కొన్నారు.నడిరోడ్డుపై సీఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాపుల తొలగింపుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    🎯 “నడిరోడ్డుపై పోలీసుల దాష్టీకం.. కోదాడలో అసలేం జరిగింది?”
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో షాపుల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు.. మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐ.. ఆందోళన చేస్తున్న బాధితులపై దాడికి పాల్పడి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడ్డొచ్చిన మహిళలను సైతం పోలీసులు నెట్టివేసి, పలువురు బాధితులను అరెస్ట్ చేశారని వారు పేర్కొన్నారు.నడిరోడ్డుపై సీఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాపుల తొలగింపుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • రాఖీ పండుగ ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు రాఖీ పండుగ, ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు. విద్యా సంస్థల నుంచి పిల్లలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులతో రహదారులు కిక్కిరిశాయి. ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోవడంతో అడుగు పెట్టేందుకు స్థలం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల రద్దీ కూడా అధికంగా కనిపించింది.
    1
    రాఖీ పండుగ  ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు
రాఖీ పండుగ, ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు. విద్యా సంస్థల నుంచి పిల్లలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులతో రహదారులు కిక్కిరిశాయి. ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోవడంతో అడుగు పెట్టేందుకు స్థలం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల రద్దీ కూడా అధికంగా కనిపించింది.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • ములుగు జిల్లా కేంద్రంలో సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
    1
    ములుగు జిల్లా కేంద్రంలో సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
    user_Swathi
    Swathi
    గ్రాఫిక్ డిజైనర్ ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • అడ్డంగా వచ్చిన బైక్ ను తప్పించబోయి పల్టీ కొట్టిన వోల్వో బస్సు కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడ్డుగావచ్చిన బైక్ ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంపు ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
    1
    అడ్డంగా వచ్చిన బైక్ ను తప్పించబోయి పల్టీ కొట్టిన వోల్వో బస్సు
కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడ్డుగావచ్చిన బైక్ ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంపు ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • *ఆర్టీసీ డ్రైవర్‌ గా విధులలో ఉన్న తమ్ముడికి బస్సులోనే రాఖీ కట్టిన అక్క* సూర్యాపేట సిటీ ఆగస్టు 28: విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు రాఖీ కట్టిది ఒక మహిళా ప్రయాణికురాలు. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాజుకు రాజీవ్ రహదారిపై బస్సు ఆపించి డ్రైవర్ అక్క స్వప్న రాఖీ కట్టింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద విధుల్లో ఉన్న తన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
    1
    *ఆర్టీసీ డ్రైవర్‌ గా విధులలో ఉన్న తమ్ముడికి బస్సులోనే రాఖీ కట్టిన అక్క*

సూర్యాపేట సిటీ ఆగస్టు 28:
విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు రాఖీ కట్టిది ఒక మహిళా ప్రయాణికురాలు.
గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాజుకు రాజీవ్ రహదారిపై బస్సు ఆపించి  డ్రైవర్ అక్క స్వప్న రాఖీ కట్టింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద విధుల్లో ఉన్న తన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Local News Reporter Suryapet, Telangana•
    8 hrs ago
  • జనగామలో ఇంటి దొంగ అరెస్ట్.. 45 గ్రాముల బంగారం స్వాధీనం.. జనగామ: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దబ్బేట బాలలింగం అలియాస్ బాలు అలియాస్ ప్రవీణ్ రాజు (29)ను జనగామ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనగామలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. వరంగల్‌లో బంగారం విక్రయించేందుకు వెళ్తుండగా అతడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి రెండు జతల కమ్మలు, రెండు వరుసల చైన్, మరో చైన్ కలిపి 44.990 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో సుమారు 90 కేసులు ఉండగా, పీడీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
    1
    జనగామలో ఇంటి దొంగ అరెస్ట్.. 45 గ్రాముల బంగారం స్వాధీనం..
జనగామ: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దబ్బేట బాలలింగం అలియాస్ బాలు అలియాస్ ప్రవీణ్ రాజు (29)ను జనగామ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో జనగామలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. వరంగల్‌లో బంగారం విక్రయించేందుకు వెళ్తుండగా అతడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి రెండు జతల కమ్మలు, రెండు వరుసల చైన్, మరో చైన్ కలిపి 44.990 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో సుమారు 90 కేసులు ఉండగా, పీడీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.