బాలాపూర్ మహా గణనాథుడిని దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలంగాణ సమాజం, రైతన్నలు సుభిక్షంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని బొజ్జ గణపయ్యను స్పీకర్ గడ్డం ప్రసాద్, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్న లక్ష్మారెడ్డి వేడుకున్నారు.బాలాపూర్ మహా గణనాథుడిని స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ, పేదలకు అందాలని స్పీకర్ ప్రసాద్, లక్ష్మారెడ్డిలు ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా పడి అన్నదాతలు, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని రైతుబిడ్డగా కిచ్చెన్నగారు వినాయకుడిని కోరుకున్నారు.అంతకు ముందు జిల్లెలగూడ, మీర్ పేట, ప్రశాంతిహిల్స్, అల్మాస్ గూడ డివిజన్లల్లో వినాయక మండపాలను దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
బాలాపూర్ మహా గణనాథుడిని దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలంగాణ సమాజం, రైతన్నలు సుభిక్షంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని బొజ్జ గణపయ్యను స్పీకర్ గడ్డం ప్రసాద్, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్న
లక్ష్మారెడ్డి వేడుకున్నారు.బాలాపూర్ మహా గణనాథుడిని స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ, పేదలకు అందాలని స్పీకర్ ప్రసాద్, లక్ష్మారెడ్డిలు ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా పడి అన్నదాతలు,
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని రైతుబిడ్డగా కిచ్చెన్నగారు వినాయకుడిని కోరుకున్నారు.అంతకు ముందు జిల్లెలగూడ, మీర్ పేట, ప్రశాంతిహిల్స్, అల్మాస్ గూడ డివిజన్లల్లో వినాయక మండపాలను దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
- నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రతి ఇంట్లో 'ఆశీర్వాద దీపం' వెలిగిద్దాం! దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ప్రతి ఇంట్లో ఆశీర్వాద దీపం వెలిగిద్దాం కార్యక్రమం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి తెలిపారు.25 ఏళ్లుగా దేశమే శ్వాసగా జీవిస్తూ, ప్రజాసేవకే అంకితమై.. కోట్లాది మంది పేదల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్మదినం సందర్భంగావితాల్లో మార్పు తీసుకొచ్చి, వికసిత భారత్ దిశగా దేశాన్ని నడిపిస్తున్ నరేంద్రుడికి ఆశీస్సులు, మద్దతు తెలియజేద్దామని విజ్ఞప్తి చేశారు మీ బొమ్మదేవర రత్నకుమారి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి,1
- మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి పల్నాడు జిల్లా మాచవరం లో దారుణం మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి కాన్పు కోసం మాచవరం ఆసుపత్రికి వచ్చిన పిన్నెల్లికి చెందిన కొమ్ము మహిమ అనే బాలింత అందుబాటులో లేకుండా పోయిన వైద్య సిబ్బంది వైద్య సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో బాలింతకి కాన్పు చేసిన ఆసుపత్రి ఆయా వైద్యం వికటించి అక్కడిక్కడే పుట్టిన మగ శిశువు మృతి తల్లికి అస్వస్థత శిశువు మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రుల బంధువులు ఆయా ద్వారా కాన్పు చేపించడంతోనే పరిస్థితి విషమించి మగ శిశువు మృతి చెందిదని తల్లిదండ్రులు ఆరోపణ విధుల్లో ఉండాల్సిన స్టాఫ్ నర్సులు లేకపోవడం పై బంధువులు తీవ్ర ఆగ్రహం శిశువు మృతి చెందటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు2
- మచిలీపట్నం మంగినపూడిలో ఘనంగా సాగర తీర విజయ గణపతి ఉత్సవాలు మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నిర్వహిస్తున్న సాగర తీర విజయ గణపతి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించి స్వామివారిని ఆవాహన చేసుకున్నారు. గణపతి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మంగినపూడి సముద్ర తీరంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన విజయ గణపతి ఉత్సవాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. బీచ్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, ప్రసాదాల పంపిణీ, పారిశుధ్యం, భక్తుల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయ గణపతిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- దేవదేవునికి సతీసమేతంగా 15 సార్లు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం పొందటం నువ్వు చేసుకున్న పుణ్యం🙏🙏అలాంటి నీకు ప్రాణమిచ్చే సైనికులుగా మమ్మల్ని పుట్టించిన ఆ శ్రీవారికి ఏమి చేయగలం,ఇవ్వగలం,భక్తితో సాష్టాంగ ప్రణామం చేయటం తప్ప🙏🙏....1
- *డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పశ్చిమ టీడీపీ శ్రేణులకు వెలిగొండ – శ్రీశైలం పర్యటన* *ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో 10 బస్సుల్లో 450 మంది నాయకులు, కార్యకర్తల సందర్శన* ప్రకాశం, రాయలసీమలను కొనసీమగా మార్చగల నాయకుడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అపరభగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక ప్రోత్సాహకంగా వెలిగొండ ప్రాజెక్టు, శ్రీశైలం దేవస్థానం పర్యటనను ఏర్పాటు చేశారు. ఆదివారం శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి 10 బస్సులను ప్రారంభించారు. ఈ పర్యటనలో సుమారు 450 మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన కార్యకర్తలు ప్రధాన టన్నెల్ ప్రాంతం, నీటి ప్రవాహ మార్గాలు, ఫీడర్ కాలువలు, 40 కిలోమీటర్ల ప్రధాన కాలువ వ్యవస్థతో పాటు ప్రాజెక్టు నిర్మాణ విశేషాలను పరిశీలించారు. కరువు ప్రాంతాలకు జీవనాడిగా మారిన ఈ ప్రాజెక్టు ద్వారా చేరుతున్న నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ....* కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు అత్యంత బాధ్యతతో నిర్వహించారని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా 7వ స్థానంలో నిలవడం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతగా ఈ పర్యటన ఏర్పాటు చేశామని, అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదని, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకొచ్చే మహత్తర ప్రాజెక్టులేనని పేర్కొన్నారు. అందుకే అమరావతి కాకుండా వెలిగొండ ప్రాజెక్టును సందర్శనకు ఎంపిక చేశామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు అనేది కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కాదని, అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 1996లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ, చివరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ప్రజలకు అంకితం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. లక్షలాది మంది ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. "వెలిగొండ అనేది ఒక సాధారణ ప్రాజెక్టు కాదు. ఇది మూడు దశాబ్దాల కల, వేలాది కుటుంబాల ఆశల ప్రతిరూపం. ఈ ప్రాజెక్టు వెనుక స్థానిక ప్రజల త్యాగం, ఇంజనీర్ల అంకితభావం, ప్రభుత్వ నిబద్ధత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉన్నాయి. అందుకే ప్రతి తెలుగు వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాజెక్టును సందర్శించాలి" అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంలో చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కారణంగానే ఆయనకు “ఆంధ్రప్రదేశ్ వాటర్ మ్యాన్”, “అపర భగీరథుడు” అనే గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీర్లు, స్థానిక ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు మాట్లాడుతూ, వెలిగొండ వంటి మహత్తర ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దృక్పథం ఎంత విస్తృతమైనదో అర్థమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే ప్రాజెక్టుల వెనుక ఉన్న కృషి, సంకల్పాన్ని తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ పర్యటన తమలో మరింత ఉత్తేజాన్ని నింపిందని, పార్టీ బలోపేతం కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలిపారు.1
- లోకేష్ పర్యటన నీ విజయవంతం చేయాలి.. పెడన ఎమ్మెల్యే కాగిత పెడన నియోజకవర్గంలో ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్న కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల TDP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.1
- పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు. గుళ్ళపల్లి గ్రామంలో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ద్వితీయ సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రధాన ఆకర్షణగా 21 కేజీల మహా లడ్డూ వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు.లడ్డూ వేలం పాట పూర్తయిన తర్వాత స్వామివారి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ భక్తిశ్రద్ధల కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.1
- కోదాడలోని సెయింట్ జోసెఫ్ సి.సి. రెడ్డి కాన్వెంట్ స్కూల్‌లో మెగా జాబ్ మేళా కోదాడలోని సెయింట్ జోసెఫ్ సి.సి. రెడ్డి కాన్వెంట్ స్కూల్‌లో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 300కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని, వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు, ఉద్యోగార్థులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.1