logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుంటూరు టిడిపి పార్టీలో ఉన్న మైనార్టీ నాయకుడు షేక్ షంషేర్ దౌర్జన్యం.. ఖండించిన సంఘాలు.. గుంటూరు TDP పార్టీలో ఉన్న మైనారిటీ నాయకుడు షేక్.షంషీర్ పై దౌర్జన్యం. గుంటూరు టీడీపీ నాయకులు, గుంటూరు ఈస్ట్ MRO, గుంటూరు జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు, DRDA అధికారులు కలిసి షేక్.షంషీర్ పై హుకుం జారీ చేస్తున్నారు.గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్న సంజీవిని జెనరిక్ మెడికల్ షాపును 2024 నుండి 2029 వరకు 5 సంవత్సరాలపాటు షేక్.షంషీర్ తో గుంటూరు జిల్లా మహిళా సమైక్య సంఘం ఒప్పందం చేసుకుంది.కానీ టీడీపీ నాయకుడు ఓంకార్, గుంటూరు ఈస్ట్ ఎమ్ఆర్వో సహాయంతో మహిళా సమైక్య అధ్యక్షురాలిపై ఒత్తిడి తెచ్చి, 28వ తేదీ అర్ధరాత్రి షేక్.షంషీర్ లేని సమయంలో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మెడికల్ షాపులోకి బలవంతంగా చొరబడ్డారు.అక్కడ ఉన్న సిబ్బందిని బయటకు వెళ్లి పోవాలని బెదిరించారు లేకపోతే మీ సంగతి చూస్తాం అంటూ మహిళా సమైక్య అధ్యక్షురాలు భయ ప్రాంతానికి గురి చేశారు గుంటూరు ఈస్ట్ ఎమ్ఆర్వో సమక్షంలో 40 లక్షల రూపాయల విలువైన మందులన్నింటినీ వారు తీసుకొచ్చిన వాహనంలో తీసుకెళ్లారు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసన తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకుడు షేక్.కరీం మీడియా సమావేశంలో మాట్లాడుతూ. 1. 2029 వరకు చేసిన ఒప్పందాన్ని కొనసాగించాలి 2. అన్న సంజీవిని మెడికల్ షాపులో 22 మంది సిబ్బందికి రక్షణ కల్పించాలి, తిరిగి ఉపాధి కల్పించాలి 3. గుంటూరు టీడీపీ నాయకులు, ఈస్ట్ ఎమ్ఆర్వో, మహిళా సమైక్య అధ్యక్షురాలు, డిఆర్డీఏ అధికారులపై కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి 4. మైనారిటీ సోదరుడు షేక్.షంషీర్ కు న్యాయం చేయాలి. 5. సొంత టిడిపి నాయకుడు పైనే ఈ విధంగా కఠినంగా ప్రవర్తిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో సామాన్య మైన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. 6. న్యాయస్థానం విధి విధానాలు మరియు గౌరవాన్ని పాటించకుండా ఒకపక్క కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ దౌర్జన్యంగా వ్యవహరించిన గుంటూరు ఈస్ట్ MRO ను తక్షణమే సస్పెండ్ చేయాలి జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలుని పదవి నుంచి తొలగించాలి DRDA అధికారిని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

20 hrs ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•
20 hrs ago
5bbd366c-db23-4b8b-97b4-81ca6c0fe650

గుంటూరు టిడిపి పార్టీలో ఉన్న మైనార్టీ నాయకుడు షేక్ షంషేర్ దౌర్జన్యం.. ఖండించిన సంఘాలు.. గుంటూరు TDP పార్టీలో ఉన్న మైనారిటీ నాయకుడు షేక్.షంషీర్ పై దౌర్జన్యం. గుంటూరు టీడీపీ నాయకులు, గుంటూరు ఈస్ట్ MRO, గుంటూరు జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు, DRDA అధికారులు కలిసి షేక్.షంషీర్ పై హుకుం జారీ చేస్తున్నారు.గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్న సంజీవిని జెనరిక్ మెడికల్ షాపును 2024 నుండి 2029 వరకు 5 సంవత్సరాలపాటు షేక్.షంషీర్ తో గుంటూరు జిల్లా మహిళా సమైక్య సంఘం ఒప్పందం చేసుకుంది.కానీ టీడీపీ నాయకుడు ఓంకార్, గుంటూరు ఈస్ట్ ఎమ్ఆర్వో సహాయంతో మహిళా సమైక్య అధ్యక్షురాలిపై ఒత్తిడి తెచ్చి, 28వ తేదీ అర్ధరాత్రి షేక్.షంషీర్ లేని సమయంలో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మెడికల్ షాపులోకి బలవంతంగా చొరబడ్డారు.అక్కడ ఉన్న సిబ్బందిని బయటకు వెళ్లి పోవాలని బెదిరించారు లేకపోతే మీ సంగతి చూస్తాం అంటూ మహిళా సమైక్య అధ్యక్షురాలు భయ ప్రాంతానికి గురి చేశారు గుంటూరు ఈస్ట్ ఎమ్ఆర్వో సమక్షంలో 40 లక్షల రూపాయల విలువైన మందులన్నింటినీ వారు తీసుకొచ్చిన వాహనంలో తీసుకెళ్లారు ఇప్పటివరకు ఎటువంటి

b702558d-0db4-4f9e-8a12-c1690519fdf7

సమాచారం లేదు.ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసన తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకుడు షేక్.కరీం మీడియా సమావేశంలో మాట్లాడుతూ. 1. 2029 వరకు చేసిన ఒప్పందాన్ని కొనసాగించాలి 2. అన్న సంజీవిని మెడికల్ షాపులో 22 మంది సిబ్బందికి రక్షణ కల్పించాలి, తిరిగి ఉపాధి కల్పించాలి 3. గుంటూరు టీడీపీ నాయకులు, ఈస్ట్ ఎమ్ఆర్వో, మహిళా సమైక్య అధ్యక్షురాలు, డిఆర్డీఏ అధికారులపై కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి 4. మైనారిటీ సోదరుడు షేక్.షంషీర్ కు న్యాయం చేయాలి. 5. సొంత టిడిపి నాయకుడు పైనే ఈ విధంగా కఠినంగా ప్రవర్తిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో సామాన్య మైన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. 6. న్యాయస్థానం విధి విధానాలు మరియు గౌరవాన్ని పాటించకుండా ఒకపక్క కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ దౌర్జన్యంగా వ్యవహరించిన గుంటూరు ఈస్ట్ MRO ను తక్షణమే సస్పెండ్ చేయాలి జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలుని పదవి నుంచి తొలగించాలి DRDA అధికారిని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బాధితులను కాదు.. నిందితులను పరామర్శించడం దారుణం: కొల్లు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పర్యటనపై రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పరామర్శ పేరుతో గంజాయి బ్యాచ్‌ను పోగేసి ప్రదర్శనలు నిర్వహించడం అవసరమా అని జగన్‌ను ప్రశ్నించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కేసులో ఓ యాదవ యువకుడు మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా జైలులో ఉన్న నిందితులను ములాఖత్ పేరుతో కలవడం సిగ్గుచేటని అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చకుండా నిందితులను పరామర్శించడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పట్ల జగన్ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. జైలు వద్ద ప్రదర్శనలు నిర్వహించేందుకే కావాలనే సాయంత్రం 5 గంటల వరకు వెళ్లకుండా రాజకీయ డ్రామా చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు, పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగన్‌కు సూచించారు.
    1
    బాధితులను కాదు.. నిందితులను పరామర్శించడం దారుణం: కొల్లు
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పర్యటనపై రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
పరామర్శ పేరుతో గంజాయి బ్యాచ్‌ను పోగేసి ప్రదర్శనలు నిర్వహించడం అవసరమా అని జగన్‌ను ప్రశ్నించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కేసులో ఓ యాదవ యువకుడు మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా జైలులో ఉన్న నిందితులను ములాఖత్ పేరుతో కలవడం సిగ్గుచేటని అన్నారు.
చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చకుండా నిందితులను పరామర్శించడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పట్ల జగన్ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు.
జైలు వద్ద ప్రదర్శనలు నిర్వహించేందుకే కావాలనే సాయంత్రం 5 గంటల వరకు వెళ్లకుండా రాజకీయ డ్రామా చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు, పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగన్‌కు సూచించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.
    2
    ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    17 hrs ago
  • ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది
    1
    ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది
ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    14 hrs ago
  • తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు........... తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    1
    తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు...........
తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ... జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు.... జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు
    3
    ఎన్టీఆర్ జిల్లా 

మైలవరం నియోజకవర్గం 

 మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు

 మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ...

 జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం

 జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు....

 జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య. పెదకూరపాడు : రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.
    1
    పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య.
పెదకూరపాడు : 
రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • GNT: రాజ్యసభలో తొలిసారి మాట్లాడిన గుంటూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ రాజ్యసభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు–2026పై తొలిసారి ప్రసంగించిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్‌రక్ కోర్టులతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. ఏపీలో మెగా డీఎస్సీతో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.
    1
    GNT: రాజ్యసభలో తొలిసారి మాట్లాడిన గుంటూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ
రాజ్యసభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు–2026పై తొలిసారి ప్రసంగించిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్‌రక్ కోర్టులతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది.  ఏపీలో మెగా డీఎస్సీతో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.