logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అర్హత లేకుండానే క్లినిక్లు.. 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్... అర్హత లేకుండానే క్లినిక్లు.. 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్... హైదరాబాద్: సరైన వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్లు నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం అందిస్తున్న 12 మంది నకిలీ డాక్టర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. అనుమతులు, వైద్య అర్హతలు లేకుండా క్లినిక్లు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నకిలీ వైద్యులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి క్లినిక్ల నుంచి పెద్ద మొత్తంలో మందులు, సెలైన్ బాటిళ్లు, సర్జికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. నకిలీ వైద్యులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.

3 hrs ago
user_Routhu srikanth
Routhu srikanth
నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
3 hrs ago
ae5d3b42-56b4-4b92-bd61-395f01061342

అర్హత లేకుండానే క్లినిక్లు.. 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్... అర్హత లేకుండానే క్లినిక్లు.. 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్... హైదరాబాద్: సరైన వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్లు నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం అందిస్తున్న 12 మంది నకిలీ డాక్టర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. అనుమతులు, వైద్య అర్హతలు లేకుండా క్లినిక్లు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నకిలీ వైద్యులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి క్లినిక్ల నుంచి పెద్ద మొత్తంలో మందులు, సెలైన్ బాటిళ్లు, సర్జికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. నకిలీ వైద్యులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. మరోవైపు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు డీలర్లు టోకెన్ల విధానాన్ని అనుసరిస్తూ లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల కోటా కావడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ మరింత పెరిగింది. సర్వర్ సమస్యను త్వరగా పరిష్కరించి, అందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
    1
    మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. మరోవైపు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు డీలర్లు టోకెన్ల విధానాన్ని అనుసరిస్తూ లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల కోటా కావడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ మరింత పెరిగింది. సర్వర్ సమస్యను త్వరగా పరిష్కరించి, అందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
    2
    ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన
రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • బాసర రైల్వేస్టేషన్ లో రెచ్చి పోతున్న వానరాలు. చిన్నారిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించిన జనసేన నాయకులు అంబకంటి రాజు... బాసర లోని రైల్వేస్టేషన్ లో వానరాలు రెచ్చిపోతున్నాయి. గత వారం ఓ ప్రయాణికురాలి చేతిలో నుండి సంచి ఎత్తుకెళ్లి గాయపరచిన ఘటన మరవకముందే బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి చేయిని తీవ్రంగా గాయపరచాయి. జనసేన నాయకుడు అంబకంటి రాజు గమనించి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలు పోయేవరకు పట్టించుకోరా..? అని ఇప్పటికైనా వానరాల బెడద నుండి కాపాడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    బాసర రైల్వేస్టేషన్ లో రెచ్చి పోతున్న వానరాలు. చిన్నారిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించిన జనసేన నాయకులు అంబకంటి రాజు...
బాసర లోని రైల్వేస్టేషన్ లో వానరాలు రెచ్చిపోతున్నాయి. గత వారం ఓ ప్రయాణికురాలి చేతిలో నుండి సంచి ఎత్తుకెళ్లి గాయపరచిన ఘటన మరవకముందే  బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి చేయిని తీవ్రంగా గాయపరచాయి. జనసేన నాయకుడు అంబకంటి రాజు గమనించి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలు పోయేవరకు పట్టించుకోరా..? అని ఇప్పటికైనా వానరాల బెడద నుండి కాపాడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    11 hrs ago
  • బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.
    4
    బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ
జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 day ago
  • మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు. సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    1
    మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం
కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు.
సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    3
    *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?*


*ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన*


*తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు*


*కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు*


*రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు*


*అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న*


*తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు*


*భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు*


*రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు*


*కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు*


తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • చౌదర్పల్లి గ్రామంలో నిర్మించనున్న శ్రీ హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులకు శ్రీకారం నిజాంపేట మండలం చౌదర్పల్లి గ్రామంలో గ్రామస్థుల సహకారంతో నిర్మించనున్న శ్రీ హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఆలయ నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తై గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని కోరుకున్నారు.
    1
    చౌదర్పల్లి గ్రామంలో నిర్మించనున్న శ్రీ హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులకు శ్రీకారం
నిజాంపేట మండలం చౌదర్పల్లి గ్రామంలో గ్రామస్థుల సహకారంతో నిర్మించనున్న శ్రీ హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఆలయ నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తై గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని కోరుకున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఘనంగా శోభాయాత్ర మిలాద్-ఉన్-నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో భారీ శోభాయాత్ర చేపట్టారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో శాంతి, సోదరభావ సందేశాలను చాటారు. యువకులు పవిత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    3
    కరీంనగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఘనంగా శోభాయాత్ర
మిలాద్-ఉన్-నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో భారీ శోభాయాత్ర చేపట్టారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో శాంతి, సోదరభావ సందేశాలను చాటారు. యువకులు పవిత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    8 hrs ago
  • ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని  బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.