logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు - లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు - అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపులో గోదావరి వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో కాలనీ చుట్టూ వరద నీరు చేరి పలు ఇళ్లను చుట్టుముట్టింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు క్రమంగా చేరుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి మరింత విషమిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

5 hrs ago
user_Shekar Thaduri
Shekar Thaduri
ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
5 hrs ago

బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు - లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు - అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపులో గోదావరి వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో

కాలనీ చుట్టూ వరద నీరు చేరి పలు ఇళ్లను చుట్టుముట్టింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు క్రమంగా చేరుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి మరింత విషమిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    1
    పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు...
పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
    1
    అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి
*వీందో డ్రామా... వాందో డ్రామా😤*
అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని  ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥*
దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే 
ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.
    1
    మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన..
మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.
    user_మానుకోట వార్తలు
    మానుకోట వార్తలు
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.
    1
    ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు
జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం  ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.  ప్రభుత్వ ఆదేశాల  మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి  నల్లబెల్లి లో నిర్వహించే  అంతిమ సంస్కారానికి హాజరై  నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు.
అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు,  కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం . ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి . కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు ..... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    3
    కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి
మహబూబాబాద్ జిల్లా:
మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం  కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం .
ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి .
కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు .....
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.