Shuru
Apke Nagar Ki App…
కాకర్లపహాడ్ అటవీ ప్రాంత విధ్వంసంపై స్వతంత్ర విచారణ జరపాలి: PCCF కి ఫిర్యాదు [సమాచారం] మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్‌పేట మండలం, కాకర్లపహాడ్ గ్రామ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ మరియు శ్రీ మైసమ్మ దేవాలయం పరిసరాలలో జరుగుతున్న చెట్ల నశింపుపై బాధ్యతగల పౌరుడు T సత్యనారాయణ రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారి (PCCF & HoFF) గారికి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఫారెస్ట్ ఏరియాలో చెట్లు దెబ్బతినడం, దహనం కావడం, అలాగే టెండర్లు మరియు జాతరల పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై కేవలం దిగువ స్థాయి అధికారుల విచారణ కాకుండా, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.
Satyanarayana
కాకర్లపహాడ్ అటవీ ప్రాంత విధ్వంసంపై స్వతంత్ర విచారణ జరపాలి: PCCF కి ఫిర్యాదు [సమాచారం] మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్‌పేట మండలం, కాకర్లపహాడ్ గ్రామ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ మరియు శ్రీ మైసమ్మ దేవాలయం పరిసరాలలో జరుగుతున్న చెట్ల నశింపుపై బాధ్యతగల పౌరుడు T సత్యనారాయణ రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారి (PCCF & HoFF) గారికి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఫారెస్ట్ ఏరియాలో చెట్లు దెబ్బతినడం, దహనం కావడం, అలాగే టెండర్లు మరియు జాతరల పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై కేవలం దిగువ స్థాయి అధికారుల విచారణ కాకుండా, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- పెండింగ్ జీతాలు చెల్లించడంతో కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలని నిరసన తెలుపడంతో అధికారులు పాలకులు దిగివచ్చి జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ కార్మికులు సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేర్ చౌరస్తా వద్ద ఉదయం వేళలో మున్సిపల్ కార్మికులు సమావేశమై పెండింగ్ జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ చైర్మన్కు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు1
- వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను. నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను వదిలేయాలని వేడుకున్న రాజు. నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించానని, నిన్ను వదులుకోలేనని, నేను చెప్పినట్టు వింటే రాజా లాగా చూసుకుంటానని రాజుకు చెప్పిన శిరీష.1
- మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.1
- షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.1
- శ్రీ ఏడుపాయల మనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- బేగంబజార్‌లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం! హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్‌ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.1
- ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.1