logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 1వ డివిజన్ హనుమాన్ నగర్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద రూ.12.80 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేశారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మేయర్ పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సదుపాయాలు తదితర అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని మేయర్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన రహదారులు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ప్రజల సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనులపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నగర మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి భారీ అపర్ణ జితేందర్, 26 వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, ముదిరాజ్ సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

2 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
2 hrs ago
6d185138-ce55-4a2c-871e-dcd4b4a65b79

కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 1వ డివిజన్ హనుమాన్ నగర్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద రూ.12.80 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేశారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే

2ec38376-c6bb-44d7-881d-5f3e0cb9af86

నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మేయర్ పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సదుపాయాలు తదితర అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని మేయర్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన రహదారులు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, నిర్మాణ పనులు

79a80c8c-2f80-405c-988c-415440f52634

నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ప్రజల సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనులపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నగర మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ

cd006c14-f494-40f5-896b-14a020c9ce21

కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి భారీ అపర్ణ జితేందర్, 26 వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, ముదిరాజ్ సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయాయని ఆటో యూనియన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని, కుటుంబాలను పోషించలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ఆటోలు బంద్ చేసి, సమ్మెకు దిగాలని వారు తీర్మానించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల ఆటో డ్రైవర్ల అధ్యక్ష, కార్యదర్శులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆటో డ్రైవర్‌కు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మరియు ఆటో డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు, ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీవో ఆఫీసులో వాహనాల ఫిట్నెస్ పైన రేడియం వేస్తూ చేస్తున్న కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు నెలలో ఆటో డ్రైవర్లందరూ ఏకమై సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    1
    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయాయని ఆటో యూనియన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని, కుటుంబాలను పోషించలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ఆటోలు బంద్ చేసి, సమ్మెకు దిగాలని వారు తీర్మానించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల ఆటో డ్రైవర్ల అధ్యక్ష, కార్యదర్శులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆటో డ్రైవర్‌కు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మరియు ఆటో డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో పాటు, ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీవో ఆఫీసులో వాహనాల ఫిట్నెస్ పైన రేడియం వేస్తూ చేస్తున్న కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు నెలలో ఆటో డ్రైవర్లందరూ ఏకమై సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    50 min ago
  • కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని చర్ల బూత్కూరు గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు ప్రక్రియకు సంబంధించిన సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ పిలుపు మేరకు బూత్ ఇన్‌ఛార్జులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు ఈ కేంద్రాన్ని ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు నమోదు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సహాయ కేంద్రంలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుకర్, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, వార్డ్ మెంబర్ తప్పెట్ల నరేష్‌తో పాటు బీఎల్ఏలు, బీఎల్ఓలు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని చర్ల బూత్కూరు గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు ప్రక్రియకు సంబంధించిన సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ పిలుపు మేరకు బూత్ ఇన్‌ఛార్జులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు ఈ కేంద్రాన్ని ప్రారంభించి, పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు నమోదు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సహాయ కేంద్రంలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుకర్, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, వార్డ్ మెంబర్ తప్పెట్ల నరేష్‌తో పాటు బీఎల్ఏలు, బీఎల్ఓలు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • వడ్లను లారీల కొద్దీ యథేచ్ఛగా అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, వరి ధాన్యం ఎక్కడికి తరలిపోతుందనే అంశంపై ఎటువంటి నిఘా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులలో కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడం అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఈ వరి ధాన్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రైస్ మిల్లర్లు, అధికారులు, బడా నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీల కొద్దీ వడ్లను అక్రమంగా అమ్ముకుంటుంటే అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
    1
    వడ్లను లారీల కొద్దీ యథేచ్ఛగా అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, వరి ధాన్యం ఎక్కడికి తరలిపోతుందనే అంశంపై ఎటువంటి నిఘా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులలో కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడం అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు.

ఈ వరి ధాన్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రైస్ మిల్లర్లు, అధికారులు, బడా నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీల కొద్దీ వడ్లను అక్రమంగా అమ్ముకుంటుంటే అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    19 hrs ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు కలవడం వల్ల చేప పిల్లలు మృతి చెందుతున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి, మత్స్యకారుల జీవనాధారానికి ఎంతో కీలకమైన తోటపల్లి రిజర్వాయర్ను కాలుష్యానికి గురిచేయడం సరికాదని ఆయన శనివారం అన్నారు. కలుషితమైన ఈ నీటిని పంటలకు ఉపయోగించడం వల్ల భూముల సారవంతం తగ్గే ప్రమాదం ఉందని, అలాగే పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రిజర్వాయర్లోకి వ్యర్థ జలాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలన్నారు. ప్రజా సమస్యలపై నిరసనగా బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, నాయకులు లింగాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ దుమాల మహేష్, వంగల నరేష్, వార్డు సభ్యులు తిప్పరపు మహేష్, పొట్లపెల్లి శివ, రామంచ పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు కలవడం వల్ల చేప పిల్లలు మృతి చెందుతున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి, మత్స్యకారుల జీవనాధారానికి ఎంతో కీలకమైన తోటపల్లి రిజర్వాయర్ను కాలుష్యానికి గురిచేయడం సరికాదని ఆయన శనివారం అన్నారు.

కలుషితమైన ఈ నీటిని పంటలకు ఉపయోగించడం వల్ల భూముల సారవంతం తగ్గే ప్రమాదం ఉందని, అలాగే పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రిజర్వాయర్లోకి వ్యర్థ జలాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలన్నారు.

ప్రజా సమస్యలపై నిరసనగా బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, నాయకులు లింగాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ దుమాల మహేష్, వంగల నరేష్, వార్డు సభ్యులు తిప్పరపు మహేష్, పొట్లపెల్లి శివ, రామంచ పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    Tour operator గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో ప్రాజెక్టులను ఎండబెడుతుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు. ఎల్ఎండీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయని కరీంనగర్ లో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ కు పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పంపులను ఆన్ చేయడం లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంపులను ఆన్ చేయకపోతే, రైతులు పంప్‌హౌస్‌లను ముట్టడించడం తప్పదని ఆయన స్పష్టం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
    1
    కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో ప్రాజెక్టులను ఎండబెడుతుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు. ఎల్ఎండీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయని కరీంనగర్ లో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ కు పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పంపులను ఆన్ చేయడం లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంపులను ఆన్ చేయకపోతే, రైతులు పంప్‌హౌస్‌లను ముట్టడించడం తప్పదని ఆయన స్పష్టం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఉపసర్పంచ్ ధూమాల మహేష్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు గ్రామ సర్పంచ్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే, వాటిని ప్రజల ముందు ఉంచాలని ఆయన సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని ఆయన హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా ధూమాల మహేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి వేణు, లింగాల వెంకటేష్, దొంతరవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఉపసర్పంచ్ ధూమాల మహేష్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు గ్రామ సర్పంచ్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే, వాటిని ప్రజల ముందు ఉంచాలని ఆయన సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని ఆయన హితవు పలికారు.

రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా ధూమాల మహేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి వేణు, లింగాల వెంకటేష్, దొంతరవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నీళ్లు అడిగే తమ బీఆర్ఎస్ నేతలపై కక్ష పెంచుకొని, రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడి తన హోదాను మర్చిపోయారని చల్మెడ విమర్శించారు. రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారని నిన్నటి ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ప్రశ్నించగా, కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో పంటను తడుపుతానని సీఎం సమాధానం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే, మమ్మల్ని కోసి మా రక్తం పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి భాషనేనా అంటూ నిలదీశారు. ఇకనైనా రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని, సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నీళ్లు అడిగే తమ బీఆర్ఎస్ నేతలపై కక్ష పెంచుకొని, రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడి తన హోదాను మర్చిపోయారని చల్మెడ విమర్శించారు. రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారని నిన్నటి ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ప్రశ్నించగా, కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో పంటను తడుపుతానని సీఎం సమాధానం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే, మమ్మల్ని కోసి మా రక్తం పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి భాషనేనా అంటూ నిలదీశారు. ఇకనైనా రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని, సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    2
    కరీంనగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.