రెండు రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్స్ రెండు కాంగ్రెస్ కే ఛాన్స్..! తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 16న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీతో పాటు, బిఆర్ఎస్ సభ్యుడు కె.ఆర్. సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. శాసనసభలో ప్రస్తుత పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల గెలుపు లెక్కల ప్రకారం, రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కో అభ్యర్థి గెలవడానికి దాదాపు 40 నుండి 41 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న 64 మంది స్వంత ఎమ్మెల్యేలతో పాటు, ఇతర పార్టీల నుండి చేరిన వారితో కలిపి మొత్తం బలం 75 దాటడంతో, ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవడానికి అవసరమైన 82 ఓట్లకు కాంగ్రెస్ అత్యంత సమీపంలో ఉంది. మజ్లిస్ కూడా మద్దతుగా ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ పరిస్థితి ఈ ఎన్నికల్లో కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న 27 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఒక సీటు గెలవడానికి కూడా సరిపోదు. ఎనిమిది మమంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఓటింగ్ కు హాజరు కాకపోవచ్చు. పైగా, రెండో ప్రాధాన్యత ఓట్ల విషయంలోనూ అధికార పక్షానికే స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టినా పోటీ ఇవ్వడం కష్టమే. కాంగ్రెస్ అధిష్టానం ఒక సీటును జాతీయ స్థాయి నేతకు, మరో సీటును సామాజిక సమీకరణాల దృష్ట్యా రాష్ట్ర స్థాయి నేతకు కేటాయించే అవకాశం ఉంది.

- Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service Centre in Hyderabad Kukatpally Tarnaka Nagole ECIL AS Rao Nagar Amberpet Ameerpet LB Nagar Vanasthalipuram Hayathnagar Karmanghat Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయ వద్ద పులిహోర పంపిణీ చేశారు పులిహోర దాత గాడిపల్లి లక్ష్మి రాసజ్ఞ కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ ఉంటుందని అన్నదానం మహా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో, రావికంటి చంద్రశేఖర్, మరియాల భద్రయ్య, తోడుపనూరి కాశీనాథ్, వాసవి క్లబ్ యూత్ సెక్రెటరీ ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, రామారం రమేష్, నంగునూరు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.4
- ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు ను ఈ నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అం శంపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఓయూలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. మారుతున్న సాంకేతిక యుగంలో ఉన్నత విద్యా విదానాల రూపకల్పనపై చర్చ ఉంటుందన్నారు. ఈ చర్చల్లో వచ్చి ప్రధాన అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.1
- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం చేయగా బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు అరెస్ట్ అయినా బీఆర్ఎస్వి నేతలు జీడీ అనిల్, జంగయ్య, నాగారం ప్రశాంత్, రామ కృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, దీరజ్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into1
- చిత్తూరు నగర శివారులోని ఇరువారం క్రాస్ రోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ కారుపై బోల్తా పడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం4
- భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి కార్యక్రమాని ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ (AMSA ) ఓయూ అధ్యక్షులు నామ సైదులు ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నామ సైదులు మాట్లాడుతూ భాగ్యరెడ్డివర్మ దక్కన్ పీఠభూమిలో భాగ్యనగరం నడిబొడ్డున ధ్రువతార అని, సామాజిక ఉద్యమకారులకు తొలి గురువు అన్నారు. సాధారణ దళిత మాల కుటుంబానికి చెందిన మాదిరి వెంకటయ్య, రంగమాంబ దంపతులకు హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో భాగ్యరెడ్డి వర్మ. యుక్త వయసులో సుల్తాన్ బజార్ లో ఆర్య సమాజంలో కొంతకాలం పని చేశాడని, ఆర్య సమాజం నిర్వహకులు కిషన్ రావు ఆయన సేవలను గుర్తిం చి వర్మ అనే బిరుదు ఇచ్చారని తెలిపారు. భాగ్యరెడ్డి వర్మ ఆ రోజుల్లో రెడ్డి కులానికి ఇచ్చే గౌరవాన్ని చూసి రెడ్డి అంటే పరిపాలదక్షుడిగా గౌరవం ఉంటుందని వారి కన్నా తమ జాతులు తక్కువ కాదని ఆయన పేరులో రెడ్డి చేర్చుకున్నాడని తెలిపారు. హిందూ సమాజంలో అస్పశ్యత వ్యక్తుల మధ్య వ్యత్యాసం గమనించిన భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి దళిత బాలికలకోసం 26పాఠశాలలో నెలకొల్పాడని గుర్తు చేశారు. బస్తీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఒకవైపు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తూనే సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. జగన్ మిత్రమండలి, ఆది హిందూ సోషల్ లీగ్ లీగ్ లీగ్ సంస్థలు ఏర్పాటు చేశారని చెప్పారు.అన్నగారిన వర్గాల ఆత్మస్థైర్యం కోసం నిరంతరం పోరాడుతున్న హైదరాబాద్లో ఎన్నో సంఘసేవ కార్యక్రమాలు నిర్వహించారు దృష్టిలో పెట్టుకొని బౌద్ధమతం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ కంటే ముందు బుద్ధ పూర్ణిమ రోజు 1915లో బౌద్ధమతం స్వీకరించారు ఆయన క్షయ వ్యాధితో బాధపడుతూ 18 ఫిబ్రవరి 1939లో 51 సంవత్సరాల వయసులోనే తుది శ్వాస విడిచారు, భాగ్యరెడ్డి వర్మ సేవలు గుర్తించి తెలంగాణ ప్రభుత్వం జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడం స్వాగతిస్తున్నాం అన్నారు. భాగ్యరెడ్డివర్మ ఆశలను కొనసాగిస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వలిగొండ నరసింహ, కొమ్మనబోయిన సైదులు యాదవ్, సుధాకర్, బొల్లెపల్లి స్వామి గౌడ్, వేణు, చేరాల వంశీ, లింగయ్య యాదవ్, రవి గౌడ్, కొమ్ము శేఖర్, రవి, ఎడవెల్లి అజయ్, రాము తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.1