Shuru
Apke Nagar Ki App…
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : హైదరాబాద్, శురూ న్యూస్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
P Jithender, Sr Reportar
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : హైదరాబాద్, శురూ న్యూస్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- ప్రజల నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో నర్సంపేట ప్రజా జనం వరంగల్ జిల్లా ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1
- నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.1
- పార్టీతో పనిలేదు ప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంత ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం పార్టీతో పనిలేదుప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంతఇల్లు... అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ఇది కేవలం పథకం కాదు - గౌరవంతో జీవించే హక్కు... నిరుపేదలకు భరోసా ఇందిరమ్మ ఇల్లు... కప్పు లేని గుడిసెలకు ఆశ్రయమిచ్చి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం నింపే ఇందిరమ్మ ఇల్లు...!! ఆత్మగౌరవ ప్రతీక కేవలం ఇటుకల నిర్మాణం కాదు, నిరుపేద కుటుంబానికి దక్కిన ఆత్మగౌరవప్రతిక ఇందిరమ్మ ఇల్లు..!! ఎన్నో ఏళ్ల కలల సహకారం ఇందిరమ్మ ఇల్లు.. సొంతింటి కల సహకారమై ప్రతి పేదల ముఖంలో చిరునవ్వులు పూయించే సువర్ణ అవకాశం ప్రజా ప్రభుత్వం చేస్తుంది..!! ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..!! జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోని అమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..* *మీ.. సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు1