logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నకిరేకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఈరోజు పరామర్శించారు. ​సిపిఎం నాయకుడి కుటుంబానికి పరామర్శ: ​నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీకి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు కనుకుంట్ల శంకర్ రెడ్డి సతీమణి కనుకుంట్ల సుశీల గారు ఇటీవలే అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న చిరుమర్తి లింగయ్య గారు నేడు వారి నివాసానికి చేరుకుని, సుశీల గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శంకర్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ​తుంగతుర్తిలో నివాళులు: అనంతరం కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన కొండ బజారు గారు అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహాన్ని చిరుమర్తి లింగయ్య సందర్శించారు. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన, ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ పరామర్శ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, తుంగతుర్తి సర్పంచ్, మాజీ సర్పంచ్ అలుగువెల్లి సంజీవరెడ్డి, నాయకులు కొండ సైదులు మరియు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

3 hrs ago
user_Nagesh Kothapalli
Nagesh Kothapalli
Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
3 hrs ago
3931042f-ad7f-4aae-bab7-646693871650

నకిరేకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఈరోజు పరామర్శించారు. ​సిపిఎం నాయకుడి కుటుంబానికి పరామర్శ: ​నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీకి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు కనుకుంట్ల శంకర్ రెడ్డి సతీమణి కనుకుంట్ల సుశీల గారు ఇటీవలే అనారోగ్యం

c80b26b3-e8a4-4482-a3e4-c84805a9f804

కారణంగా కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న చిరుమర్తి లింగయ్య గారు నేడు వారి నివాసానికి చేరుకుని, సుశీల గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శంకర్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ​తుంగతుర్తిలో నివాళులు: అనంతరం కేతపల్లి మండలం

475be150-f603-4bd1-ae79-a6b78ed633b8

తుంగతుర్తి గ్రామానికి చెందిన కొండ బజారు గారు అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహాన్ని చిరుమర్తి లింగయ్య సందర్శించారు. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన, ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ పరామర్శ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

6a63a5f9-58bf-4f85-91c6-b841d2100c70

కొప్పుల ప్రదీప్ రెడ్డి, నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, తుంగతుర్తి సర్పంచ్, మాజీ సర్పంచ్ అలుగువెల్లి సంజీవరెడ్డి, నాయకులు కొండ సైదులు మరియు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు ​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: ​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. ​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. ​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. ​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ​పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు
​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం!
​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు:
​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు.
​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు.
​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది"
​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.
​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
​పాల్గొన్న నాయకులు:
ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు. ర్యాలీలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వార్డు మెంబర్ గాడిపెల్లి రాజబాబు, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు.
ర్యాలీలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వార్డు మెంబర్ గాడిపెల్లి రాజబాబు, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by నీరటి మహేందర్
    1
    Post by నీరటి మహేందర్
    user_నీరటి మహేందర్
    నీరటి మహేందర్
    మద్దూర్, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • డీలిమిటేషన్ సెగ.. అగ్గిరాజేసిన సీఎం స్టాలిన్! బిల్లు ప్రతులను తగలబెట్టి నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేడు పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు స్టాలిన్ స్వయంగా ఆ బిల్లు ప్రతులను తగలబెట్టారు.
    1
    డీలిమిటేషన్ సెగ.. అగ్గిరాజేసిన సీఎం స్టాలిన్! బిల్లు ప్రతులను తగలబెట్టి నిరసన.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేడు పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు  స్టాలిన్ స్వయంగా ఆ బిల్లు ప్రతులను తగలబెట్టారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • Post by JADI RAJU
    1
    Post by JADI RAJU
    user_JADI RAJU
    JADI RAJU
    Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    3
    విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి
నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    21 hrs ago
  • Papa Mujhe Bhi Bachao 😢 | Helmet Sirf Aapke Liye? | Hyderabad Traffic Police Awareness Program #HyderabadTrafficPolice #RoadSafety #ArriveAlive #DefensiveDriving #HelmetSafety #SaveLives #TrafficAwareness #HyderabadNews #SchoolAwareness #SafetyFirst #RoadAccident #PoliceAwareness #TelanganaPolice #ViralNews #EmotionalStory #BreakingNews #IndiaNews #HelmetAwareness #SafeDriving #PublicAwareness
    1
    Papa Mujhe Bhi Bachao 😢 | Helmet Sirf Aapke Liye? | Hyderabad Traffic Police Awareness Program
#HyderabadTrafficPolice #RoadSafety #ArriveAlive #DefensiveDriving #HelmetSafety #SaveLives #TrafficAwareness #HyderabadNews #SchoolAwareness #SafetyFirst #RoadAccident #PoliceAwareness #TelanganaPolice #ViralNews #EmotionalStory #BreakingNews #IndiaNews #HelmetAwareness #SafeDriving #PublicAwareness
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లామహాదేవపురం మండలం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు త్రివేణి విశ్రాంతి భవనంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మౌలిక వసతుల విస్తరణపై చర్చించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లామహాదేవపురం మండలం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు త్రివేణి విశ్రాంతి భవనంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మౌలిక వసతుల విస్తరణపై చర్చించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.