స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారాల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని తీర్మానం. -లెన్స్‌కార్ట్ అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం. శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పట్టణంలో లెన్స్‌కార్ట్ షోరూమ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక చిన్న వ్యాపారుల భవిష్యత్, ఉద్యోగుల ఉపాధి, కార్పొరేట్ సంస్థల ప్రభావం, ప్రభుత్వ శాఖల స్పందన, చట్టబద్ధ అనుమతుల అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ధర్మవరంలో దశాబ్దాలుగా స్థానిక ఆప్టికల్ వ్యాపారాలపై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ కుటుంబాలు గత తొమ్మిది నెలలుగా తమ ఉపాధి, భవిష్యత్తు మరియు చిన్న వ్యాపారాల పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి తమ సమస్యలను వివరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం పట్ల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. స్థానిక వ్యాపారులు మాత్రమే కాకుండా పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాలు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు కూడా ఈ సమస్యకు మద్దతుగా నిలిచి తమ అభిప్రాయాలను తెలియజేసినప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో నిరాశ, ఆందోళన వ్యక్తమవుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాల్లో మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, సంబంధిత భవనం మరియు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, కమర్షియల్ వినియోగ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ అనుమతులు మరియు ఇతర చట్టబద్ధ అనుమతులపై సంబంధిత శాఖలు పూర్తి పారదర్శకతతో విచారణ నిర్వహించి ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే స్థానిక వ్యాపారులు మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, టౌన్ ప్లానింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో పలు సందేహాలకు తావిస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల సమస్యల విషయంలో అధికారులు ఆలస్యం చేయకుండా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే, ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ప్రజలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగుల జీవనోపాధిని కాపాడే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోని పక్షంలో, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎంఎల్), సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌బీ, ఎంఆర్పీఎస్తో పాటు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్థానిక వ్యాపార సంఘాలు ఐక్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, స్థానిక చిన్న వ్యాపారులు మరియు ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మరియు స్థానిక వ్యాపారులు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలను చేపడతామని సమావేశంలో వెల్లడించారు. స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారుల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, కాంగ్రెస్ నాయకులు తుంపర్తి పరమేష్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి యర్రంశెట్టి రమణ, సీపీఐ(ఎంఎల్) నాయకులు పోలా లక్ష్మీనారాయణ, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, బీఎస్పీ నాయకులు వినయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వెంకటేష్తో పాటు స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులు మరియు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. "స్థానిక ఉపాధి – స్థానిక హక్కు", "చట్టం ముందు అందరూ సమానమే", "చిన్న వ్యాపారాల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది" అనే నినాదాలతో సమావేశం ముగిసింది.
స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారాల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని తీర్మానం. -లెన్స్‌కార్ట్ అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం. శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పట్టణంలో లెన్స్‌కార్ట్ షోరూమ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక చిన్న వ్యాపారుల భవిష్యత్, ఉద్యోగుల ఉపాధి, కార్పొరేట్ సంస్థల ప్రభావం, ప్రభుత్వ శాఖల స్పందన, చట్టబద్ధ అనుమతుల అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ధర్మవరంలో దశాబ్దాలుగా స్థానిక ఆప్టికల్ వ్యాపారాలపై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ కుటుంబాలు గత తొమ్మిది నెలలుగా తమ ఉపాధి, భవిష్యత్తు మరియు చిన్న వ్యాపారాల పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి తమ సమస్యలను వివరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం పట్ల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. స్థానిక వ్యాపారులు మాత్రమే కాకుండా పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాలు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు కూడా ఈ సమస్యకు మద్దతుగా నిలిచి తమ అభిప్రాయాలను తెలియజేసినప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో నిరాశ, ఆందోళన వ్యక్తమవుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాల్లో మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, సంబంధిత భవనం మరియు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, కమర్షియల్ వినియోగ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ అనుమతులు మరియు ఇతర చట్టబద్ధ అనుమతులపై సంబంధిత శాఖలు పూర్తి పారదర్శకతతో విచారణ నిర్వహించి ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే స్థానిక వ్యాపారులు మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, టౌన్ ప్లానింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు
సమర్పించినప్పటికీ, ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో పలు సందేహాలకు తావిస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల సమస్యల విషయంలో అధికారులు ఆలస్యం చేయకుండా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే, ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ప్రజలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగుల జీవనోపాధిని కాపాడే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోని పక్షంలో, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎంఎల్), సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌బీ, ఎంఆర్పీఎస్తో పాటు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్థానిక వ్యాపార సంఘాలు ఐక్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, స్థానిక చిన్న వ్యాపారులు మరియు ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మరియు స్థానిక వ్యాపారులు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలను చేపడతామని సమావేశంలో వెల్లడించారు. స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారుల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, కాంగ్రెస్ నాయకులు తుంపర్తి పరమేష్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి యర్రంశెట్టి రమణ, సీపీఐ(ఎంఎల్) నాయకులు పోలా లక్ష్మీనారాయణ, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, బీఎస్పీ నాయకులు వినయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వెంకటేష్తో పాటు స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులు మరియు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. "స్థానిక ఉపాధి – స్థానిక హక్కు", "చట్టం ముందు అందరూ సమానమే", "చిన్న వ్యాపారాల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది" అనే నినాదాలతో సమావేశం ముగిసింది.
- సోమలాపురంలో తాగునీటి వృధాను అరికట్టండి మహాప్రభో అంటున్న ప్రజలు డి హిరేహాల్ మండలం సోమలాపురం గ్రామంలో రోడ్లపై వృధాగా త్రాగునీరు వెళుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఏంటంటూ స్థానికులు పేర్కొన్నారు. వైయస్సార్ విగ్రహం ముందు పైప్ లీకేజీ కారణంగా భారీగా నీరు వృధాగా రోడ్లపై వెళుతోందని పేర్కొన్నారు. సచివాలయం ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిలబడటంతో అటుగా వెళుతున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే నీటి వృధా ని అరికట్టాలని వారు కోరుతున్నారు.1
- విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. పుంగనూరు బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.1
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న స్తంభాలు తొలగించాలి నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము. కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు. నమస్కారములతో.... పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం. పుంగనూరు......2
- గోరింటాకుల ప్రత్యేక అలంకరణలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనం రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన నగరేశ్వర కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాడమాసం సందర్భంగా అమ్మవారు గోరింటాకు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పురోహితులు మంజునాథ్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గోరింటాకులతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. మహిళా భక్తాదులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆషాడమాసంలో ప్రత్యేకించి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పురోహితులను సూచించారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ ..పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్ల రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ1
- కాణిపాకంలో టిడిపి వైసిపి నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఐరాల మండలం కాణిపాకంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య నినాదాలతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్య ప్రమాణ కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ నాయకులను ఉద్దేశించి నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1