ప్రభుత్వ ఉద్యోగం సాధించిన గిరిజన యువతికి ఘన సన్మానం.. నాగదుర్గను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు... భద్రాచలం, సెప్టెంబర్ 15: దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి సోడి నాగదుర్గ ప్రభుత్వ ఉద్యోగం సాధించిన సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన సోడి ధర్మయ్య, శాంతమ్మ దంపతుల కుమార్తె నాగదుర్గ చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచింది. భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పదో తరగతి, శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్, వరంగల్‌లో బీటెక్ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తండ్రి ధర్మయ్య మృతి చెందినప్పటికీ, తల్లి శాంతమ్మ అందించిన ప్రోత్సాహంతో పట్టుదలగా చదువుకుంది. జిల్లా కోర్టు కార్యాలయం నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి భద్రాచలం ప్రథమ శ్రేణి మెజిస్ట్రేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నో కష్టాలను అధిగమించి నాగదుర్గ ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు. ఆమె విజయం గిరిజన, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన గిరిజన యువతికి ఘన సన్మానం.. నాగదుర్గను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు... భద్రాచలం, సెప్టెంబర్ 15: దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి సోడి నాగదుర్గ ప్రభుత్వ ఉద్యోగం సాధించిన సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన సోడి ధర్మయ్య, శాంతమ్మ దంపతుల కుమార్తె నాగదుర్గ చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచింది. భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పదో తరగతి, శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్, వరంగల్‌లో బీటెక్ పూర్తి
చేసింది. గ్రాడ్యుయేషన్ అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తండ్రి ధర్మయ్య మృతి చెందినప్పటికీ, తల్లి శాంతమ్మ అందించిన ప్రోత్సాహంతో పట్టుదలగా చదువుకుంది. జిల్లా కోర్టు కార్యాలయం నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి భద్రాచలం ప్రథమ శ్రేణి మెజిస్ట్రేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నో కష్టాలను అధిగమించి నాగదుర్గ ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు. ఆమె విజయం గిరిజన, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
- ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!! గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్‌లోనే వారి రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.1
- భద్రాచలం: గరుడ ఆకారంలో గణనాథుడు.. ఆకట్టుకుంటున్న అలంకరణ భద్రాచలం బస్టాండ్ ఎదురుగా అశోక్‌నగర్ కాలనీలో గరుడ పక్షి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల లైట్లతో ప్రత్యేక డెకరేషన్ చేసి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ‘భద్రాద్రి కా మహారాజ్’ పేరుతో మూడో ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహం, డెకరేషన్‌కు సుమారు రూ.14 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు1
- పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు1
- ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ *మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ** మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు. మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్‌ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. 1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.1
- ఖమ్మం: వినాయక మాలలో విద్యార్థులు...అనుమతించని కళాశాల యాజమాన్యం వినాయక మాల ధరించి వచ్చిన విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు, BJP నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత రోడ్ లో గల ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 6గురు విద్యార్థులు వినాయక మాలలు ధరించి కళాశాలకు వెళ్లారు. మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు, నాయకులు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు.1
- ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊1
- ప్రత్యేక ఆకర్షణ: బేగంబజార్‌లో అద్భుతం.. 48 కిలోల ‘బంగారు గణేశుడు *ప్రత్యేక ఆకర్షణ:* వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్‌ఖానాలో కొలువుదీరిన దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. *స్వర్ణ శోభ:* సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్ మరియు 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా ఈ విగ్రహాన్ని అలంకరించారు. *కళా నైపుణ్యం:* అత్యంత నిపుణులైన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో ఈ అరుదైన విగ్రహం రూపుదిద్దుకుంది. *ప్రత్యేక ప్రేరణ:* ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా, తిరుపతి బాలాజీ రూపాల స్ఫూర్తితో ఈ స్వర్ణ గణనాథుడిని అద్భుతంగా మలిచారు. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మరియు అరుదైన వినాయక విగ్రహంగా బేగంబజార్‌లోని ఈ స్వర్ణ గణేశుడు భక్తుల పూజలందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.1
- హైదరాబాద్‌లో దారునా హత్యా సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గోదావ *లైవ్ మర్డర్ వీడియో..!* హైదరాబాద్‌లో ఇదీ లా అండ్ ఆర్డర్ దుస్థితి హత్యతో నగరంలో భయాందోళనలు ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే హత్య ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య నాగోల్ బండ్లగూడలో పాత కక్షల నేపథ్యంలోనే మహమ్మద్ నహీమ్‌ను దారుణంగా హత్య చేసిన మహేష్ హైదరాబాద్ - నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న మహమ్మద్ నహీమ్ సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షన ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు1