logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా జవాబుదారీతనాన్ని పాటించాలి : ఎన్నికల పరిశీలకురాలు ప్రశాంతి నంద్యాల, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR -2026) ప్రక్రియలో ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ మరియు ఇతర ఎన్నికల విధులను పకడ్బందీగా పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకురాలు ప్రశాంతి IAS తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, డి ఆర్ ఓ రాము నాయక్, వీఆర్వోలు, ఏ ఈ ఆర్ ల తో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ పై ఎన్నికల పరిశీలకురాలు ప్రశాంతి సమీక్షించారు. ఎన్నికల విధుల పరిశీలనలో భాగంగా బీఎల్‌ఓల పనితీరు, ఓటర్ల జాబితా సవరణ, ఫారమ్‌ల పరిష్కారం, నోటీసుల విచారణ తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పరిశీలనలో బీఎల్‌ఓలు తమ విధులపై స్పష్టమైన అవగాహనతో, అవసరమైన ఆధారాలు మరియు పత్రాలను సక్రమంగా సేకరిస్తూ సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేయడంలో బీఎల్‌ఓలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్‌గా పనిచేసిన అనుభవాన్ని వినియోగిస్తూ సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. ప్రణాళిక, శిక్షణ అంశాలను కలెక్టర్ మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో వాటిని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. మరణించిన వారి పేర్లను ఏఎస్‌డీ (ASD) జాబితా నుంచి తొలగించే సమయంలో రాజకీయ పార్టీలతో స్పష్టమైన కమ్యూనికేషన్ కొనసాగించాలని తెలిపారు. డెత్ సర్టిఫికెట్, కుటుంబ సభ్యుల డిక్లరేషన్, అవసరమైన సందర్భాల్లో వీఆర్వో సమక్షంలో పంచనామా వంటి ఆధారాలను పరిశీలించిన అనంతరమే తొలగింపు ప్రక్రియ చేపట్టాన్నారు. గతంతో పోలిస్తే ఫారమ్-7 ద్వారా పేర్ల తొలగింపునకు వచ్చే అభ్యర్థనలు తగ్గడం బీఎల్‌ఓలు ఏఎస్‌డీ జాబితా ఆధారంగా మరణించిన ఓటర్లను ముందుగానే గుర్తించి, ఓటర్ల జాబితాను సమర్థవంతంగా ప్యూరిఫికేషన్ చేస్తున్నారనడానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే వారపు సమావేశాలను కేవలం తహసీల్దార్ల స్థాయిలో కాకుండా ఈఆర్‌ఓలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. నో-మ్యాపింగ్, లాజికల్ ఎర్రర్స్‌కు సంబంధించిన కేసులను ప్రత్యేకంగా షెడ్యూల్ చేసి, నిర్ణీత 24 నుంచి 48 గంటల వ్యవధిలో కలెక్టర్ లాగిన్‌కు పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా జారీ చేసిన నోటీసులకు సంబంధించి హియరింగ్స్‌ ను త్వరితగతిన పూర్తి చేసి, పెండింగ్‌ లో ఉన్న క్లెయిమ్స్‌ను నిబంధనల ప్రకారం పరిశీలించి వేగంగా డిస్పోజల్ చేయాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోని పారదర్శకంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్యూరికేషన్, ఎన్నికల విధులను పగడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ భారత ఎన్నికల సంఘం సూచించిన సవరించిన షెడ్యూల్ ప్రకారం వేగంగా కొనసాగుతోందనీ ఎన్నికల పరిశీలకురాలకు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితాను పారదర్శకంగా, నిష్పాక్షికంగా శుద్ధి చేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు.ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయిందన్నారు. SIR ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని 6,066 మంది, లాజికల్ డిస్క్రెపెన్సీస్ ఉన్న 74,217 మంది కలిపి మొత్తం 80,283 మంది ఓటర్లకు 100 శాతం నోటీసులు జారీ చేసి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 36,382 హియరింగ్స్ నిర్వహించి, సంబంధిత ఆధారాలను సేకరించామని అన్నారు. ప్రస్తుతం ప్రతి కేసుకు సంబంధించి BLO నివేదికతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 13 రకాల ప్రామాణిక పత్రాలలో ఏదో ఒకదానిని సేకరించి విచారణలను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫారమ్-6 ఫారమ్-7లో ఫారమ్-8 దరఖాస్తులను నిర్ణీత గడువులోగా నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ చివరి తేదీ ఆగస్టు 30, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం చివరి తేదీ: సెప్టెంబర్ 28 తుది ఓటర్ల జాబితా ప్రచురణ: అక్టోబర్ 3 ERO లు, AERO లు, BLO లు సమన్వయంతో పనిచేస్తూ క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చూడడంతో పాటు, అనర్హలు అయిన మరియు డూప్లికేట్ నమోదులను నిబంధనల ప్రకారం గుర్తించి సరిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా SIR ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం పనిచేస్తోందన్నారు.

3 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
c3db0950-7a77-4ad1-822c-4e26afe9cde3

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా జవాబుదారీతనాన్ని పాటించాలి : ఎన్నికల పరిశీలకురాలు ప్రశాంతి నంద్యాల, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR -2026) ప్రక్రియలో ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ మరియు ఇతర ఎన్నికల విధులను పకడ్బందీగా పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకురాలు ప్రశాంతి IAS తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, డి ఆర్ ఓ రాము నాయక్, వీఆర్వోలు, ఏ ఈ ఆర్ ల తో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ పై ఎన్నికల పరిశీలకురాలు ప్రశాంతి సమీక్షించారు. ఎన్నికల విధుల పరిశీలనలో భాగంగా బీఎల్‌ఓల పనితీరు, ఓటర్ల జాబితా సవరణ, ఫారమ్‌ల పరిష్కారం, నోటీసుల విచారణ తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పరిశీలనలో బీఎల్‌ఓలు తమ విధులపై స్పష్టమైన అవగాహనతో, అవసరమైన ఆధారాలు మరియు పత్రాలను సక్రమంగా సేకరిస్తూ సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేయడంలో బీఎల్‌ఓలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్‌గా పనిచేసిన అనుభవాన్ని వినియోగిస్తూ సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. ప్రణాళిక, శిక్షణ అంశాలను కలెక్టర్ మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో వాటిని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. మరణించిన వారి పేర్లను ఏఎస్‌డీ (ASD) జాబితా నుంచి తొలగించే సమయంలో రాజకీయ పార్టీలతో స్పష్టమైన కమ్యూనికేషన్ కొనసాగించాలని తెలిపారు. డెత్ సర్టిఫికెట్, కుటుంబ సభ్యుల డిక్లరేషన్, అవసరమైన సందర్భాల్లో వీఆర్వో సమక్షంలో పంచనామా వంటి ఆధారాలను పరిశీలించిన అనంతరమే తొలగింపు ప్రక్రియ చేపట్టాన్నారు. గతంతో పోలిస్తే ఫారమ్-7 ద్వారా పేర్ల తొలగింపునకు వచ్చే అభ్యర్థనలు తగ్గడం బీఎల్‌ఓలు ఏఎస్‌డీ జాబితా ఆధారంగా మరణించిన ఓటర్లను ముందుగానే గుర్తించి, ఓటర్ల జాబితాను సమర్థవంతంగా ప్యూరిఫికేషన్ చేస్తున్నారనడానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే వారపు సమావేశాలను కేవలం తహసీల్దార్ల స్థాయిలో కాకుండా ఈఆర్‌ఓలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. నో-మ్యాపింగ్, లాజికల్ ఎర్రర్స్‌కు సంబంధించిన కేసులను ప్రత్యేకంగా షెడ్యూల్

97180262-73ab-40bb-a155-8614d9c5ac2b

చేసి, నిర్ణీత 24 నుంచి 48 గంటల వ్యవధిలో కలెక్టర్ లాగిన్‌కు పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా జారీ చేసిన నోటీసులకు సంబంధించి హియరింగ్స్‌ ను త్వరితగతిన పూర్తి చేసి, పెండింగ్‌ లో ఉన్న క్లెయిమ్స్‌ను నిబంధనల ప్రకారం పరిశీలించి వేగంగా డిస్పోజల్ చేయాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోని పారదర్శకంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్యూరికేషన్, ఎన్నికల విధులను పగడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ భారత ఎన్నికల సంఘం సూచించిన సవరించిన షెడ్యూల్ ప్రకారం వేగంగా కొనసాగుతోందనీ ఎన్నికల పరిశీలకురాలకు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితాను పారదర్శకంగా, నిష్పాక్షికంగా శుద్ధి చేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు.ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయిందన్నారు. SIR ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని 6,066 మంది, లాజికల్ డిస్క్రెపెన్సీస్ ఉన్న 74,217 మంది కలిపి మొత్తం 80,283 మంది ఓటర్లకు 100 శాతం నోటీసులు జారీ చేసి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 36,382 హియరింగ్స్ నిర్వహించి, సంబంధిత ఆధారాలను సేకరించామని అన్నారు. ప్రస్తుతం ప్రతి కేసుకు సంబంధించి BLO నివేదికతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 13 రకాల ప్రామాణిక పత్రాలలో ఏదో ఒకదానిని సేకరించి విచారణలను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫారమ్-6 ఫారమ్-7లో ఫారమ్-8 దరఖాస్తులను నిర్ణీత గడువులోగా నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ చివరి తేదీ ఆగస్టు 30, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం చివరి తేదీ: సెప్టెంబర్ 28 తుది ఓటర్ల జాబితా ప్రచురణ: అక్టోబర్ 3 ERO లు, AERO లు, BLO లు సమన్వయంతో పనిచేస్తూ క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చూడడంతో పాటు, అనర్హలు అయిన మరియు డూప్లికేట్ నమోదులను నిబంధనల ప్రకారం గుర్తించి సరిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా SIR ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం పనిచేస్తోందన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ବିଜେପି କେତେ ନୀଳଜା ଅଛି
    1
    ବିଜେପି କେତେ ନୀଳଜା ଅଛି
    user_Anwar ali khan
    Anwar ali khan
    Video Creator Nandyal, Andhra Pradesh•
    7 hrs ago
  • పోలీసులపై అసత్య ఆరోపణలు: నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ కొట్కూరు పీఎస్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో ముద్దాయిలపై ఎలాంటి చిత్రహింసలకు పాల్పడలేదని సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులు స్వయంగా గాయాలు చేసుకొని నందికొట్కూరు సీహెచ్‌సీ వద్ద మీడియా ముందు పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవసరమైనప్పుడు విచారణకు మళ్లీ హాజరు కావాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.
    1
    పోలీసులపై అసత్య ఆరోపణలు: నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం 
బ్రాహ్మణ కొట్కూరు పీఎస్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో ముద్దాయిలపై ఎలాంటి చిత్రహింసలకు పాల్పడలేదని సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులు స్వయంగా గాయాలు చేసుకొని నందికొట్కూరు సీహెచ్‌సీ వద్ద మీడియా ముందు పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవసరమైనప్పుడు విచారణకు మళ్లీ హాజరు కావాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు *ప్రజల మధ్య శేఖరన్న – అభివృద్ధి బాటలో కులుమల గ్రామం *గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు.* *ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.* *ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా శేఖరన్న గారి పర్యటన కొనసాగింది.
    1
    గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు
*ప్రజల మధ్య శేఖరన్న – అభివృద్ధి బాటలో కులుమల గ్రామం 
*గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు.*
*ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.*
*ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా శేఖరన్న గారి పర్యటన కొనసాగింది.
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ప్రియ దైవ స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం
    1
    ప్రియ దైవ  స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం
    user_T. Raja simha
    T. Raja simha
    కలసపాడు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష  ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.  
ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Sujith raj
    Sujith raj
    ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    1 hr ago
  • రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు
    1
    రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు 
పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • *బస్సు-కంటైనర్‌ - "ఢీ"* *6గురు మృతి* *20 మందికి తీవ్ర గాయాలు* *దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం* రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి *ఏలూరు వెళ్తున్న* బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    2
    *బస్సు-కంటైనర్‌ - "ఢీ"* 

*6గురు మృతి*

*20 మందికి తీవ్ర గాయాలు*

*దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం*

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి
*ఏలూరు వెళ్తున్న* బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 
హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.