జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టం చేసి ప్రజలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నట్లు టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ క్రమంలో, శుక్రవారం ధర్మవరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, జనసమ్మర్థ ప్రదేశాలు, సున్నిత ప్రాంతాలపై దృష్టి సారించి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. డ్రోన్ నిఘా ద్వారా నేరాలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడం, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం తమ ప్రధాన లక్ష్యాలని సీఐ వివరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రెడ్డప్ప ఈ సందర్భంగా హెచ్చరించారు. తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే డయల్-100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించి పోలీసు శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని, ఈ క్రమంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని టూ టౌన్ సీఐ రెడ్డప్ప స్పష్టం చేశారు.
జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టం చేసి ప్రజలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నట్లు టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ క్రమంలో, శుక్రవారం ధర్మవరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, జనసమ్మర్థ ప్రదేశాలు, సున్నిత ప్రాంతాలపై దృష్టి సారించి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. డ్రోన్ నిఘా ద్వారా నేరాలను ముందుగానే గుర్తించి
అడ్డుకోవడం, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం తమ ప్రధాన లక్ష్యాలని సీఐ వివరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రెడ్డప్ప ఈ సందర్భంగా హెచ్చరించారు. తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే డయల్-100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించి పోలీసు శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని, ఈ క్రమంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని టూ టౌన్ సీఐ రెడ్డప్ప స్పష్టం చేశారు.
- రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో ఏపీయూడబ్ల్యూజే మీడియా సంఘం ఆధ్వర్యంలో రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రక్తదాతలను అభినందిస్తూ, ఆపద సమయంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారందరికీ వారు అందించే రక్తదానం ఎంతగానో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సంఘం సభ్యులు, ప్రజలు, మరియు రిపోర్టర్లు పాల్గొన్నారు.1
- కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జూన్ 12, శుక్రవారం బద్వేలులో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం బద్వేలు టౌన్ ఎన్జీవో కాలనీలోని సిద్ధవటం రోడ్డులో గల మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి మరియు నియోజకవర్గ యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి ఆధ్వర్యం వహించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, రెండేళ్ల పాలన అభివృద్ధి కాదని, కేవలం వెన్నుపోటు మాత్రమేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు 'సూపర్ సిక్స్' పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని, ఆడబిడ్డ నిధి, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు సంక్షేమం వంటి హామీలు కేవలం ఎన్నికల మాయమాటలుగానే మిగిలిపోయాయని ఆయన మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించిన వైఎస్ జగన్ పాలనను ఆపేసి, పేద ప్రజల నోటికాడి ముద్దను లాక్కున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని ఆయన విమర్శించారు. అదేవిధంగా, ఎమ్మెల్యే డాక్టర్ సుధ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారని, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, మహిళలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ప్రచారాలకే పరిమితమైందని విమర్శించారు. ధరల పెరుగుదల, పన్నుల భారం, సంక్షేమ పథకాల కోతలతో సామాన్య ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవసాని ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, 'మెగా డీఎస్సీ' పేరుతో లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేశారని, ఉద్యోగాల పేరుతో యువత భవిష్యత్తుతో చెలగాటమాడారని విమర్శించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైసిపి నాయకులు బోడపాడు రామసుబ్బారెడ్డి, వైయస్సార్ కడప జిల్లా వైసిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్లు, బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు పుల్లయ్యతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.3
- పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిల్వ కేంద్ర మెడికల్ ఆఫీసర్ దేవరకొండ భార్గవ్, రక్తదానం చేయటాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈనెల 15న ఆసుపత్రి ఆవరణంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మృతి చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని దేవరకొండ భార్గవ్ విజ్ఞప్తి చేశారు.1
- ఆదోని పట్టణంలోని నల్లగట్టు సమీపంలో రైలు కింద పడి గుర్తుతెలియని బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య వెల్లడించారు. మృతి చెందిన బాలిక ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.1
- శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో చంద్రబాబు కూటమి రెండేళ్ల పాలనను 'వెన్నుపోటు పాలన'గా అభివర్ణిస్తూ, దానికి నిరసనగా వైకాపా భారీ ర్యాలీని చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు వెంకటకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ పట్టణ ప్రధాన కూడలిలో జరిగింది. ఈ సందర్భంగా వెంకటకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, రాబోయేది జగన్ ప్రభుత్వమేనని, ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని స్పష్టం చేశారు. ధర్మవరం వైకాపా పార్టీ ఈ నిరసన ర్యాలీని నిర్వహించింది.1
- వైయస్సార్ కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో జరుగుతున్న భూ, మట్టి, ఇసుక మాఫియాలపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి స్థానిక ప్రజలను, ప్రకృతి సంపదను కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ తన బృంద సభ్యులతో కలిసి శుక్రవారం పోరుమామిళ్ల పట్టణంలో జరిగిన 'ఒక నియోజకవర్గం నాలుగు పర్యటనలు పరిష్కార వేదిక' కార్యక్రమంలో వైయస్సార్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్, డిసిసిబి చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేలు నియోజకవర్గ కేంద్రంలో గతంలో పనిచేసిన తాసిల్దార్ల, ఇరిగేషన్ అధికారుల చేతివాటం కారణంగా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, మాదిగ ఇనాం భూములు, ZHDC, గయ్యాలి భూములు, ఫ్రీ హోల్డ్ భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. కలసపాడులోని శంఖవరం పై తిప్పనున్న భూములతో పాటు బి. కోడూరు మండలంలోని వేముకుంట గ్రామంలో గయ్యాలి భూములు ఆక్రమణకు గురయ్యాయని, అలాగే నియోజకవర్గంలోని 48 చెరువులలో 30కి పైగా చెరువులు, వంకలు, కుంటలు కబ్జా అయ్యాయని తెలిపారు. సహజ ప్రవాహంగా ఏర్పడిన చిరాయితి పట్టాల స్థలాలు, జాతీయ రహదారి కల్వర్టులు సైతం కబ్జాలకు గురై పెద్ద పెద్ద భవనాలు, గెస్ట్ హౌస్‌లు, పండ్ల తోటలు వెలిశాయని, దీనిపై స్థానిక రెవిన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రెవిన్యూ అధికారులే కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని, దశాబ్ద కాలంగా కబ్జాదారులకు మడుగులొత్తిన రెవిన్యూ అధికారులను రీకాల్ చేసి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బద్వేలు ప్రాంతంలోని నాగుల చెరువు, బయనపల్లె, భాకరాపేట చెరువులు సైతం ఇరిగేషన్ అధికారుల లోపాయికారి ఒప్పందాల వలన ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని, స్థానిక అధికారులకు ఆధారాలతో ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా కనీస చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలు పట్టణం చుట్టుపక్కల ఉన్న భూమిరెడ్డిపల్లి చెరువు, బద్వేలు పెద్ద చెరువు, వల్లెలవారి పల్లె, మేకవారి పల్లె ఎదురుగా ఉన్న కొండలను పెద్ద పెద్ద యంత్రాలతో ప్రభుత్వ సెలవు దినాలను లక్ష్యంగా చేసుకొని తరలిస్తూ, వందలాది టిప్పర్ల లోడ్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అధికారులు కేవలం నామమాత్రంగా ఒకటి రెండు వాహనాలను సీజ్ చేసి లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న మట్టి మాఫియాను నివారించి, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బద్వేలు ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న ఎర్రచందనం, బంకమట్టి, వెదురు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. గోపవరం మండలం శ్రీనివాసపురం వద్దనున్న ఇసుక డంపును ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కోట్లాది రూపాయలకు ఇసుకను అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు. గోపవరం మండలంలోని సత్య టౌన్‌షిప్ లాంటి వాటికి కొంతమంది ప్రభుత్వాధికారులే ప్రభుత్వ భూములను కట్టబెట్టి లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారని విమర్శలు ఉన్నాయని, తక్షణమే బద్వేలు చుట్టుపక్కల వెలసిన అక్రమ లేఅవుట్‌లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై స్పందించిన జాయింట్ కలెక్టర్, తక్షణమే రెండు రోజుల్లో సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓను, స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జకరయ్య, నియోజకవర్గ కమిటీ సభ్యులు విజయరావు, బాబు, నారాయణ, పట్టణ కమిటీ సభ్యులు సలీం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు శిఖామణి తదితరులు పాల్గొన్నారు.1
- నాగలూటి నుండి నందికొట్కూరు వరకు తారు రోడ్డును నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన నాయకులతో కలిసి ఆ రహదారిని పరిశీలించారు. రోడ్డు అస్తవ్యస్తంగా తయారై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తక్షణమే స్పందించి తారు రోడ్డును వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శేఖర్ కూడా పాల్గొన్నారు.1
- మహానందితో పాటు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మహానంది ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈనెల 9వ తేదీన మహానంది దేవస్థానం వెనుకవైపు గేట్ వద్ద నిలిపిన పల్సర్, హెచ్ఎఫ్ డీలక్స్ రెండు ద్విచక్రవాహనాలను మారుతాలతో స్టార్ట్ చేసి దొంగలించినట్లు ఆయన వెల్లడించారు. గుర్తించిన ముద్దాయిలు నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్ కు చెందిన పాలీ గోపీనాయక్, కర్నూలు పట్టణం షరీన్ నగర్ (ప్రస్తుతం ఎన్జీవో కాలనీకి చెందిన) మేనుగా రాజు, నంద్యాల పట్టణం దేవనగర్లోని నాగులకట్ట దగ్గర ఉన్న షేక్ సాబిర్ హుస్సేన్, డోన్ మండలం చిన్న మల్కాపురానికి చెందిన (ప్రస్తుతం గోస్పాడు మండలం యాళ్లూరులో నివసిస్తున్న) దొడ్డగాళ్ల ప్రకాష్ అని ఎస్ఐ పేర్కొన్నారు. వీరిని శుక్రవారం నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలోని నందిపల్లెమెట్ట వద్ద బైక్ చోరీలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలను మరింత లోతుగా విచారించగా, నంద్యాల త్రీటౌన్ స్టేషన్ పరిధిలో ఒక మోటర్ సైకిల్ కేసు, ఆళ్లగడ్డ పట్టణం పరిధిలోని మరో కేసులో ఒక మోటర్ సైకిలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్ఐ తెలిపారు. రికవరీ చేసిన నాలుగు ద్విచక్రవాహనాల విలువ రూ.2.70 లక్షలు ఉంటుందన్నారు. ఈ నలుగురు నిందితులు తాగుడుతోపాటు ఇతర వ్యవసనాలకు అలవాటుపడి తప్పుదారిలో నడుస్తూ దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు. త్వరితగతిన ద్విచక్ర వాహనాలను రికవరీ చేయడంతో జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్, నంద్యాల సబ్ డివిజన్ అధికారిని మంద జావలి ఆల్ఫోన్స్, పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారని ఎస్ఐ తెలిపారు. ఈ సమావేశంలో నంద్యాల రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.1