కల్తీ ఫుడ్ పై కంట్రోల్ ఏది ? • ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నాణ్యతలేని ఆహార పదార్థాలు • ప్రజల ఆరోగ్యాలతో చలగాటం • నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు • బోనకల్ మండల కేంద్రంలో ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు • అంతా కెమికల్ తోనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వ్యాపారం • ఇకనైనా ఫుడ్ సేఫ్ అధికారులు స్పందిస్తారా లేదా చూడాలి మండల కేంద్రంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై అధికారుల పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. కల్తీ ఫుడ్ పై కంట్రోల్ ఏది.? అని అంటున్నారు మండల ప్రజలు. పలురకాల మాంసాహార ఐటమ్స్ తో ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఇష్టానుసారంగా నాణ్యత లేని ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని నిల్వ ఉంచి విక్రయిస్తుంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పలువురు మండిపడుతున్నారు. ఆహార విక్రయాలకు అనుమతి లేవి ? ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాల బిజినెస్ ఊపందుకుంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనె, కల్తీ ఆహారాన్ని విక్రయస్తూ ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆహార పదార్థాలు విక్రయించే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రత అధికారుల నుంచి పలు అనుమతులు పొందాలి. అయితే ఈ అనుమతులకు విరుద్ధంగా కొందరు ఇష్టారాజ్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని సంపాదనే ధ్యేయంగా నాణ్యత లేని పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఈ ఫాస్ట్ ఫడ్ సెంటర్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వెలువెత్తుతున్నాయి. ఆహార విక్రయ కేంద్రాలకు నిబంధనలు ఇవే... ఆహార పదార్థాలు విక్రయించే రెస్టారెంట్ లకు, భోజన హోటళ్ లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లకు, దాబాలకు, కర్రీ పాయింట్ లకు రిజిస్ట్రేషన్ తో పాటు, ఆహార భద్రత అధికారి నుంచి లైసెన్స్ పొందాలి. అధికారులు దాడుల్లో ఆహార విక్రయ కేంద్రాల్లో అనుమతులు లేకపోతే ముందుగా నోటీసులను జారీ చేయాలి. ఆ తర్వాత కూడా అదే తీరు కొనసాగితే ఆ కేంద్రాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించాలి. అంతే కాకుండా ఏడాదికొకసారి నిర్ణీత సంఖ్యలో నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించాలి. కానీ బోనకల్ మండల కేంద్రంలో ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలలో దీనికి భిన్నంగా కొనసాగుతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ కరువు.. మండల కేంద్రంలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నిల్వ ఉంచిన ఆహారాలను విక్రయిస్తూ ప్రజారోగ్యంపై దెబ్బతీస్తున్న విక్రయదారులపై అధికారులు చర్యలు శూన్యం అనిపిస్తుంది. కల్తీ ఆహారాలు విక్రయం జరగకుండా తీసుకోవాల్సిన అధికారులే ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే యజమానులు మరింత రెచ్చిపోతున్నారు. ఆహార భద్రత అధికారులు వారి పరిధిలో నిర్ణీత సంఖ్యలో ప్రజలు ఉపయోగించే నిత్యవసరాల్లో వాటి నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు నమూనాలను సేకరించాలి. సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపించి వచ్చిన ఫలితాలు ఆధారంగా విక్రయదారులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అసలు బోనకల్ మండలం పై ఫుడ్ సేఫ్టీ అధికారులు రావటమే మరిచారు. ఇదే అదునుగా తీసుకున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు వారి ఇష్ట రాజ్యంగా కల్తీ నూనెలో వాడుతూ, అంతా కెమికల్ తోనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనితో ప్రజల ఆరోగ్యానికి హానికరిగే పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి. ఇకనైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి బోనకల్ మండల కేంద్రంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లపై చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.?
కల్తీ ఫుడ్ పై కంట్రోల్ ఏది ? • ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నాణ్యతలేని ఆహార పదార్థాలు • ప్రజల ఆరోగ్యాలతో చలగాటం • నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు • బోనకల్ మండల కేంద్రంలో ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు • అంతా కెమికల్ తోనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వ్యాపారం • ఇకనైనా ఫుడ్ సేఫ్ అధికారులు స్పందిస్తారా లేదా చూడాలి మండల కేంద్రంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై అధికారుల పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. కల్తీ ఫుడ్ పై కంట్రోల్ ఏది.? అని అంటున్నారు మండల ప్రజలు. పలురకాల మాంసాహార ఐటమ్స్ తో ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఇష్టానుసారంగా నాణ్యత లేని ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని నిల్వ ఉంచి విక్రయిస్తుంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పలువురు మండిపడుతున్నారు. ఆహార విక్రయాలకు అనుమతి లేవి ? ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాల బిజినెస్ ఊపందుకుంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనె, కల్తీ ఆహారాన్ని విక్రయస్తూ ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆహార పదార్థాలు విక్రయించే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రత అధికారుల నుంచి పలు అనుమతులు పొందాలి. అయితే ఈ అనుమతులకు విరుద్ధంగా కొందరు ఇష్టారాజ్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని సంపాదనే ధ్యేయంగా నాణ్యత లేని పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఈ ఫాస్ట్ ఫడ్ సెంటర్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వెలువెత్తుతున్నాయి. ఆహార విక్రయ కేంద్రాలకు నిబంధనలు ఇవే... ఆహార పదార్థాలు విక్రయించే రెస్టారెంట్ లకు, భోజన హోటళ్ లకు, ఫాస్ట్ ఫుడ్
సెంటర్ లకు, దాబాలకు, కర్రీ పాయింట్ లకు రిజిస్ట్రేషన్ తో పాటు, ఆహార భద్రత అధికారి నుంచి లైసెన్స్ పొందాలి. అధికారులు దాడుల్లో ఆహార విక్రయ కేంద్రాల్లో అనుమతులు లేకపోతే ముందుగా నోటీసులను జారీ చేయాలి. ఆ తర్వాత కూడా అదే తీరు కొనసాగితే ఆ కేంద్రాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించాలి. అంతే కాకుండా ఏడాదికొకసారి నిర్ణీత సంఖ్యలో నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించాలి. కానీ బోనకల్ మండల కేంద్రంలో ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలలో దీనికి భిన్నంగా కొనసాగుతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ కరువు.. మండల కేంద్రంలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నిల్వ ఉంచిన ఆహారాలను విక్రయిస్తూ ప్రజారోగ్యంపై దెబ్బతీస్తున్న విక్రయదారులపై అధికారులు చర్యలు శూన్యం అనిపిస్తుంది. కల్తీ ఆహారాలు విక్రయం జరగకుండా తీసుకోవాల్సిన అధికారులే ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే యజమానులు మరింత రెచ్చిపోతున్నారు. ఆహార భద్రత అధికారులు వారి పరిధిలో నిర్ణీత సంఖ్యలో ప్రజలు ఉపయోగించే నిత్యవసరాల్లో వాటి నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు నమూనాలను సేకరించాలి. సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపించి వచ్చిన ఫలితాలు ఆధారంగా విక్రయదారులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అసలు బోనకల్ మండలం పై ఫుడ్ సేఫ్టీ అధికారులు రావటమే మరిచారు. ఇదే అదునుగా తీసుకున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు వారి ఇష్ట రాజ్యంగా కల్తీ నూనెలో వాడుతూ, అంతా కెమికల్ తోనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనితో ప్రజల ఆరోగ్యానికి హానికరిగే పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి. ఇకనైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి బోనకల్ మండల కేంద్రంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లపై చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.?
- హన్మకొండ జిల్లాలో టీజీ ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. గురువారం హన్మకొండ–హైదరాబాద్ రూట్‌లో నడుస్తున్న బస్సు సాంకేతిక లోపాలతో రోడ్లపై ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని నిట్ సమీపంలో ఓ ఈవీ బస్సు మొరాయించడంతో ప్రయాణికులు మధ్యలోనే దిగిపోయి ప్రత్యామ్నాయ వాహనాలు ఆశ్రయించారు.1
- Post by దాసరి ప్రేమ్1
- Post by Syyed taher1
- పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ పోకూడదు: కాంగ్రెస్ నాయకులు, నరసాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె.బి.ఆర్ నాయుడు1
- Post by SS NEWS1
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- వరంగల్:తెలంగాణలో పలు వైద్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి ఆరోపించారు. ఈ అక్రమ వసూళ్ల వల్ల తల్లిదండ్రులపై సుమారు రూ.209 కోట్ల భారం పడిందని తెలిపారు. దీనిపై ఈనెల 17న ఉదయం 10 గంటలకు వరంగల్‌లోని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.1
- Post by నీరటి మహేందర్1
- దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ నారీ శక్తివందన్ అధినియం ద్వారా ఆడబిడ్డలకు మోదీ అపురూప కానుక అందించి మోదీ ప్రభుత్వం నవ భారతాన్ని నిర్మిస్తుందని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. ఏప్రిల్ 16 న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బిజెపి మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుండి నగరంలోని పలు ప్రాంతాల మీదుగా మార్క్ ఫెడ్ వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చొప్పరి జయశ్రీ మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల నెరవేరే సమయం వచ్చిందన్నారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన ఏ పార్టీ కూడా మహిళల సంక్షేమం , అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అలాగే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి, 33 శాతం రిజర్వేషన్లు అందించే చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. చారిత్రాక నారి శక్తి వందన్ అధినియం బిల్లుతో మహిళలకు దేశ ప్రధాని పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దేశ శిల్ప, నిర్మల రెడ్డి, కోలగని స్వర్ణ, వరాల జ్యోతి, సాధవేని లావణ్య, కర్రె పద్మ, శ్వేత , ప్రభావతి, గాజిరమ, పొన్నం లక్ష్మి, నాంపల్లి రేణుక, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి, సరస్వతి, సుమ రమణారెడ్డి,సాయిని మల్లేశం, గుజ్జ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.4