Shuru
Apke Nagar Ki App…
అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాఠశాల, కళాశాల సందర్శన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచన ఖమ్మం అర్బన్ మండలంలోని ఎన్ఎస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంబేద్కర్ డిగ్రీ కళాశాలలను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి, కళాశాలలో అవసరమైన సివిల్ పనులు, భవన మరమ్మతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సందర్శన విద్యాసంస్థల్లో సౌకర్యాలపై ఆరా తీసేందుకు జరిగింది. తక్కువ చూపించు
Kampasati Venkanna
అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాఠశాల, కళాశాల సందర్శన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచన ఖమ్మం అర్బన్ మండలంలోని ఎన్ఎస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంబేద్కర్ డిగ్రీ కళాశాలలను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి, కళాశాలలో అవసరమైన సివిల్ పనులు, భవన మరమ్మతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సందర్శన విద్యాసంస్థల్లో సౌకర్యాలపై ఆరా తీసేందుకు జరిగింది. తక్కువ చూపించు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *విజయవాడ 'మహాప్రస్థానం'లో ఉచితం మాయం.. డ్రైవర్ల ఇష్టారాజ్యం!* విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించేందుకు ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన 'మహాప్రస్థానం' సేవలు ఇప్పుడు కాసుల వేటగా మారాయి. వాహనాలపై ఉన్న 'ఉచితం' అనే అక్షరాలను చెరిపేసి, బాధిత కుటుంబాల నుంచి డ్రైవర్లు అందినకాడికి దండుకుంటున్నారు. డ్రైవర్ బేటా పేరిట ఒక్కో మృతదేహానికి 700 నుంచి 1,000 రూపాయల వరకు వసూలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- కలెక్టరేట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) మ్యాపింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్‌తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్‌లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.1
- హన్మకొండ జిల్లా ఖాజీపేట దర్గా ప్రాంతంలో శివాజీ శోభాయాత్ర కోసం ఏర్పాట్లు చేస్తుండగా బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. శోభాయాత్రలో భాగంగా ఐరన్ పైపులను పైకి లేపుతున్న సమయంలో అవి 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలాయి. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఖాజీపేట సిఐ సుధాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1
- అద్దంకి ఆర్టీసీ డిపో ఆవరణలో గురువారం SWF ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. పినకిల్ ప్రైవేట్ కంపెనీకి విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ స్థలాలను కట్టబెట్టడాన్ని యూనియన్ జిల్లా కార్యదర్శి తిరుపతిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. డిపోల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని, సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- RTCని ప్రైవేటీకరణ చేస్తే సహించం: JAC గుంటూరు:ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని గుంటూరు-2 డిపో ఎంప్లాయిస్ JAC ఆరోపించింది. కమిటీ ఆధ్వర్యంలో బుధవారం APSRTC ఉద్యోగులు గుంటూరు NTR బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను RTC సంస్థ నేరుగా నడపాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పేర్కొన్నారు.1
- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.1
- తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,* బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.1