logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మ దహనం.. కొత్తగూడలో ఉద్రిక్తత మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేసి బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి సీతక్కపై కావాలనే బురదజల్లుతున్నారని ఆరోపిస్తూ, తప్పుడు ప్రచారాలు ఆపకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మ దహనం.. కొత్తగూడలో ఉద్రిక్తత మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేసి బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి సీతక్కపై కావాలనే బురదజల్లుతున్నారని ఆరోపిస్తూ, తప్పుడు ప్రచారాలు ఆపకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా:వర్ధన్నపేట: మండలం ల్యాబర్తి గ్రామంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ZPHS, MPPS పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ వీధుల గుండా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి గ్రామస్తులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సీటు బెల్ట్ వినియోగం, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం ప్రమాదకరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:వర్ధన్నపేట: మండలం ల్యాబర్తి గ్రామంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ZPHS, MPPS పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ వీధుల గుండా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి గ్రామస్తులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సీటు బెల్ట్ వినియోగం, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం ప్రమాదకరమని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు.
రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
    4
    ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
    user_Meenakshi construction Civil c
    Meenakshi construction Civil c
    లింగాలఘన్‌పూర్, జనగాం, తెలంగాణ•
    23 hrs ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఏఈ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కారు. హుజురాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సివిల్ వర్క్ సంబంధించి ఎంబి రికార్డు చేసేందుకు కాంట్రాక్టర్ కు నుంచి 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏఈ సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమని, ఎవరైన లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు
    2
    కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఏఈ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కారు. హుజురాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సివిల్ వర్క్ సంబంధించి ఎంబి రికార్డు చేసేందుకు కాంట్రాక్టర్ కు నుంచి 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏఈ సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమని, ఎవరైన లంచం అడిగితే  ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    1
    ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు
గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం  ఆధ్వర్యంలో   గ్రామ దేవత పోచమ్మకు  బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని  మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు.  అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.  యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా  కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • వరంగల్: దేశాయిపేటకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్తను 12 రోజుల క్రితం తీసుకెళ్లినప్పటి నుంచి ఆచూకీ తెలియజేయలేదని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసింది. మామునూరు ఏసీపీ, ఎనుమాముల సీఐ, ఎస్సై తన ఆత్మహత్యాయత్నానికి కారణమని నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనను, తన బిడ్డను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే భర్తపై కేసు నమోదు చేయడం, తన కుటుంబంపై కేసులు పెట్టడం వెనుక మార్కెట్ వ్యాపారుల పాత్ర ఉందని బాధిత మహిళ ఆరోపించింది.
    1
    వరంగల్: దేశాయిపేటకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్తను 12 రోజుల క్రితం తీసుకెళ్లినప్పటి నుంచి ఆచూకీ తెలియజేయలేదని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసింది. మామునూరు ఏసీపీ, ఎనుమాముల సీఐ, ఎస్సై తన ఆత్మహత్యాయత్నానికి కారణమని నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనను, తన బిడ్డను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే భర్తపై కేసు నమోదు చేయడం, తన కుటుంబంపై కేసులు పెట్టడం వెనుక మార్కెట్ వ్యాపారుల పాత్ర ఉందని బాధిత మహిళ ఆరోపించింది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.