పురుగుల అన్నం పెడుతున్నారని రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు అచ్చంపేట , ఫిబ్రవరి 18(షురూ ఆప్ న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగులున్న అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు బుధ వారం ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం భోజనం అందించకుండా నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన సందర్భంగా నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పురుగుల అన్నం పెడుతున్నారని రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు అచ్చంపేట , ఫిబ్రవరి 18(షురూ ఆప్ న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగులున్న అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు బుధ వారం ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం భోజనం అందించకుండా నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన సందర్భంగా నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థిను లు ఆందోళన చేస్తుండగా నలుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుపాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ విద్యార్థినులతో చర్చలు జరిపిన ఎమ్మార్వో, పోలీసులు1
- కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన స్వామి అమ్మవారి రథోత్సవం గ్రామ పురవీధుల్లో శోభాయమానంగా సాగి భక్తులను ఆకట్టుకుంది. రథంపై ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు హాజరై శివనామ స్మరణతో ప్రాంతాన్ని మారుమోగించారు.1
- *నకిరేకల్ నియోజకవర్గం* *రామన్నపేట మండలం* ఈరోజు రామన్నపేట మండలం *తుర్కపల్లి* గ్రామానికి చెందిన *సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త* *దొడ్డి మారయ్య* గారు అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళులర్పించి దహన సంస్కారాలకు *ఐదువేల* *రూపాయలు* *(5000/_)* ఆర్థిక సాయం అందజేసిన దైద రవీందర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసర జానారెడ్డి తుర్కపల్లి సర్పంచ్ పిచ్చిరెడ్డి ఉప సర్పంచ్ మల్లయ్య జే వెంకన్న ప్రశాంత్ జానయ్య సూరయ్య యాదగిరి శంకర్ వెంకట చారి సాలయ్య నర్సింహ కృష్ణయ్య కుమార్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు1
- *బడంగ్ పేట్ సర్కిల్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు* *బడంగ్ పేట్ సర్కిల్* తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బడంగ్ పేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామీడి రామిరెడ్డి ఆధ్వర్యం లో మేగా రక్తదాన శిఖరాన్ని నిర్వహించి అంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలసి కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ....... తెలంగాణ లో మళ్ళీ కెసిఆర్ పాలన కావాలి అని ప్రజలు కోరుకుంటారు అని రామిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలన పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడ లో పూర్తిగా విఫలమైందని తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని,సంక్షేమ పథకాల తో ప్రజలు సుఖసంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతి గ్రామం లో కేసీఆర్ చేసిన అభివృద్ధి,సంక్షేమం ఇప్పటికే కనపడుతుందని అన్నారు. రానున్నది బీఆర్ఎస్ పాలనైనని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.1
- నస్కల్ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా... """"""""""""""""""""''''""""""""""""""""""""" పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ""'''''''''''""""""""""""""""'''''''""""""""""" కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా కట్టుబడి ఉంటాం అని తెలిపిన 1వ వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు కుర్వ బాల్ రాజ్. పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమయానికి చేరుకోలేకపోయామని,అందువల్లే ప్రమాణ స్వీకారం మిస్ అయ్యిందని ఒకటో వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు తెలిపారు.ఈ విషయాన్ని ఎమ్మెల్యే సమక్షంలో వెల్లడించారు.అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, దీనిపై అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు.చిన్న తప్పిదం వల్లే ఈ గొడవ చోటుచేసుకుందని అక్కమ్మ కుమారుడు తెలిపారు.తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే కి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తామని, ఎలాంటి అపోహలు అవసరం లేదని పేర్కొన్నారు.నస్కల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.1
- Mattress Manufacturers Company in Hyderabad Call Now: 81066600221
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి.కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు 13 వార్డులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించగా, 5 భారతీయ జనతా పార్టీ,మూడు బి ఆర్ ఎస్,ఒకరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కోడెల లలిత గణేష్ యాదవ్ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 14 కు చేరుకుంది. కల్వకుర్తి మున్సిపాలిటీ రిజర్వ్ జనరల్ మహిళ రావడంతో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ సతీమణి రత్నమాల చైర్ పర్సన్ గా,వైస్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ షానవాజ్ ఖాన్ ఎన్నికయ్యారు.1