ఖైదీల కుటుంబాలకు ‘స్పృహ’తో సామాజిక భరోసా. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె. హరిబాబు శ్రీకాకుళం, ఏప్రిల్ 20: నేర బాధితులు, జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడమే 'నల్సా స్పృహ-2025' పథకం ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక న్యాయ సేవా సదన్‌లో ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. సమాజంలో అపవాదు ఎదుర్కొంటున్న ప్రభావిత వర్గాలకు ఈ పథకం ద్వారా బహుముఖ మద్దతు లభిస్తుందని వివరించారు. ఖైదీల కుటుంబాల్లోని పిల్లల విద్య, కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి దెబ్బతినకుండా ప్యానల్ న్యాయవాదులు, వాలంటీర్లు వారధిలా పనిచేయాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సంక్షేమ పథకాల్లోని లోపాలను గుర్తించి, బాధితులకు అవసరమైన మానసిక, చట్టపరమైన సహాయం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.
ఖైదీల కుటుంబాలకు ‘స్పృహ’తో సామాజిక భరోసా. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె. హరిబాబు శ్రీకాకుళం, ఏప్రిల్ 20: నేర బాధితులు, జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడమే 'నల్సా స్పృహ-2025' పథకం ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక న్యాయ సేవా సదన్‌లో ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ..
సమాజంలో అపవాదు ఎదుర్కొంటున్న ప్రభావిత వర్గాలకు ఈ పథకం ద్వారా బహుముఖ మద్దతు లభిస్తుందని వివరించారు. ఖైదీల కుటుంబాల్లోని పిల్లల విద్య, కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి దెబ్బతినకుండా ప్యానల్ న్యాయవాదులు, వాలంటీర్లు వారధిలా పనిచేయాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సంక్షేమ పథకాల్లోని లోపాలను గుర్తించి, బాధితులకు అవసరమైన మానసిక, చట్టపరమైన సహాయం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో సోమవారం నాడు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో భాగంగా దేవాలయ అర్చక స్వామి విధాతశ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వారి శ్రీ చందనం అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు చందన సమర్పించి అక్షయ తృతీయ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు భాగ్యశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.4
- మెలియాపుట్టి మండలంలోని గంగరాజుపురం గ్రామంలో ఆదివారం మండల టిడిపి అధ్యక్షుడు నంబాల వెంకటరావు నూతన బోరు ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గత కొన్ని దినాలు నుంచి గ్రామంలో నీటి గురించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు గ్రామస్తులు వినతి అందజేశారు. ఎమ్మెల్యే ఎండిఓ కు వెంటనే బోరు ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య తీర్చాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ దినము బోరు తవ్వకాలు ఏర్పాటు చేశారు. దీనితో గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది.1
- Post by Rai Narendra1
- Post by Shyam1
- రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు1
- manasuloni mata1
- పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని, మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.1
- Post by కొప్పుల విజయ బాబు10