logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు (ఆగస్టు 1 నుంచి 7 వరకు) జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు, మీడియా నోట్, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఇటీవల సూపర్వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి గుర్తించిన లోపాలను పరిశీలించి, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, గుర్తించిన ప్రతి లోపాన్ని నిర్దిష్ట గడువులోగా సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తల్లిపాలు ప్రతి శిశువుకు మొదటి హక్కు, సంపూర్ణ పోషకాహారమని పేర్కొన్నారు. పుట్టిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించడం, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వడం, అనంతరం వయస్సుకు తగిన అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం ద్వారా శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్లు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి ఆరు నెలల లోపు శిశువుల తల్లులు, రెండు సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ సరైన కౌన్సెలింగ్ అందించాలని, కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రసవించిన ప్రతి శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించేలా వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామాలు, వార్డుల్లో అవగాహన సమావేశాలు, ఇంటింటి సందర్శనలు, కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలు నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రాజమణి, సీడీపీఓలు, సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Sambashiva
Sambashiva
Khila Warangal, Telangana•
1 hr ago
d2a1aae2-b387-4515-bfb8-50f306411dfe

More news from తెలంగాణ and nearby areas
  • డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.
    1
    డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.
    1
    ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు
జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం  ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.  ప్రభుత్వ ఆదేశాల  మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి  నల్లబెల్లి లో నిర్వహించే  అంతిమ సంస్కారానికి హాజరై  నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు.
అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు,  కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.
    2
    తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత 
హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.
    user_P Jithender, Sr Reportar
    P Jithender, Sr Reportar
    Local News Reporter జనగాం, తెలంగాణ•
    14 hrs ago
  • ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share
    1
    ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం
👉 ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం
👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య
👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.
📡 T20HD Telugu news channel subscribe like share
    user_Sudagani HariKrishna goud
    Sudagani HariKrishna goud
    Nedu news paper గుండాల, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    3 hrs ago
  • కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    1
    కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • ప్రియ స్నేహితు లారా ఆయనకు నూతన జ్ఞానం మీ జీవితంలో మెండుగా ఉండబోతుంది
    1
    ప్రియ స్నేహితు లారా ఆయనకు నూతన జ్ఞానం మీ జీవితంలో మెండుగా ఉండబోతుంది
    user_T. Raja simha
    T. Raja simha
    ఆత్మకూరు, హనుమకొండ, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.