logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

38 కేసుల్లో లభించిన 63.621 కిలోల గంజాయి, 1 గంజాయి మొక్క దగ్ధం - కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన *38 కేసుల్లో* స్వాధీనం చేసుకున్న *63 కిలోల 621 గ్రాముల గంజాయి* మరియు *1 గంజాయి మొక్కను* ఈరోజు (బుధవారం) ధ్వంసం చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ శ్రీ గౌస్ ఆలం ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో పోలీస్ కమీషనర్ గారి సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి , వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్ , శ్రీలత ,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

11 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
11 hrs ago

38 కేసుల్లో లభించిన 63.621 కిలోల గంజాయి, 1 గంజాయి మొక్క దగ్ధం - కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన *38 కేసుల్లో* స్వాధీనం చేసుకున్న *63 కిలోల 621 గ్రాముల గంజాయి* మరియు *1 గంజాయి మొక్కను* ఈరోజు (బుధవారం) ధ్వంసం చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ శ్రీ గౌస్ ఆలం ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో పోలీస్ కమీషనర్ గారి సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి , వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్ , శ్రీలత ,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు 1. సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్ - స్వాధీనం: రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం. 2. సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మీరట్ - స్వాధీనం: రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం. 3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్ - స్వాధీనం: రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం. మొత్తం స్వాధీనం - రూ.2,09,000 నగదు - 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు - 64.98 గ్రాముల వెండి ఆభరణాలు సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు **రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)**తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
    1
    భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు

బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్

రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు
భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు.
యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్
దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన నిందితులు
1. సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్
- స్వాధీనం: రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం.
2. సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మీరట్
- స్వాధీనం: రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం.
3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్
- స్వాధీనం: రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం.
మొత్తం స్వాధీనం
- రూ.2,09,000 నగదు
- 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు
- 64.98 గ్రాముల వెండి ఆభరణాలు
సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు
దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు.
రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు.
అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు.
కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు.
పరారీలో ప్రధాన నిందితులు
అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు **రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)**తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • కరీంనగర్ భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు 1. సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్ - స్వాధీనం: రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం. 2. సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మీరట్ - స్వాధీనం: రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం. 3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్ - స్వాధీనం: రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం. మొత్తం స్వాధీనం - రూ.2,09,000 నగదు - 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు - 64.98 గ్రాముల వెండి ఆభరణాలు సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు **రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)**తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
    1
    కరీంనగర్ భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు
బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్
రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం
కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు
భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు.
యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్
దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన నిందితులు
1. సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), ఫల వ్యాపారి, మీరట్
- స్వాధీనం: రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం.
2. సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మీరట్
- స్వాధీనం: రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం.
3. మొహమ్మద్ హసీన్ (19), మీరట్
- స్వాధీనం: రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం. మొత్తం స్వాధీనం
- రూ.2,09,000 నగదు
- 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు
- 64.98 గ్రాముల వెండి ఆభరణాలు
సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు
దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు.
రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు.
అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు.
కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు.
పరారీలో ప్రధాన నిందితులు
అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు **రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)**తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    7 hrs ago
  • ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఈరోజు బుధవారం రోజున:29/07/2026:కేంద్రంలోని దయనీయంగా మారిన రహదారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని. మామిడి హరీష్ దళిత మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల కారణంగా అనేక రహదారులు ధ్వంసమయ్యాయి. అనంతరం వాటి మరమ్మతులు సకాలంలో చేపట్టకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులపై ఏర్పడిన గుంతల్లో నీరు నిల్వ ఉండి ప్రమాదాలకు కారణమవుతోంది. వాహనదారులు గుంతలను గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, మురుగునీరు రోడ్లపైకి చేరడం, కాలువలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దెబ్బతిన్న రహదారులను పరిశీలించి, గుంతలను పూడ్చి, అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఈరోజు బుధవారం రోజున:29/07/2026:కేంద్రంలోని దయనీయంగా మారిన రహదారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని.
మామిడి హరీష్ దళిత మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ డిమాండ్ చేశారు.
ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల కారణంగా అనేక రహదారులు ధ్వంసమయ్యాయి. అనంతరం వాటి మరమ్మతులు సకాలంలో చేపట్టకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులపై ఏర్పడిన గుంతల్లో నీరు నిల్వ ఉండి ప్రమాదాలకు కారణమవుతోంది. వాహనదారులు గుంతలను గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, మురుగునీరు రోడ్లపైకి చేరడం, కాలువలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దెబ్బతిన్న రహదారులను పరిశీలించి, గుంతలను పూడ్చి, అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    12 hrs ago
  • మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గురువారం సిరిసిల్ల, వేములవాడ పర్యటన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా & BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. *30.07.2026 గురువారం కార్యక్రమ వివరాలు:* *ఉదయం 6.30 గం:* హైదరాబాద్ నుండి బయలుదేరడం *ఉదయం 9.00 గం:* వేములవాడ చేరుకొని శ్రీ రాజ రాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం. అనంతరం గుడి చెరువు ట్యాంక్ బండ్ పార్క్ ను ప్రారంభించడం, తిప్పాపూర్ బస్ స్టాండ్ పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం *ఉదయం 10.30 గం:* సిరిసిల్ల చేరుకొని రాగుడు బైపాస్ జంక్షన్, రాగుడు జంక్షన్ వద్ద బస్ షెల్టర్ ను ప్రారంభించడం. IDOC లో El Nino యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశంలో పాల్గొనడం *మధ్యాహ్నం 12.30 గం:* సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం ఈ మేరకు వ్యవసాయ శాఖ OSD V. శ్రీధర్ టూర్ ప్రోగ్రాం నెం. 64/M/2026 ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
    1
    మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గురువారం సిరిసిల్ల, వేములవాడ పర్యటన
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు, రవాణా & BC సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.
*30.07.2026 గురువారం కార్యక్రమ వివరాలు:*
*ఉదయం 6.30 గం:* హైదరాబాద్ నుండి బయలుదేరడం  
*ఉదయం 9.00 గం:* వేములవాడ చేరుకొని శ్రీ రాజ రాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం. అనంతరం గుడి చెరువు ట్యాంక్ బండ్ పార్క్ ను ప్రారంభించడం, తిప్పాపూర్ బస్ స్టాండ్ పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం  
*ఉదయం 10.30 గం:* సిరిసిల్ల చేరుకొని రాగుడు బైపాస్ జంక్షన్, రాగుడు జంక్షన్ వద్ద బస్ షెల్టర్ ను ప్రారంభించడం. IDOC లో El Nino యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశంలో పాల్గొనడం  
*మధ్యాహ్నం 12.30 గం:* సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం
ఈ మేరకు వ్యవసాయ శాఖ OSD V. శ్రీధర్ టూర్ ప్రోగ్రాం నెం. 64/M/2026 ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
    user_శ్రీధర్ సూర్య రిపోటర్
    శ్రీధర్ సూర్య రిపోటర్
    చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • కరీంనగర్ లో 63 కిలోల గంజాయి దగ్ధం చేసిన పోలీసులు... నిషేధిత గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ ఆలం హెచ్చరిక కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయిని, ఒక గంజాయి మొక్కను పోలీసులు దగ్ధం చేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేశారు. ఒక గంజాయి మొక్కను సైతం దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి , వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్ , శ్రీలత ,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ లో 63 కిలోల గంజాయి దగ్ధం చేసిన పోలీసులు... నిషేధిత గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ ఆలం హెచ్చరిక
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయిని, ఒక గంజాయి మొక్కను పోలీసులు దగ్ధం చేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేశారు. ఒక గంజాయి మొక్కను సైతం దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి , వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్ , శ్రీలత ,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి  అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • వర్షంలో సైతం కొనసాగుతున్న బెజ్జంకి బంద్ ఇథనాల్ ఫ్యాక్టరీలను మూసివేయాలని డిమాండ్ వర్షంలోనూ వెనక్కి తగ్గని అఖిలపక్షం.. బెజ్జంకి బంద్ కొనసాగింపు బెజ్జంకి మండలంలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం చేపట్టిన బంద్ మంగళవారం వర్షం కురుస్తున్నప్పటికీ ఉధృతంగా కొనసాగింది. తిమ్మాయపల్లి, నర్సింహులపల్లి పరిసర ప్రాంతాల్లో ఇథనాల్ పరిశ్రమలు ఏర్పాటైతే పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు, ప్రజలు ఫ్యాక్టరీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంద్‌కు ప్రజలు, రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో మండల వ్యాప్తంగా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు తిరుపతి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగగా, ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు.
    4
    వర్షంలో సైతం కొనసాగుతున్న బెజ్జంకి బంద్ ఇథనాల్ ఫ్యాక్టరీలను మూసివేయాలని డిమాండ్
వర్షంలోనూ వెనక్కి తగ్గని అఖిలపక్షం.. బెజ్జంకి బంద్ కొనసాగింపు
బెజ్జంకి మండలంలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం చేపట్టిన బంద్ మంగళవారం వర్షం కురుస్తున్నప్పటికీ ఉధృతంగా కొనసాగింది. తిమ్మాయపల్లి, నర్సింహులపల్లి పరిసర ప్రాంతాల్లో ఇథనాల్ పరిశ్రమలు ఏర్పాటైతే పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు, ప్రజలు ఫ్యాక్టరీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బంద్‌కు ప్రజలు, రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో మండల వ్యాప్తంగా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు తిరుపతి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగగా, ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • శ్రీధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వైభవంగా గోపూజోత్సవం గురు పౌర్ణమి ఉత్సవం కరీంనగర్ లోని కృష్ణానగర్ లోని శ్రీధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ని పురస్కరించుకొని 108 మంది దంపతుల చేత సామూహిక గోపూజోత్సవాన్ని గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. మయూరగిరి పీఠాధీశులు జ్యోతిష్య -వాస్తు- ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు గోపూజ వైభవం నిర్వహించారు.. వ్యాసభగవానుడు లోకానికి 18 పురాణాలు, ఉప పురాణాలు, ఉపనిషత్తులు అందించి గురుస్థానాన్ని పొందాడని, ప్రతి వ్యక్తి తల్లే మొదటి గురువు అని, గోమాత తల్లి లాంటి క్షేమాన్ని అందిస్తుంది కాబట్టే దానిని గోమాత అన్నారని,... గోమాతను ఆరాధించిన వారికి తల్లిదండ్రుల సేవ చేసిన వారికి సకల దేవత అనుగ్రహం కలుగుతుందని.. రమణాచార్యులు తెలియపరచారు.. ఈ కార్యక్రమంలో పండితులు నమిలకొండ రమణాచార్యులు గుండ రాధాకృష్ణన్ గారు నారదాసు వసంతరావు గారు కాంగ్రెస్ నాయకులు పురుమళ్ళ శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు మొదలగు చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. కార్యక్రమానంతరం పండితులు తీర్థ ప్రసాదాన్ని అందించారు.. అన్నదానం కూడా జరిగింది.. వర్షం ఉన్నప్పటికీపలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పాల్గొన్నారు. భక్తులందరికీ ఉచిత గోవులను పూజా సామాగ్రిని ఉచితంగా అందించారు...
    1
    శ్రీధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వైభవంగా గోపూజోత్సవం గురు పౌర్ణమి  ఉత్సవం
కరీంనగర్ లోని కృష్ణానగర్ లోని శ్రీధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ని పురస్కరించుకొని 108 మంది దంపతుల చేత సామూహిక గోపూజోత్సవాన్ని గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. మయూరగిరి పీఠాధీశులు జ్యోతిష్య -వాస్తు- ఆగమ శాస్త్ర పండితులు 
శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు గోపూజ వైభవం నిర్వహించారు.. వ్యాసభగవానుడు లోకానికి 18 పురాణాలు,
ఉప పురాణాలు, ఉపనిషత్తులు అందించి గురుస్థానాన్ని పొందాడని, ప్రతి వ్యక్తి తల్లే మొదటి గురువు అని, గోమాత తల్లి లాంటి క్షేమాన్ని అందిస్తుంది కాబట్టే దానిని గోమాత అన్నారని,...
గోమాతను ఆరాధించిన వారికి తల్లిదండ్రుల సేవ చేసిన వారికి సకల దేవత అనుగ్రహం కలుగుతుందని..
రమణాచార్యులు తెలియపరచారు..
ఈ కార్యక్రమంలో పండితులు నమిలకొండ  రమణాచార్యులు 
గుండ రాధాకృష్ణన్ గారు నారదాసు వసంతరావు గారు కాంగ్రెస్ నాయకులు పురుమళ్ళ శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు మొదలగు చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. కార్యక్రమానంతరం పండితులు తీర్థ ప్రసాదాన్ని అందించారు..
అన్నదానం కూడా జరిగింది..
వర్షం ఉన్నప్పటికీపలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పాల్గొన్నారు. భక్తులందరికీ ఉచిత గోవులను పూజా సామాగ్రిని ఉచితంగా అందించారు...
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు – మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్ రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు. యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్ దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు సల్మాన్ అలియాస్ భూరే యాదవ్ (22), సల్మాన్ అలియాస్ విమాన్ (22), మొహమ్మద్ హసీన్ (19), వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు 64.98 గ్రాముల వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (ఎ1), మనుమడు అజీమ్ రజా (ఎ2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ప్రధాన నిందితులు అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు రజావుద్దీన్ (ఎ1), అజీమ్ రజా (ఎ2) తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని సీపీ తెలిపారు
    1
    భగత్‌నగర్ సంచలన ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు

బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు 

– మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్

రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు.
యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్
దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు సల్మాన్ అలియాస్ భూరే యాదవ్ (22), సల్మాన్ అలియాస్ విమాన్ (22), మొహమ్మద్ హసీన్ (19), వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు 64.98 గ్రాముల వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు
దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (ఎ1), మనుమడు అజీమ్ రజా (ఎ2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు.
పరారీలో ప్రధాన నిందితులు
అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు రజావుద్దీన్ (ఎ1), అజీమ్ రజా (ఎ2) తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని సీపీ తెలిపారు
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.