పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగ దూడలు ప్రదర్శన ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో బహుమతులు ప్రధానం సంతబొమ్మాలి : పశుగణాభివృద్ధి సంస్థ ,పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సంతబొమ్మాలి మండలం లక్కీవలస గ్రామంలో మంగళవారం లేగ దూడలు పోటీ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డా.చి.నరసింహులు, డిప్యూటీ డైరెక్టర్, టెక్కలి డివిజన్ మాట్లాడుతూ లేగ దూడలు వ్యాధుల పట్ల ఖచ్చితమైన అవగాహన పశుపోషకులు అందరికీ ఉండాలని సూచించారు. పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా కార్యనిర్వహణాధికారి డాక్టర్ సిహెచ్ సత్య ప్రకాష్ మాట్లాడుతూ సంతానోత్పత్తికి ఉపయోగపడని పాడి పశువులను పశు వైద్యుల సూచనలు, సలహాలతో వైద్యం చేయించుకుని సంతానానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పాడి పశువుల కొనుగోలు రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల, పశువుల కొనుగోలు చేయడం కష్టమని, అందువలన తమ దగ్గర ఉన్న పశువులనే సంతానానికి పనికి వచ్చే పశువులుగా మార్చుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడదూడల ఉత్పత్తి పథకాన్ని పాడి రైతులందరూ ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్క పాడి రైతు పశు వైద్యుల సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు . ఈ శిబిరంలో 41 లేగ దూడలు పోటీలో పాల్గొన్నాయి. 6 నెలల లేక దూడల విభాగంలో డొంకన రామబాబు అనే రైతు మొదటి బహుమతి ,పుచ్చకాయల్ల లక్ష్మి దూపన రామారావు ద్వితీయ తృతీయ బహుమతులు గెలుపొందారు. ఆరు నెలలు పైబడిన విభాగంలో బొంగు కృష్ణవేణి ,బుడెపు సురేష్ ,బడే అప్పల స్వామి ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాల్లో గెలిచారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఉప సంచాలకులు డా. సిహెచ్. నరసింహులు, టెక్కలి సహాయ సంచాలకులు డా.బి.వెంకట రమణ, డా.కె.జె.చాకవర్తి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వి.డి.కె.కొత్తూరు, టెక్కలి, డా.ఆర్.రాజ్ కిరణ్ రెడ్డి, వీఏఎస్, సంతబొమ్మాళి, డా.జి.గౌతమ్, వీఏఎస్, కొల్లిపాడు. ప్రజాప్రతినిధులు దుపన రామారావు గారు పాల్గొన్నారు.
పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగ దూడలు ప్రదర్శన ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో బహుమతులు ప్రధానం సంతబొమ్మాలి : పశుగణాభివృద్ధి సంస్థ ,పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సంతబొమ్మాలి మండలం లక్కీవలస గ్రామంలో మంగళవారం లేగ దూడలు పోటీ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డా.చి.నరసింహులు, డిప్యూటీ డైరెక్టర్, టెక్కలి డివిజన్ మాట్లాడుతూ లేగ దూడలు వ్యాధుల పట్ల ఖచ్చితమైన అవగాహన పశుపోషకులు అందరికీ ఉండాలని సూచించారు. పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా కార్యనిర్వహణాధికారి డాక్టర్ సిహెచ్ సత్య ప్రకాష్ మాట్లాడుతూ సంతానోత్పత్తికి ఉపయోగపడని పాడి పశువులను పశు వైద్యుల సూచనలు, సలహాలతో వైద్యం చేయించుకుని సంతానానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పాడి పశువుల కొనుగోలు రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల, పశువుల కొనుగోలు చేయడం కష్టమని, అందువలన తమ దగ్గర ఉన్న పశువులనే సంతానానికి పనికి వచ్చే పశువులుగా
మార్చుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడదూడల ఉత్పత్తి పథకాన్ని పాడి రైతులందరూ ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్క పాడి రైతు పశు వైద్యుల సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు . ఈ శిబిరంలో 41 లేగ దూడలు పోటీలో పాల్గొన్నాయి. 6 నెలల లేక దూడల విభాగంలో డొంకన రామబాబు అనే రైతు మొదటి బహుమతి ,పుచ్చకాయల్ల లక్ష్మి దూపన రామారావు ద్వితీయ తృతీయ బహుమతులు గెలుపొందారు. ఆరు నెలలు పైబడిన విభాగంలో బొంగు కృష్ణవేణి ,బుడెపు సురేష్ ,బడే అప్పల స్వామి ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాల్లో గెలిచారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఉప సంచాలకులు డా. సిహెచ్. నరసింహులు, టెక్కలి సహాయ సంచాలకులు డా.బి.వెంకట రమణ, డా.కె.జె.చాకవర్తి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వి.డి.కె.కొత్తూరు, టెక్కలి, డా.ఆర్.రాజ్ కిరణ్ రెడ్డి, వీఏఎస్, సంతబొమ్మాళి, డా.జి.గౌతమ్, వీఏఎస్, కొల్లిపాడు. ప్రజాప్రతినిధులు దుపన రామారావు గారు పాల్గొన్నారు.
- అరసవెల్లి దేవస్థానం,రొట్టవలసగ్రామ పురోహితులు,వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మవుడూరు సుబ్రహ్మణ్యశర్మ గారు లిఖించినశ్రీ పరభావ నామ సంవత్సర గంటలపంచాంగం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ , అరసవెళ్లి స్వామి వారి దేవస్థానం అధికారులు, ప్రదాన అర్చుకులు ఇప్పిలి శంకర శర్మ మరియు ఇతర ప్రముఖులు సమక్షంలో ఘనంగా పంచాంగం మంగళవారంఉదయం ఆవిష్కరించారు.4
- పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి1
- A small cavity may seem harmless at first. కానీ చిన్న పళ్ల రంధ్రాన్ని పట్టించుకోకపోతే అది క్రమంగా లోపలికి పెరుగుతుంది. Untreated cavities can lead to: • tooth pain • infection • need for root canal treatment Early fillings are simple and prevent bigger treatments later. Have you ever ignored a small cavity thinking it is nothing serious?1
- రంపచోడవరం ఏజెన్సీలో విద్యార్థులకు పాడైన కోడిగుడ్లు పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శిరీష దేవి హెచ్చరించారు. అవసరం అయితే కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను మార్చి వేస్తామన్నారు. మంగళవారం దేవీపట్నం మండలం పోతవరం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పాడైన గుడ్లు పెట్టిన విషయం తెలిసి పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.1
- Post by Shyam1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ మేయర్ గణేష్ నగరంలోని 35, 44వ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ గణేష్, మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మేయర్ వెంట సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1
- पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।1
- రైతు బజార్ ఎదురుగా కూరగాయల షాపులు తరలింపు1