సంక్రాంతికి ఊరేలే వారికి నల్గొండ పోలీస్ సూచనలు పత్రికా ప్రకటన తేది : 07-01-2026 *జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ* *తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తులకు కఠిన హెచ్చరిక* — *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో తరచూ దొంగతనాలు,చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు, ఇళ్లలో చోరీలు వంటి నేరాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. జిల్లాలో గతంలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులందరినీ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి హాజరు పరచి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించి, నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో నేరాలను మానుకొని,సమాజంలో గౌరవప్రదమైన, చట్టబద్ధమైన జీవితం గడపాలని వారికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లాలో నేరాలకు అలవాటుపడిన వ్యక్తుల కదలికలపై పోలీస్ శాఖ ఇప్పటికే ప్రత్యేక నిఘా బృందాలు, నైట్ పెట్రోలింగ్ టీములు, సీసీటీవీ నిఘా వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తరచూ నేరాలకు పాల్పడుతున్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న నిందితులు తమ ప్రవర్తనను వెంటనే మార్చుకోకపోతే, *ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (PD Act), రౌడీషీట్‌లు, బైండోవర్ కేసులు* , కఠిన చట్టాల కింద అరెస్టులు మరియు రిమాండ్ వంటి చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కఠినంగా హెచ్చరించారు. ప్రజల ఆస్తి, ప్రాణ భద్రతలకు ముప్పుగా మారే నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అలాగే, దొంగతనాలకు పాల్పడే ముఠాలు, తిరుగుబాటు నేరస్తులు, అంతర్రాష్ట్ర నేరస్తులపై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పొరుగువారితో సమన్వయం ఉంచాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో పని చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారు సత్ప్రవర్తనతో నేరాలను మానుకొని ఉపాధి మార్గాల వైపు అడుగులు వేయాలని, అలాంటి వారికి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ–సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు స్పష్టం చేశారు.
సంక్రాంతికి ఊరేలే వారికి నల్గొండ పోలీస్ సూచనలు పత్రికా ప్రకటన తేది : 07-01-2026 *జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ* *తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తులకు కఠిన హెచ్చరిక* — *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో తరచూ దొంగతనాలు,చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు, ఇళ్లలో చోరీలు వంటి నేరాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. జిల్లాలో గతంలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులందరినీ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి హాజరు పరచి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించి, నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో నేరాలను మానుకొని,సమాజంలో గౌరవప్రదమైన, చట్టబద్ధమైన జీవితం గడపాలని వారికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా
ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లాలో నేరాలకు అలవాటుపడిన వ్యక్తుల కదలికలపై పోలీస్ శాఖ ఇప్పటికే ప్రత్యేక నిఘా బృందాలు, నైట్ పెట్రోలింగ్ టీములు, సీసీటీవీ నిఘా వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తరచూ నేరాలకు పాల్పడుతున్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న నిందితులు తమ ప్రవర్తనను వెంటనే మార్చుకోకపోతే, *ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (PD Act), రౌడీషీట్‌లు, బైండోవర్ కేసులు* , కఠిన చట్టాల కింద అరెస్టులు మరియు రిమాండ్ వంటి చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కఠినంగా హెచ్చరించారు. ప్రజల ఆస్తి, ప్రాణ భద్రతలకు ముప్పుగా మారే నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అలాగే, దొంగతనాలకు పాల్పడే ముఠాలు, తిరుగుబాటు నేరస్తులు, అంతర్రాష్ట్ర నేరస్తులపై ప్రత్యేక ఆపరేషన్లు
నిర్వహించి వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పొరుగువారితో సమన్వయం ఉంచాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో పని చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారు సత్ప్రవర్తనతో నేరాలను మానుకొని ఉపాధి మార్గాల వైపు అడుగులు వేయాలని, అలాంటి వారికి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ–సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు స్పష్టం చేశారు.
- నల్లగొండ బ్రేకింగ్: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం.. రామగిరి సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులతో మాట్లాడి హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణమూర్తి.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పలు సూచనలు... హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించబోదనే నిబంధనను వాహనదారులకు తెలియజేత... హెల్మెట్ వలన వాహనదారుల ప్రాణాలే కాకుండా వారి కుటుంబ భవిష్యత్తు కూడా సురక్షితమవుతుందని అవగాహన... హెల్మెట్‌ను “శ్రీరామరక్ష”గా భావించి ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా వినియోగించాలని పిలుపు... రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక...1
- యాదాద్రి జిల్లా.. నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. ఎమ్మెల్యే కుంభం..1
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అభినందనలు అందుకుంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు కీలక విజయం సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ – CEIR పోర్టల్ సహాయంతో మొత్తం 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వీటి విలువ రూ. 2 కోట్ల 8 లక్షలుగా అధికారులు తెలిపారు.పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐపిఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఎల్బీ నగర్, మల్కాజిగిరి యూనిట్లు, ఐటి సెల్ కలిసి ప్రత్యేక బృందాలుగా పనిచేసి ఆరు నెలల వ్యవధిలో ఈ ఫోన్లను గుర్తించారు. ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. గురువారం రోజు జనవరి 8న రికవరీ చేసిన ఫోన్లను అసలైన యజమానులకు అందజేయగా, బాధితులు మల్కాజిగిరి పోలీసుల పనితీరును ప్రశంసించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, దొంగిలించిన ఫోన్ల కొనుగోలు నేరమని పోలీసులు హెచ్చరించారు.2
- హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల పేకాట రాయుళ్లను పట్టుకున్న కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలు, సెల్‌ఫోన్లు విడుదల చేయడానికి ఎస్‌ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో వల పన్ని, డ్రైవర్ ద్వారా లంచం మొత్తాన్ని అందుకుంటున్న సమయంలో ఎస్‌ఐని పట్టుకున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 8 ఐ 3 న్యూస్/* *కొత్తపేట గ్రామ సర్పంచ్ తుమ్మల మహేష్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది* జగదేవ్పూర్ మండలంలోని కొత్తపేట గ్రామ నూతన సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మల మహేష్ స్వతంత్ర అభ్యర్థి ఈరోజు గజ్వేల్ లోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారితోపాటు వార్డ్ మెంబర్లు ఆంజనేయులు మైపాల్ కర్ణాకర్ మహేష్ రాజు వేణు వెంకట్ స్వామి తదితరులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేయడం జరిగింది అనంతరం మున్సిపాలిటీలోని కాంగ్రెస్ మాజీ వార్డ్ మెంబర్లు ధనరాజ్ రమేష్ లింగం సత్తయ్య రవి రాజు వెంకట్ ధర్మేందర్ ప్రశాంత్ లు కాంగ్రెస్ పార్టీని వీడి అంటే ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది వారికి గులాబీ కండువా వేసి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుందన్నారు కొత్తపేట గ్రామంలో ఎన్నో రోజులుగా ఇనాం పట్టాలుగా ఉన్న భూములను కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో పట్టా భూములుగా మార్చి పట్టా పాస్ బుక్ లను నిరుపేదలకు పంచడం జరిగిందన్నారు అంతేకాకుండా గ్రామాలలో అన్ని విధాలుగా అన్ని హంగులుగా శుద్ధి చేసిన గ్రంథం కెసిఆర్ ది అన్నారు తూప్రాన్ పట్టణంలో రోడ్డు వెడల్పుతో పాటు మధ్యలో డివైడర్ బటర్ఫ్లై లైట్లు అధునాతన మున్సిపల్ భవనంతో పాటు తూప్రాన్ పట్టణ రూపురేఖలను మార్చిన ఘనత కెసిఆర్ ది అన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం మాట్లాడుతున్నారని దేవుళ్ళపై ప్రమాణం చేస్తున్నారని తెలిపారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మూడు లక్షల కోట్ల అప్పుచేసి ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఏ సంక్షేమ కార్యక్రమానికి నిధులు వినియోగించారు ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రైతులకు ఈయూరియా దొరకక , సక్రమంగా కరెంటు రానీరైతులసతమతమవుతున్నారని తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండల అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టు సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఇటిక్యాల గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్తా, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి జగదేవపూర్ మాజీ ఎంపిటిసి కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు సీనియర్ నాయకులు ఆకుల దేవేందర్ కనకయ్య తదితరులున్నారు1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని సంజీవిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన నాలుగు సంవత్సరాల బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డాక్టర్ పై దాడి చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అసలు బాలుడు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు తెలిపారు. డాక్టర్లపై దాడి చేయడం సరి కాదని ఏదైనా అనుమానం ఉంటే టెక్నికల్గా ప్రూఫ్ చేయాలని సూచించారు.1