logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం డిమాండ్ కి తగిన ఇసుక సరఫరా చేయాలి జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం డిమాండ్ కి తగిన ఇసుక సరఫరా చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ అమలాపురం సిటిజన్ టైమ్స్ ఏప్రిల్ 16: భవన నిర్మాణ రంగానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకమైన విధానంలో డిమాండ్ మేరకు ఇసుకను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత శాఖలను దేశించారు. గురువారం కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కమిటీ సభ్యు లతో చైర్మన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యా ప్తంగా రుతుపవనాల సీజన్ వర్షాకాలంలో సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నులు భవన నిర్మాణ రంగా అవసరాలకు నిల్వ లు చేయాలని ఆదేశించారు. జొన్నాడ ఇసుక స్టాక్ పాయింట్ వద్ద 1 . 5 లక్షలు మెట్రిక్ టన్నులు, కపిలేశ్వ రపురంలో 1 లక్ష మెట్రిక్ టన్నులు, రావులపాడు వద్ద నాలుగు లక్షలు, ఆల మూరు నందు రెండు లక్షలు మెట్రిక్ టన్నులు నిల్వలు ఉంచాలన్నారు.5 మాన్యువల్ ఇసుక రీచులకు టెండర్లు ఖరారుకు గుత్తేదారులు రానందున వాటిని సెమీ మేకనైజ్డ్ రీచ్యువల్ గా మార్చి టెండర్లు పిలవాలన్నారు .పట్టా భూములలో ఇసుక త్రవ్వకాలు సంబం ధించి పనులను వేగవంతం చేయాలన్నారు. టాస్క్ ఫోర్స్ టీములు నియ మించి వారంలో కనీసం ఒకసారి తనిఖీ చేసేందుకై చర్య లు గైకొనాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ప్రజలు కూడా అక్రమ రవాణా గురించి సమాచారం అందించి ప్రభుత్వానికి సహకరించా లన్నారు.జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగ డిమాండుకు ఆనుగుణం గా ఇసుక పారదర్శకంగా సరఫరా కావాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక లభ్యత, సరఫరా, అక్రమ రవాణా నిరోధానికి తీసుకో వాల్సిన చర్యలపై కమిటీ సభ్యులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకు న్నారు.నిరంతర పర్య వేక్షణ లో భాగంగా జిల్లా లోని అన్ని ఇసుక రీచ్‌లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం తవ్వకాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిం దన్నారు. ప్రభుత్వం నిర్ణ యించిన ధరలకే వినియో గదారులకు ఇసుక అందే లా చూడాలని, ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తే సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలపై నిఘా ఉంచేందుకు జిల్లా సరిహద్దుల్లోనూ, ప్రధాన రహదారుల్లోనూ చెక్ పోస్టులను బలోపేతం చేయాలని పోలీసు, రెవెన్యూ శాఖలకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ఇసుక కొరత రాకుండా ముంద స్తుగా స్టాక్ పాయింట్లలో తగినంత నిల్వలు ఉంచేందుకు సభ్యులు ఆమోదం తెలిపారన్నారు ఇసుక రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా అనుమతు లు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవ స్థను అనుసంధానం చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జి మమ్మీ పి భాగ్యవతి, డిటిఓ డి శ్రీనివాసరావు భూగర్భ గనుల శాఖ ఏడి బి అశోక్ కుమార్ జల వనరుల శాఖ డి ఈ సుబ్బారావు,ఆర్ అండ్ బి ఎస్ సి బి రాము, డిపిఓ శాంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

4 days ago
user_SS NEWS
SS NEWS
Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
4 days ago
862df419-5838-42d1-86ed-c22d11941c0e

జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం డిమాండ్ కి తగిన ఇసుక సరఫరా చేయాలి జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం డిమాండ్ కి తగిన ఇసుక సరఫరా చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ అమలాపురం సిటిజన్ టైమ్స్ ఏప్రిల్ 16: భవన నిర్మాణ రంగానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకమైన విధానంలో డిమాండ్ మేరకు ఇసుకను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత శాఖలను దేశించారు. గురువారం కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కమిటీ సభ్యు లతో చైర్మన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యా ప్తంగా రుతుపవనాల సీజన్ వర్షాకాలంలో సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నులు భవన నిర్మాణ రంగా అవసరాలకు నిల్వ లు చేయాలని ఆదేశించారు. జొన్నాడ ఇసుక స్టాక్ పాయింట్ వద్ద 1 . 5 లక్షలు మెట్రిక్ టన్నులు, కపిలేశ్వ రపురంలో 1 లక్ష మెట్రిక్ టన్నులు, రావులపాడు వద్ద నాలుగు లక్షలు, ఆల మూరు నందు రెండు లక్షలు మెట్రిక్ టన్నులు నిల్వలు ఉంచాలన్నారు.5 మాన్యువల్ ఇసుక రీచులకు టెండర్లు ఖరారుకు గుత్తేదారులు రానందున వాటిని సెమీ మేకనైజ్డ్ రీచ్యువల్ గా మార్చి టెండర్లు పిలవాలన్నారు .పట్టా భూములలో ఇసుక త్రవ్వకాలు సంబం ధించి పనులను వేగవంతం చేయాలన్నారు. టాస్క్ ఫోర్స్ టీములు నియ మించి వారంలో కనీసం ఒకసారి తనిఖీ చేసేందుకై చర్య లు గైకొనాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ప్రజలు కూడా అక్రమ రవాణా గురించి సమాచారం అందించి ప్రభుత్వానికి సహకరించా లన్నారు.జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగ డిమాండుకు ఆనుగుణం గా ఇసుక పారదర్శకంగా సరఫరా కావాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక లభ్యత, సరఫరా, అక్రమ రవాణా నిరోధానికి తీసుకో వాల్సిన చర్యలపై కమిటీ సభ్యులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకు న్నారు.నిరంతర పర్య వేక్షణ లో భాగంగా జిల్లా లోని అన్ని ఇసుక రీచ్‌లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం తవ్వకాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిం దన్నారు. ప్రభుత్వం నిర్ణ యించిన ధరలకే వినియో గదారులకు ఇసుక అందే లా చూడాలని, ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తే సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలపై నిఘా ఉంచేందుకు జిల్లా సరిహద్దుల్లోనూ, ప్రధాన రహదారుల్లోనూ చెక్ పోస్టులను బలోపేతం చేయాలని పోలీసు, రెవెన్యూ శాఖలకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ఇసుక కొరత రాకుండా ముంద స్తుగా స్టాక్ పాయింట్లలో తగినంత నిల్వలు ఉంచేందుకు సభ్యులు ఆమోదం తెలిపారన్నారు ఇసుక రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా అనుమతు లు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవ స్థను అనుసంధానం చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జి మమ్మీ పి భాగ్యవతి, డిటిఓ డి శ్రీనివాసరావు భూగర్భ గనుల శాఖ ఏడి బి అశోక్ కుమార్ జల వనరుల శాఖ డి ఈ సుబ్బారావు,ఆర్ అండ్ బి ఎస్ సి బి రాము, డిపిఓ శాంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

More news from Kakinada and nearby areas
  • పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్‌ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్‌లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్‌లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
    3
    పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్‌ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్‌లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్‌లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    20 hrs ago
  • రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
    1
    రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    1
    *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన*
*14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం*
*ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా*
*కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్*
*పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* 
భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC  మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA  అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు.
ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం 
వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై  వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    user_Shivaram
    Shivaram
    Accountant బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    23 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
    3
    పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు.
కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.  వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    20 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.