Shuru
Apke Nagar Ki App…
సమాజ అభివృద్ధికి మహిళల కృషి ఎనలేనిది మాసాయిపేట మండల మహిళా అధికారులైన తహశీల్దార్ జ్ఞానజ్యోతి, పంచాయతీ ఈవో రాణి, వివిధ శాఖల మహిళా అధికారులకు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సమాజానికి నిజమైన వెన్నెముకలని వారన్నారు. సమాజ అభివృద్ధి వీరి కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు.
Sk report PRESS
సమాజ అభివృద్ధికి మహిళల కృషి ఎనలేనిది మాసాయిపేట మండల మహిళా అధికారులైన తహశీల్దార్ జ్ఞానజ్యోతి, పంచాయతీ ఈవో రాణి, వివిధ శాఖల మహిళా అధికారులకు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సమాజానికి నిజమైన వెన్నెముకలని వారన్నారు. సమాజ అభివృద్ధి వీరి కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు.
More news from తెలంగాణ and nearby areas
- రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- మంచిర్యాల జిల్లా// దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన... మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- కామారెడ్డి: ఐదు రోజుల పాటు నీటి సరఫరా మార్పులు, కల్వారల్ సమీపంలో జీఆర్పీ పైప్లాన్ మార్పిడి, గ్యాప్ క్లోజింగ్, 3.20 కి.మీ. పైప్లాన్ కమిషనింగ్ పనుల నేపథ్యంలో మార్చి 9 నుంచి ఐదు రోజుల పాటు పైప్లాన్ మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, భిక్కనూర్ మండలాలు, కామారెడ్డి మున్సిపాలిటీ ప్రాంతాలకు ప్రత్యామ్నాయ రోజుల్లో నీటి సరఫరాను కొత్త లైన్ ద్వారా అందించనున్నారు.1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రక్రియ రైతులకు శాపంగా మారింది. నిరక్షరాస్య రైతులు ఎరువులు పొందలేక గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నా, సాంకేతిక కారణాలతో యూరియా అందడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి అందరికీ యూరియా అందేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు.1