logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, సోమవారం జరగనున్న 29వ మరియు 30వ స్నాతకోత్సవాల ఏర్పాట్లను శనివారం సాయంత్రం పరిశీలించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ తనిఖీలో ఆయన కార్యక్రమ వేదిక, అతిథుల కూర్చునే ఏర్పాట్లు, పట్టభద్రుల ప్రవేశం, భద్రతా చర్యలు, పార్కింగ్, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ తోపాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను వైస్ ఛాన్సలర్ ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే పట్టభద్రులు, అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.

2 hrs ago
user_జేమ్స్
జేమ్స్
Vijayawada East, Ntr•
2 hrs ago
dcc380bd-ec55-4e61-8a79-c12223b632b9
146a97c5-1f43-4d10-af04-e2fcbffe59a3

డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, సోమవారం జరగనున్న 29వ మరియు 30వ స్నాతకోత్సవాల ఏర్పాట్లను శనివారం సాయంత్రం పరిశీలించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ తనిఖీలో ఆయన కార్యక్రమ వేదిక, అతిథుల కూర్చునే ఏర్పాట్లు, పట్టభద్రుల ప్రవేశం, భద్రతా చర్యలు, పార్కింగ్, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ తోపాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను వైస్ ఛాన్సలర్ ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే పట్టభద్రులు, అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.

More news from Ntr and nearby areas
  • అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) సీఎండీ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి, ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులు వేసిన అడ్డుక‌ట్ట‌ను త‌క్ష‌ణం తొల‌గించాలని ఏడీసీ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. స్లూయీజ్ గేట్ల లీకేజీ ద్వారా కృష్ణాన‌దిలోని నీటి ప్ర‌వాహం కొండ‌వీటివాగులోనికి వెళ్ల‌కుండా నిరోధించేందుకు ఈ అడ్డుక‌ట్ట వేయబడిందని ఆమె పేర్కొన్నారు. పంపింగ్ స్టేష‌న్‌కు మ‌ర‌మ‌తులు చేసే క్రమంలో, నీటిపారుద‌ల శాఖ అధికారులు కొండ‌వీటివాగులో నీరు ఇన్‌టేక్ పాండ్‌లో క‌ల‌వ‌కుండా ఈ అడ్డుక‌ట్ట వేశారని వివరణ లభించింది. నీటిపారుదల హెడ్ రెగ్యులేటర్‌లో లీకేజీ మరియు ఈ కట్ట కారణంగా కృష్ణా నది నుండి పెనుమాక రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం వెనక్కి ప్రవహించిందని ఏడీసీ ఛీఫ్ ఇంజినీరు బి.న‌ర‌సింహ‌మూర్తి సీఎండీకి వివరించారు. ఉండ‌వ‌ల్లి పంపింగ్ స్టేష‌న్ వ‌ద్ద కృష్ణాన‌దిలో కొండ‌వీటివాగు నీటి ప్ర‌వాహం కలుస్తుంది. ఇక్కడ అడ్డుకట్ట వేయడం వల్ల కృష్ణాన‌దిలో నీరు వెనక్కి వచ్చి, పెనుమాకలో అభివృద్ధి పనులలో ఉన్న రిజర్వాయర్‌లోనికి చేరి నిలిచిందని ఆయన నివేదించారు. ఈ అడ్డుక‌ట్ట బ‌కింగ్‌హాం కెనాల్‌లో వెళ్లాల్సిన కొండ‌వీటివాగు నీరు సైతం నిలిచిపోవడానికి కారణమైంది. ఈ పరిస్థితిపై శ‌నివారం ఏడీసీ ఇంజినీరింగ్ అధికారుల‌తో పంపింగ్ స్టేష‌న్ ప్రాంతాన్ని ప‌రిశీలించిన సీఎండీ, వెంటనే నీటిపారుద‌ల శాఖ అధికారుల‌తో మాట్లాడి, అడ్డుక‌ట్ట‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఖ‌చ్చిత‌మైన ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఆమె పెనుమాక రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా నీటి ప్ర‌వాహాన్ని పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున, రాజ‌ధాని అమ‌రావ‌తి గుండా ప్ర‌వ‌హిస్తున్న కొండ‌వీటివాగు, పాల‌వాగుల మ‌ధ్య నిర్మిస్తున్న ర‌హ‌దార్ల వంతెన‌ల వ‌ద్ద నీటి ప్ర‌వాహానికి ఆటంకం లేకుండా అధికారులు వెంటనే చ‌ర్య‌లు చేప‌ట్టాలని కూడా ఆమె ఆదేశించారు. అలాగే, పాల‌వాగు ప్రారంభ‌మ‌య్యే రాయ‌పూడి వ‌ద్ద ఉన్న డైవ‌ర్ష‌న్ ఛానెల్‌ను మరింత లోతుగా తవ్వకం చేయాలని సూచించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్లు ఆర్‌.గోపాల‌కృష్ణారెడ్డి, సీహెచ్‌. ధ‌నుంజ‌య‌, ఎస్ఈ రామ‌మోహ‌న‌రావుతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
    1
    అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) సీఎండీ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి, ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులు వేసిన అడ్డుక‌ట్ట‌ను త‌క్ష‌ణం తొల‌గించాలని ఏడీసీ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. స్లూయీజ్ గేట్ల లీకేజీ ద్వారా కృష్ణాన‌దిలోని నీటి ప్ర‌వాహం కొండ‌వీటివాగులోనికి వెళ్ల‌కుండా నిరోధించేందుకు ఈ అడ్డుక‌ట్ట వేయబడిందని ఆమె పేర్కొన్నారు.

పంపింగ్ స్టేష‌న్‌కు మ‌ర‌మ‌తులు చేసే క్రమంలో, నీటిపారుద‌ల శాఖ అధికారులు కొండ‌వీటివాగులో నీరు ఇన్‌టేక్ పాండ్‌లో క‌ల‌వ‌కుండా ఈ అడ్డుక‌ట్ట వేశారని వివరణ లభించింది. నీటిపారుదల హెడ్ రెగ్యులేటర్‌లో లీకేజీ మరియు ఈ కట్ట కారణంగా కృష్ణా నది నుండి పెనుమాక రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం వెనక్కి ప్రవహించిందని ఏడీసీ ఛీఫ్ ఇంజినీరు బి.న‌ర‌సింహ‌మూర్తి సీఎండీకి వివరించారు. ఉండ‌వ‌ల్లి పంపింగ్ స్టేష‌న్ వ‌ద్ద కృష్ణాన‌దిలో కొండ‌వీటివాగు నీటి ప్ర‌వాహం కలుస్తుంది. ఇక్కడ అడ్డుకట్ట వేయడం వల్ల కృష్ణాన‌దిలో నీరు వెనక్కి వచ్చి, పెనుమాకలో అభివృద్ధి పనులలో ఉన్న రిజర్వాయర్‌లోనికి చేరి నిలిచిందని ఆయన నివేదించారు. ఈ అడ్డుక‌ట్ట బ‌కింగ్‌హాం కెనాల్‌లో వెళ్లాల్సిన కొండ‌వీటివాగు నీరు సైతం నిలిచిపోవడానికి కారణమైంది.

ఈ పరిస్థితిపై శ‌నివారం ఏడీసీ ఇంజినీరింగ్ అధికారుల‌తో పంపింగ్ స్టేష‌న్ ప్రాంతాన్ని ప‌రిశీలించిన సీఎండీ, వెంటనే నీటిపారుద‌ల శాఖ అధికారుల‌తో మాట్లాడి, అడ్డుక‌ట్ట‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఖ‌చ్చిత‌మైన ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఆమె పెనుమాక రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా నీటి ప్ర‌వాహాన్ని పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున, రాజ‌ధాని అమ‌రావ‌తి గుండా ప్ర‌వ‌హిస్తున్న కొండ‌వీటివాగు, పాల‌వాగుల మ‌ధ్య నిర్మిస్తున్న ర‌హ‌దార్ల వంతెన‌ల వ‌ద్ద నీటి ప్ర‌వాహానికి ఆటంకం లేకుండా అధికారులు వెంటనే చ‌ర్య‌లు చేప‌ట్టాలని కూడా ఆమె ఆదేశించారు. అలాగే, పాల‌వాగు ప్రారంభ‌మ‌య్యే రాయ‌పూడి వ‌ద్ద ఉన్న డైవ‌ర్ష‌న్ ఛానెల్‌ను మరింత లోతుగా తవ్వకం చేయాలని సూచించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్లు ఆర్‌.గోపాల‌కృష్ణారెడ్డి, సీహెచ్‌. ధ‌నుంజ‌య‌, ఎస్ఈ రామ‌మోహ‌న‌రావుతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    5 hrs ago
  • కర్ణాటకలోని హంపిలో యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.
    1
    కర్ణాటకలోని హంపిలో యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ Rolla, Sri Sathya Sai•
    13 hrs ago
  • ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ట్రామా బ్లాక్‌లో అగ్నిమాపక మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్ అగ్నిమాపక శాఖ మార్గదర్శకత్వంలో చేపట్టిన ఈ విన్యాసంలో, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు రోగులను సురక్షితంగా తరలించే విధానాలపై డమ్మీ పేషెంట్లతో సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో స్పందించే నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం కాగా, అగ్ని ప్రమాదం వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై నిమ్స్‌లో ప్రత్యక్ష అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
    1
    ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ట్రామా బ్లాక్‌లో అగ్నిమాపక మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్ అగ్నిమాపక శాఖ మార్గదర్శకత్వంలో చేపట్టిన ఈ విన్యాసంలో, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు రోగులను సురక్షితంగా తరలించే విధానాలపై డమ్మీ పేషెంట్లతో సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో స్పందించే నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం కాగా, అగ్ని ప్రమాదం వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై నిమ్స్‌లో ప్రత్యక్ష అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    52 min ago
  • Post by SHOT NEWS
    1
    Post by SHOT NEWS
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    4 hrs ago
  • పని ఒత్తిడి, ఆందోళనల కారణంగా తన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం ఆటో డ్రైవర్‍గా జీవనం సాగిస్తున్న ఓ మహిళ గురించి లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. మిథ్లాజ్ స్వయంగా ఆ మహిళ ఆటో ఎక్కి ఆమెతో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ఐటీ మేనేజర్‍గా పని చేసిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఆ ఉద్యోగం మానేసినట్లు ఆ మహిళ చెప్పినట్లు మిథ్లాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నారని, అన్నిటికంటే ముఖ్యంగా, ఆటో డ్రైవర్‍గా ఆమె చాలా సంతోషంగా ఉన్నారని వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఆ మహిళ ఎక్కడ ఆటో నడుపుతున్నారనే వివరాలను మాత్రం ఆ వీడియోలో చెప్పలేదు.
    1
    పని ఒత్తిడి, ఆందోళనల కారణంగా తన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం ఆటో డ్రైవర్‍గా జీవనం సాగిస్తున్న ఓ మహిళ గురించి లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. మిథ్లాజ్ స్వయంగా ఆ మహిళ ఆటో ఎక్కి ఆమెతో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ఐటీ మేనేజర్‍గా పని చేసిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఆ ఉద్యోగం మానేసినట్లు ఆ మహిళ చెప్పినట్లు మిథ్లాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నారని, అన్నిటికంటే ముఖ్యంగా, ఆటో డ్రైవర్‍గా ఆమె చాలా సంతోషంగా ఉన్నారని వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఆ మహిళ ఎక్కడ ఆటో నడుపుతున్నారనే వివరాలను మాత్రం ఆ వీడియోలో చెప్పలేదు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • కాస్త ఈ రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..! తిమ్మాపురం గ్రామస్తుల ఆవేదన నంద్యాల జిల్లా మహానంది : కాస్త మా వీధి రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. శనివారం మహానంది మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామంలో పెద్దమ్మ అరుగు వీధి రోడ్డు జలమయమైంది. చినుకు చిటుక్కుమంటే చాలు రోడ్డంతా వర్షపు నీరు నిలిచిపోయి కాలనీవాసులు తిరగడానికి కూడా లేని పరిస్థితి, గ్రామంలో అన్ని సిసి రోడ్లు అయితే వేశారు. కానీ మా కాలనీ రోడ్డు తరుగు అవడంతో వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    కాస్త ఈ రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..! తిమ్మాపురం గ్రామస్తుల ఆవేదన
నంద్యాల జిల్లా మహానంది :  కాస్త మా వీధి రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. శనివారం మహానంది మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామంలో పెద్దమ్మ అరుగు వీధి రోడ్డు జలమయమైంది. చినుకు చిటుక్కుమంటే చాలు రోడ్డంతా వర్షపు నీరు నిలిచిపోయి కాలనీవాసులు తిరగడానికి కూడా లేని పరిస్థితి, గ్రామంలో అన్ని సిసి రోడ్లు అయితే వేశారు. కానీ మా కాలనీ రోడ్డు తరుగు అవడంతో వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నడుస్తోందా లేక కొందరి అవినీతి సామ్రాజ్యంగా మారిందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామరాజ్ హరీష్ కుమార్ తీవ్రంగా ప్రశ్నించారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన, రాష్ట్రంలో దేవాదాయ శాఖకు అసలు మంత్రి ఉన్నారా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తూ, ఒకవేళ ఉంటే ఆయన కేవలం ఒక "కీలుబొమ్మ" లాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత 16 నెలల కాలంలో ఈ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేవుడి సొమ్మును, భూములను రక్షించాల్సిన అధికారులే భక్షకులుగా మారారని ఆరోపణలు చేస్తూ, గత 16 నెలల కాలంలోనే వందల ఎకరాల దేవాదాయ భూములకు నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఓసిలు ఇచ్చిన ఘోర కలియుగాన్ని చూస్తున్నామని హరీష్ కుమార్ అన్నారు. ప్రస్తుత దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ రానున్న రోజుల్లో మరికొన్ని వేల ఎకరాల దేవుడి భూములకు ఎన్‌ఓసిలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తి కమిషనర్‌గా, ఏడీసీ-1గా, ఏడీసీ-2గా మూడు ఉన్నత పదవులను అనుభవిస్తూ దేవాదాయ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని ఆలయాల్లో దేవుళ్లకు జరగాల్సిన కైంకర్యాల్లో తీవ్ర లోపాలు జరుగుతున్నాయని, ఎన్నో చోట్ల దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసినా ప్రభుత్వానికి చలనం లేదని హరీష్ కుమార్ విమర్శించారు. భక్తులకు పెట్టే అన్నదానాల్లో సైతం నాణ్యత లోపించి, అవినీతి రాజ్యమేలుతోందని ఆయన అన్నారు. వయసులో పెద్దవారు, దేవుడిపై ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన మంత్రిని చూస్తే జాలేస్తోందని, దేవాదాయ శాఖకు సంబంధించిన ఏ కార్యక్రమంలో చూసినా కమిషనర్ రామచంద్ర మోహనే కనిపిస్తున్నారని, మంత్రి ఉనికి ఎక్కడా కనిపించడం లేదని భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారని ఆయన తెలిపారు. గత 16 నెలల కాలంలో దేవాదాయ శాఖలో జరిగిన భూముల ఎన్‌ఓసిలు, ఉద్యోగాల ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించాలని కామరాజ్ హరీష్ కుమార్ డిమాండ్ చేశారు. రానున్న గోదావరి పుష్కరాలు, కృష్ణా నది పుష్కరాల పర్యవేక్షణకు తక్షణమే దేవాదాయ శాఖ తరపున ఒక సమర్థుడైన ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాలని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోదావరి పుష్కరాల్లో జరిగిన చేదు అనుభవాలను గుర్తుచేశారు. ప్రస్తుత కమిషనర్ రామచంద్ర మోహన్‌పై తక్షణమే న్యాయపరమైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవినీతిపై స్పందించకపోతే, దేవుడిని నమ్మే ఒక సాధారణ భక్తుడిగా హైకోర్టును ఆశ్రయించి అయినా సరే న్యాయపరమైన విచారణ జరిగేలా చూస్తామని హెచ్చరించారు. దేవుడి సొమ్మును దోచుకుంటున్న వారిపై విచారణ జరిపించేంత వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
    1
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నడుస్తోందా లేక కొందరి అవినీతి సామ్రాజ్యంగా మారిందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామరాజ్ హరీష్ కుమార్ తీవ్రంగా ప్రశ్నించారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన, రాష్ట్రంలో దేవాదాయ శాఖకు అసలు మంత్రి ఉన్నారా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తూ, ఒకవేళ ఉంటే ఆయన కేవలం ఒక "కీలుబొమ్మ" లాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత 16 నెలల కాలంలో ఈ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

దేవుడి సొమ్మును, భూములను రక్షించాల్సిన అధికారులే భక్షకులుగా మారారని ఆరోపణలు చేస్తూ, గత 16 నెలల కాలంలోనే వందల ఎకరాల దేవాదాయ భూములకు నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఓసిలు ఇచ్చిన ఘోర కలియుగాన్ని చూస్తున్నామని హరీష్ కుమార్ అన్నారు. ప్రస్తుత దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ రానున్న రోజుల్లో మరికొన్ని వేల ఎకరాల దేవుడి భూములకు ఎన్‌ఓసిలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తి కమిషనర్‌గా, ఏడీసీ-1గా, ఏడీసీ-2గా మూడు ఉన్నత పదవులను అనుభవిస్తూ దేవాదాయ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని ఆలయాల్లో దేవుళ్లకు జరగాల్సిన కైంకర్యాల్లో తీవ్ర లోపాలు జరుగుతున్నాయని, ఎన్నో చోట్ల దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసినా ప్రభుత్వానికి చలనం లేదని హరీష్ కుమార్ విమర్శించారు. భక్తులకు పెట్టే అన్నదానాల్లో సైతం నాణ్యత లోపించి, అవినీతి రాజ్యమేలుతోందని ఆయన అన్నారు. వయసులో పెద్దవారు, దేవుడిపై ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన మంత్రిని చూస్తే జాలేస్తోందని, దేవాదాయ శాఖకు సంబంధించిన ఏ కార్యక్రమంలో చూసినా కమిషనర్ రామచంద్ర మోహనే కనిపిస్తున్నారని, మంత్రి ఉనికి ఎక్కడా కనిపించడం లేదని భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

గత 16 నెలల కాలంలో దేవాదాయ శాఖలో జరిగిన భూముల ఎన్‌ఓసిలు, ఉద్యోగాల ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించాలని కామరాజ్ హరీష్ కుమార్ డిమాండ్ చేశారు. రానున్న గోదావరి పుష్కరాలు, కృష్ణా నది పుష్కరాల పర్యవేక్షణకు తక్షణమే దేవాదాయ శాఖ తరపున ఒక సమర్థుడైన ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాలని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోదావరి పుష్కరాల్లో జరిగిన చేదు అనుభవాలను గుర్తుచేశారు. ప్రస్తుత కమిషనర్ రామచంద్ర మోహన్‌పై తక్షణమే న్యాయపరమైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవినీతిపై స్పందించకపోతే, దేవుడిని నమ్మే ఒక సాధారణ భక్తుడిగా హైకోర్టును ఆశ్రయించి అయినా సరే న్యాయపరమైన విచారణ జరిగేలా చూస్తామని హెచ్చరించారు. దేవుడి సొమ్మును దోచుకుంటున్న వారిపై విచారణ జరిపించేంత వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    7 hrs ago
  • కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.

వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.