Shuru
Apke Nagar Ki App…
బాధితులకు మొబైల్ ఫోన్ లు అందజేసిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరికి గురైన 100 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితులకు ఎస్పీ జానకి షర్మిల మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల 56 లక్షల 20 వేల విలువైన 2135 మొబైల్ ఫోన్ లు బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు చోరీకి గురైనవో కాదో సరిచూసుకోవాలని సూచించారు.
నిర్మల్
బాధితులకు మొబైల్ ఫోన్ లు అందజేసిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరికి గురైన 100 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితులకు ఎస్పీ జానకి షర్మిల మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల 56 లక్షల 20 వేల విలువైన 2135 మొబైల్ ఫోన్ లు బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు చోరీకి గురైనవో కాదో సరిచూసుకోవాలని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- *ప్రజా ఆశీర్వాద సభకు ఉత్సాహవంతమైన ప్రారంభం ఎమ్మెల్యే* జగిత్యాలలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక ఉత్సాహంతో కారులో కూర్చుని, కేసీఆర్ ప్రసిద్ధ పాటలు వింటూ "బోలో కేసీఆర్ జిందాబాద్... బోలో మేర నేత జిందాబాద్" అని గట్టిగా అరుస్తూ,మార్గ మధ్యలో నాయకులతో కలిసి తాటి ముంజలను పంచుకున్నారు.2
- జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...4
- * మాత శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట * పిల్లలను తమ పిల్లలుగా భావించాలి * గ్రామీణస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచన * అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ * ఇప్పటికే 26 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేశాం నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. భీంగల్ ప్రాజెక్టు సీడీపీవో స్వర్ణలత,ఏసీడీపీవో జ్ఞానేశ్వరి నేతృత్వంలో సిరికొండ మండలంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం చే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 72మంది అంగన్వాడీ టీచర్లు, ఇద్దరు సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు,గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ రాంబాబు, సూపర్ వైజర్లు సవిత,రాజేశ్వర్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ---------------------------------1
- కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని లింగారెడ్డి హెచ్చరించారు.. మంగళవారం శనగలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జైనథ్ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా రైతులకు అండగా అఖిలపక్షం మద్దతుగా నిలిచింది రైతులతో పాటు జాతీయ రాజధానిపై బైఠాంచి రాస్తారోకో తెలిపి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.... రైతుబంధు సమన్వయ అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన శనిగలను ఈనెల 30 వరకు కొంటామని అధికారికంగా ప్రకటించి తీరా ప్రభుత్వ కోట అయిపోయిందంటూ శనిగల కొనుగోలు ఆపేయదంతో రైతులు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. లక్ష పదివేల కుంటల శనగ పంట వేయగా ప్రభుత్వం కేవలం 24000 మాత్రమే కొనడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే మార్కెట్ ప్రారంభోత్సవంలో ఈనెల 30 వరకు జొన్నలు కొనుగోలు చేస్తామని మోసపూరిత ప్రకటన చేశారని మండిపడ్డారు.. శనగల కొనుగోళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి సైతం వినతి పత్రాలను బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేసినప్పటికీని రైతులపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం తగదన్నారు... రైతులకు న్యాయం జరిగేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 18 గ్రామాల శనగల తో పాటు జొన్నలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తరహాలో ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మార్శెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి,రామ్ రెడ్డి, వెంకన్న, బల్లి గంగన్న అనిత రెడ్డి, స్వామి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు,4
- మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. సామాజిక మార్పుకు విద్యే మార్గం ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.2
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికితీతకే పోటీలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పీఎం శ్రీ విద్యాలయంలో విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి.. అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారని, జూన్ 12 వ తేదీ వరకు 10 శాఖల ఆద్వర్యంలో వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటి దాకా చేసిన పనులు వివరిస్తూ.. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం అమలు చేస్తుందని వెల్లడించారు.ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు, వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, అవగాహన కల్పించామని, రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు అమలు, గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించామని వివరించారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కిచెన్, స్కూల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామని పేర్కొన్నారు. టాలెంట్ హంట్ లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అన్ని విద్యాలయాలకు కావాల్సిన మరమ్మత్తుల వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని, అన్ని విద్యాలయాల్లో కామన్ డైట్ మెనూ అమలు చేస్తుందని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు తరగతి పుస్తకాలతో పాటు దిన పత్రికలు, కథల పుస్తకాలు చదవాలని సూచించారు. ఆటలు లేదా ఏదైనా ఒక రంగంలో బాగా సాధన చేసి.. రాణించాలని పేర్కొన్నారు. పరిసరాల పై అవగాహన ఉండాలని, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సమయం వృథా చేయవద్దని వివరించారు. విద్యార్థులు అందరూ ఏ నేపథ్యం నుంచి వచ్చినా కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, గురుకులాల డీసీఓ థెరిస్సా, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సిలివేరి లావణ్య, ప్రిన్సిపాల్ బీ పద్మ తదితరులు పాల్గొన్నారు.2
- Post by Vishwamber Rao1
- జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు1