Shuru
Apke Nagar Ki App…
గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి........................ బిక్కనూర్: మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీనాథ్(58) అనే వ్యక్తి సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు మండల విద్యా వనరుల అధికారి రాజాగంగారెడ్డి తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులో ఉన్న తన కుమారుని వద్దకు వెళ్లిన శ్రీనాథ్ గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా శ్రీనాథ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం. ఆయన మృతి పట్ల మండల ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు
Mahesh Nakka
గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి........................ బిక్కనూర్: మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీనాథ్(58) అనే వ్యక్తి సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు మండల విద్యా వనరుల అధికారి రాజాగంగారెడ్డి తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులో ఉన్న తన కుమారుని వద్దకు వెళ్లిన శ్రీనాథ్ గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా శ్రీనాథ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం. ఆయన మృతి పట్ల మండల ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు
More news from తెలంగాణ and nearby areas
- మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం. బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్‌నాయక్ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, స్వామి, మల్లేష్, నర్సింలు, బాలచందర్, యాదగిరి, భాస్కర్, ఎల్లయ్య, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.2
- అమర ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు కొంగలి వెంకటి నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగడం జరుగుతుంది, ఈ దీక్షకు అంబేద్కర్ సంఘం, జిల్లా అధ్యక్షుడు కొత్తోల గంగారాం, ప్రధాన కార్యదర్శి గైనీ రాజు,గౌరవ అధ్యక్షులు మల్లన్న రాష్ట్ర నాయకులు సంగీ రాజలింగం, సూపర్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ ఆశన్న,బహుజన దళిత పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర శివరాజు జిల్లా అధ్యక్షుడు సబ్బాని స్వామి,ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మీ, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య, లింగంపేట్ మాజీ ఎంపీపీ ముధం సాయిలు, అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవాసమితి అధ్యక్షులు భూపతి , తెలంగాణ రక్షణ సేన నాయకులు పెరుమాండ్ల రాములు, ఆర్టిఐ రాష్ట్ర కార్యదర్శి లెగ్గిల రాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదుచేసి రాసిన పుస్తకన్నీ వెంటనే నిషేధించాలని అమర ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అమర ప్రసాద్ ను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న కూడా పట్టించుకోవడం లేదని, వెంటనే పట్టించుకోనీ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.2
- బొమ్మాబొరుసుఆడుతున్న ఏడుగురు అరెస్టు24510నగదుఆరు సెల్ ఫోన్లుస్వాదీనంఎస్పీశ్రీనివాస్ రావు బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురు అరెస్ట్రూ.24,510 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనంమెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెల్దుర్తి మండలం హక్కింపేట గ్రామ పరిధిలోని హక్కింపేట డ్యామ్ సమీపంలో బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించి జూదం ఆడుతున్న . వారిలో దేవసోత్ దశరథ్, మల్గారెడ్డి నవీన్‌రెడ్డి, ఎండీ హుస్సేన్, దొడ్డ్ల వినోద్, మల్లబోయిన గణేష్, పాశం మాణిక్‌రెడ్డి, గాండ్ల రాజు లనుఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.24,510 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం4 చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.జిల్లాలో జూదం, బొమ్మా బొరుసు, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. జూదంఆడుతున్న సమాచారం 100కాల్ చేసి సమాచారం ఇవ్వాన్నారు. జూదంవల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పలు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవిరుద్ధ జూదం, బెట్టింగ్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీశ్రీనివాస్ రావు కోరారు.సమాచారం ఇచ్చిన వారిపేర్లను గుప్తంగా ఉంచుతామన్నారు.1
- నాగిరెడ్డిపేట:పోచారం ప్రాజెక్టులోకి 306 క్యూసెక్కుల వరద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. రాత్రి కురిసిన వర్షాలకు మంగళవారం ఉదయం 6 గంటలకు 306 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ఏఈ అక్షయ్‌కుమార్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 230 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. మరో 38 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోందని పేర్కొన్నారు.ప్రాజెక్టు నుండి ప్రతిరోజు మీరు విడుదల కావడంతో రెండు అడుగుల ప్రాజెక్టు నీటిమట్టం తగ్గి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 కాడులు కాగా 19 అడుగులకు చేరింది మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్ పొంగిపొర్లి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంజీరా నదిలోకి చేరి నిజం సార్ ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది1
- నయాబాది టీచర్స్ కాలనీలో చిన్నారులచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం చిన్నారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో పెద్దలు పాల్గొని చిన్నారులకు సహకరించారు.1
- రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో మహా గర్జన సభ సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో సంగమేశ్వర గౌడ్ మాట్లాడుతూ..1-03-2026 నుంచి 31-08-2026 వరకు చేసిన జమ కర్చుల గురించి చదివి వినిపించారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్,తదితరులు ఉన్నారు1
- వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.3
- ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ– 2026 (SIR) ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి హియరింగ్ కు హాజరైన ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం రామాయంపేట అక్కన్నపేట మండలంలోని ఝాoసింగ్ లింగాపూర్ లోగ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ రజనీతో కలిసి కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించారు. నోటీసుల జారీ, ఓటర్ల హియరింగ్, ఫారాల స్వీకరణ, అప్‌లోడింగ్ ప్రక్రియలనుపర్యవేక్షించి , అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటిపై తప్పనిసరిగా సంబంధిత ఓటర్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే 2002 సంవత్సరానికి చెందిన ఓటర్ల పేర్ల జాబితాను పరిశీలించి, సరిపోల్చుకోవాలని తెలిపారు. ఓటర్లు సమర్పించిన ఫారాలను పరిశీలించిన *కలెక్టర్*, అప్‌లోడింగ్ ప్రక్రియను కూడా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది ఓటర్లు హియరింగ్‌కు వస్తున్నారు? ఎన్ని దరఖాస్తులు ధ్రువీకరిస్తున్నారు? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు జారీ చేసిన ప్రతి వ్యక్తి హియరింగ్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ఖచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియను నిర్వహించాలని, విధులు కేటాయించిన సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.1