logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ ఎస్సై యనమల రవిచంద్ర రెడ్డి విధి నిర్వహణలో భాగంగా శ్రీనగర్ సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా రెండు రోజుల క్రితం మృతి చెందారు. సుమారు 36 ఏళ్ల క్రితం సీఆర్పీఎఫ్‌లో చేరిన రవిచంద్ర రెడ్డి, యనమల నంజిరెడ్డి మరియు లక్ష్మీదేవమ్మ దంపతులకు నాలుగో సంతానం. గురువారం రాత్రి ఆయన భౌతికకాయాన్ని పుట్టపర్తికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం స్వగ్రామమైన దిగువ గంగంపల్లికి తరలించి, అక్కడ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. దేశ సేవలో విశేషంగా పనిచేసిన రవిచంద్ర రెడ్డి మృతి పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

1 day ago
user_Sadda venkatasiva
Sadda venkatasiva
Handloom Weaver గొరంట్ల, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
1 day ago
10ec701b-7205-4473-aa34-be013f536f62
c307d5c1-18f9-49cf-8c83-42dcc0d6b4c8

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ ఎస్సై యనమల రవిచంద్ర రెడ్డి విధి నిర్వహణలో భాగంగా శ్రీనగర్ సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా రెండు రోజుల క్రితం మృతి చెందారు. సుమారు 36 ఏళ్ల క్రితం సీఆర్పీఎఫ్‌లో చేరిన రవిచంద్ర రెడ్డి, యనమల నంజిరెడ్డి మరియు లక్ష్మీదేవమ్మ దంపతులకు నాలుగో సంతానం. గురువారం రాత్రి ఆయన భౌతికకాయాన్ని పుట్టపర్తికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం స్వగ్రామమైన దిగువ గంగంపల్లికి తరలించి, అక్కడ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. దేశ సేవలో విశేషంగా పనిచేసిన రవిచంద్ర రెడ్డి మృతి పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ఈ భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం మరియు సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈ ఏడాది నిర్దేశించిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం", "పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జననాల మధ్య సరైన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం మరియు లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డిపిహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్, అలాగే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ఈ భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం మరియు సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈ ఏడాది నిర్దేశించిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం", "పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జననాల మధ్య సరైన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం మరియు లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డిపిహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్, అలాగే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ నూతన టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా డీసీసీబీ ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డికి సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన వర్గీయులు, అనుచరులు బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో బాణాసంచా పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా రితేశ్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు మంచూరి సూర్యనారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ఆయన అనుచరులు బద్వేలులో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
    1
    వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ నూతన టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా డీసీసీబీ ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డికి సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన వర్గీయులు, అనుచరులు బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో బాణాసంచా పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

గతంలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా రితేశ్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు మంచూరి సూర్యనారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ఆయన అనుచరులు బద్వేలులో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • చిత్తూరు జిల్లా సోమల పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ ప్రదీప్ మరియు డాక్టర్ రాజ్ కుమార్ ల ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యాధికారులు మాట్లాడుతూ, పిల్లల మధ్య ఎడమ పాటిద్దాం-ఆరోగ్యంగా ఉందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన అంతరం మరియు సమయం పాటించాలని వైద్యాధికారులు సూచించారు. ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ వైద్యులు గ్రామంలో ఒక ర్యాలీని కూడా నిర్వహించారు.
    1
    చిత్తూరు జిల్లా సోమల పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ ప్రదీప్ మరియు డాక్టర్ రాజ్ కుమార్ ల ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యాధికారులు మాట్లాడుతూ, పిల్లల మధ్య ఎడమ పాటిద్దాం-ఆరోగ్యంగా ఉందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన అంతరం మరియు సమయం పాటించాలని వైద్యాధికారులు సూచించారు. ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ వైద్యులు గ్రామంలో ఒక ర్యాలీని కూడా నిర్వహించారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసులు అసాంఘిక శక్తులపై ముమ్మర దాడులు నిర్వహించారు. మదనపల్లెలోని ఒకటవ టౌన్ పరిధిలోని ఒక గోడౌన్‌పై నాలుగు ప్రత్యేక బృందాలు మెరుపుదాడి చేశాయి. ఈ దాడిలో యువతను నిర్వీర్యం చేస్తున్న కూల్ లిప్ సహా భారీగా నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంబేపల్లి పరిధిలో రెండు చోట్ల, పీలేరు పరిధిలో రెండు చోట్ల పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిపారు. మొత్తం నాలుగు పేకాట శిబిరాల నుంచి 28 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.80,690 నగదును స్వాధీనం చేసుకున్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతూ మత్తు పదార్థాలు విక్రయించినా, పేకాట తదితర జూదాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు.
    1
    అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసులు అసాంఘిక శక్తులపై ముమ్మర దాడులు నిర్వహించారు. మదనపల్లెలోని ఒకటవ టౌన్ పరిధిలోని ఒక గోడౌన్‌పై నాలుగు ప్రత్యేక బృందాలు మెరుపుదాడి చేశాయి. ఈ దాడిలో యువతను నిర్వీర్యం చేస్తున్న కూల్ లిప్ సహా భారీగా నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే సంబేపల్లి పరిధిలో రెండు చోట్ల, పీలేరు పరిధిలో రెండు చోట్ల పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిపారు. మొత్తం నాలుగు పేకాట శిబిరాల నుంచి 28 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.80,690 నగదును స్వాధీనం చేసుకున్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతూ మత్తు పదార్థాలు విక్రయించినా, పేకాట తదితర జూదాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    48 min ago
  • వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం గ్రామంలోని పురాతన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆలయానికి చెందిన విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆలయంలో ఒకపక్క అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, దేవాదాయ (ఎండోమెంట్) శాఖ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కారణంగా స్వామివారి మాన్యాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే నంబర్ల పరిధిలో ఎకరాల కొద్దీ భూమి కబ్జాకు గురైనట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి. కబ్జాకు గురైన భూముల వివరాల ప్రకారం, శాఖరాజుపల్లిలోని సర్వే నంబర్ 261లో 2 ఎకరాలకు పైగా, నేకనాపురం పరిధిలోని సర్వే నంబర్ 177లో 1 ఎకరా 16 సెంట్లు, సర్వే నంబర్ 36లో 23 సెంట్లు భూమి ఆక్రమణకు గురయ్యాయి. అలాగే వంతాటిపల్లె పరిధిలో సర్వే నంబర్ 157లో 58 సెంట్లు, సర్వే నంబర్ 164లో 38 సెంట్లు, సర్వే నంబర్ 185లో 1 ఎకరా 80 సెంట్లు భూమి అన్యాక్రాంతమైంది. పేర్కొన్న వివరాలే కాకుండా, రంగనాథ స్వామి ఆలయానికి చెందిన మరికొన్ని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నట్లు సమాచారం.
    1
    వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం గ్రామంలోని పురాతన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆలయానికి చెందిన విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆలయంలో ఒకపక్క అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, దేవాదాయ (ఎండోమెంట్) శాఖ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కారణంగా స్వామివారి మాన్యాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే నంబర్ల పరిధిలో ఎకరాల కొద్దీ భూమి కబ్జాకు గురైనట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి.

కబ్జాకు గురైన భూముల వివరాల ప్రకారం, శాఖరాజుపల్లిలోని సర్వే నంబర్ 261లో 2 ఎకరాలకు పైగా, నేకనాపురం పరిధిలోని సర్వే నంబర్ 177లో 1 ఎకరా 16 సెంట్లు, సర్వే నంబర్ 36లో 23 సెంట్లు భూమి ఆక్రమణకు గురయ్యాయి. అలాగే వంతాటిపల్లె పరిధిలో సర్వే నంబర్ 157లో 58 సెంట్లు, సర్వే నంబర్ 164లో 38 సెంట్లు, సర్వే నంబర్ 185లో 1 ఎకరా 80 సెంట్లు భూమి అన్యాక్రాంతమైంది. పేర్కొన్న వివరాలే కాకుండా, రంగనాథ స్వామి ఆలయానికి చెందిన మరికొన్ని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నట్లు సమాచారం.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    6 hrs ago
  • ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) 75వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
    1
    ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) 75వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
    user_G VENKATESH YADAV
    G VENKATESH YADAV
    Ambulance service ఎస్.మైదుకూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బొచ్చుపల్లి గ్రామంలో మొహరం వేడుకలు నిర్వహించలేదనే మనస్తాపంతో వన్నూరు స్వామి అనే వ్యక్తి గురువారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మరియు గ్రామ పెద్దలు హుటాహుటిన సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. టవర్ పై ఉన్న వన్నూరు స్వామిని కిందకు దిగి రావాలని వారు పదేపదే విన్నవించినా, అతను వినిపించుకోకుండా మొండిగా అక్కడే ఉండిపోయాడు. దీనివల్ల అక్కడ ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది.
    1
    అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బొచ్చుపల్లి గ్రామంలో మొహరం వేడుకలు నిర్వహించలేదనే మనస్తాపంతో వన్నూరు స్వామి అనే వ్యక్తి గురువారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మరియు గ్రామ పెద్దలు హుటాహుటిన సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. టవర్ పై ఉన్న వన్నూరు స్వామిని కిందకు దిగి రావాలని వారు పదేపదే విన్నవించినా, అతను వినిపించుకోకుండా మొండిగా అక్కడే ఉండిపోయాడు. దీనివల్ల అక్కడ ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.