భూ సమస్యలు, కుటుంబ కలహాలు ప్రతి కుటుంబంలో ఉంటాయని, వాటిని గ్రామ పెద్దలు, కుల పెద్దలు, స్థానిక అధికారులతో కలిసి పరిష్కరించుకోవాలి తప్ప ఆవేశాలకు లోనై గొడవలకు దిగకూడదని ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) కన్వీనర్ బీరువాల భాష, మాల మహానాడు నంద్యాల జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజీమార్గమే రాజమార్గం అన్న నానుడిని అనుసరించి ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలని వారు పిలుపునిచ్చారు. రుద్రవరం మండలం చిన్న కమ్మలూరు గ్రామానికి చెందిన దాసరి పుల్లయ్య, దాసరి నరసింహ, పల్లెవాళ్ళ కుమార్ అనే దాయాదుల మధ్య భూ సమస్యపై గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోగా, దాయాదుల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. ఈ విషయం ఆళ్లగడ్డ JAC కన్వీనర్ బీరువాల భాష, రాష్ట్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు మర్యాదాస్, సీపీఎం పార్టీ నాయకుడు భాస్కర్ దృష్టికి రావడంతో, వారు స్వయంగా గ్రామానికి చేరుకున్నారు. ఈ నాయకులు దాయాదులతో మాట్లాడి, సమస్యకు కారణమైన పొలం వద్దకు వెళ్లి వారికి సర్దిచెప్పారు. పెద్దల సమక్షంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారి వద్ద నుండి ఒప్పంద పత్రాన్ని రాయించుకున్నారు. ప్రజా సంఘాల నాయకులైన బీరువాల భాష, చంద్రశేఖర్, భాస్కర్, రామాంజనేయులు, మర్యాదాస్ మాట్లాడుతూ, అన్నదమ్ముల మధ్య భూ తగాదాలైనా, భార్యాభర్తల మధ్య సమస్యలైనా సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. అలా కాకుండా క్షణికావేశానికి లోనై గొడవలకు దిగితే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుందని హెచ్చరించారు. తమ సమస్య సంవత్సరాల తరబడి పరిష్కారం కాక మనస్పర్ధలతో ఇబ్బందులు పడ్డామని బాధితులు తెలిపారు. నేడు ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, విప్లవ పార్టీ నాయకులు తమ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించి ఒక పరిష్కార మార్గాన్ని సూచించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం కోసం ముందుకు వచ్చిన ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విప్లవ సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మాల మహానాడు నంద్యాల జిల్లా సెక్రెటరీ చక్రవర్తి, రాజేష్, వలి, షాషా వలి, ఖజావాలి, ఉయ్యాలవాడ మాల మహానాడు ఇంచార్జ్ ఓబులేసు, దస్తగిరి, కోటపాడు దస్తగిరి, దాసరి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యలు, కుటుంబ కలహాలు ప్రతి కుటుంబంలో ఉంటాయని, వాటిని గ్రామ పెద్దలు, కుల పెద్దలు, స్థానిక అధికారులతో కలిసి పరిష్కరించుకోవాలి తప్ప ఆవేశాలకు లోనై గొడవలకు దిగకూడదని ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) కన్వీనర్ బీరువాల భాష, మాల మహానాడు నంద్యాల జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజీమార్గమే రాజమార్గం అన్న నానుడిని అనుసరించి ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలని వారు పిలుపునిచ్చారు. రుద్రవరం మండలం చిన్న కమ్మలూరు గ్రామానికి చెందిన దాసరి పుల్లయ్య, దాసరి నరసింహ, పల్లెవాళ్ళ కుమార్ అనే దాయాదుల మధ్య భూ
సమస్యపై గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోగా, దాయాదుల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. ఈ విషయం ఆళ్లగడ్డ JAC కన్వీనర్ బీరువాల భాష, రాష్ట్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు మర్యాదాస్, సీపీఎం పార్టీ నాయకుడు భాస్కర్ దృష్టికి రావడంతో, వారు స్వయంగా గ్రామానికి చేరుకున్నారు. ఈ నాయకులు దాయాదులతో మాట్లాడి, సమస్యకు కారణమైన పొలం వద్దకు వెళ్లి వారికి సర్దిచెప్పారు. పెద్దల
సమక్షంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారి వద్ద నుండి ఒప్పంద పత్రాన్ని రాయించుకున్నారు. ప్రజా సంఘాల నాయకులైన బీరువాల భాష, చంద్రశేఖర్, భాస్కర్, రామాంజనేయులు, మర్యాదాస్ మాట్లాడుతూ, అన్నదమ్ముల మధ్య భూ తగాదాలైనా, భార్యాభర్తల మధ్య సమస్యలైనా సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. అలా కాకుండా క్షణికావేశానికి లోనై గొడవలకు దిగితే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుందని హెచ్చరించారు. తమ సమస్య సంవత్సరాల తరబడి పరిష్కారం కాక మనస్పర్ధలతో ఇబ్బందులు పడ్డామని బాధితులు తెలిపారు. నేడు ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, విప్లవ పార్టీ నాయకులు
తమ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించి ఒక పరిష్కార మార్గాన్ని సూచించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం కోసం ముందుకు వచ్చిన ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విప్లవ సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మాల మహానాడు నంద్యాల జిల్లా సెక్రెటరీ చక్రవర్తి, రాజేష్, వలి, షాషా వలి, ఖజావాలి, ఉయ్యాలవాడ మాల మహానాడు ఇంచార్జ్ ఓబులేసు, దస్తగిరి, కోటపాడు దస్తగిరి, దాసరి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
- ప్రియ సహోదరీ సోదరులారా, ఈ సందేశం ప్రభు యేసుక్రీస్తు సన్నిధిలో స్తుతించిన, ఆరాధించిన, ప్రార్థించిన, మరియు వైవిధ్యానించిన వారికి అపారమైన సంతోషం, సమాధానం లభిస్తాయని తెలియజేస్తుంది. దీనితో పాటు, ఎంతో ఆనందంగా జీవము, బలము, క్షేమాదాలను పొందుతారని స్పష్టం చేయబడింది.1
- బద్వేలు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలని బద్వేలు మున్సిపాలిటీ కమిషనర్ ఎం. కృష్ణ, ఆర్డీవో చంద్రమోహన్లు పిలుపునిచ్చారు. జూన్ 20న శనివారం, బద్వేలు పట్టణంలోని అన్న క్యాంటీన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వివిధ శాఖల అధికారులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్డీవో చంద్రమోహన్, కమిషనర్ కృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు చీపురు పట్టి క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా భాగస్వామ్యం అయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో అడ్మిన్లు, ఇతర సెక్రటరీలు కనిపించకపోవడం గమనార్హం. బద్వేలు మున్సిపాలిటీలో నిర్వహించిన ఈ ర్యాలీని 'స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ'గా అభివర్ణించారు.1
- మిత్రులందరికీ నమస్కారమండి. ARDV కంపెనీలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కొరకు మొబైల్ నెంబర్ 9666323500 నంబర్‌కు వాట్సప్ ద్వారా లేదా ఫోన్ కాల్ చేసి సంప్రదించగలరు. ధన్యవాదములు ఫ్రెండ్స్.1
- గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని కూడా వెల్లడించారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, కూటమి నాయకులు ఇన్నాళ్లు పోలీసులను అడ్డం పెట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేశారని, ఇప్పుడు అదే పోలీసులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్నారని తీవ్రంగా ఆరోపించారు. వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాడుకుంటే సమాజం ఎలా తయారవుతుందో చెప్పడానికి కృష్ణలంక సీఐ నాగరాజు కారణంగా జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దుర్ఘటనలే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నొక్కడానికి తెగబడుతున్నారని అప్పిరెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే నెల్లూరులోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై తనిఖీల పేరుతో దాడులకు పూనుకున్నారని ఆయన వెల్లడించారు. డీఎస్సీ-2025 నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలు, అలాగే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు చేసి ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చారని ఆధారాలతో సహా నిరూపిస్తూ వైయస్ఆర్ సీపీ తరఫున చంద్రశేఖర్ రెడ్డి బలంగా తన గొంతు వినిపించడంతో ప్రభుత్వం ఇరుకున పడిందని అప్పిరెడ్డి వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూటమి ప్రభుత్వానికి కంటిలో నలుసుగా మారినందుకే ఆయనపై కక్ష పెంచుకుందని కూడా ఆయన ఆరోపించారు.1
- ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు వ్యవహారం జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని సింగనగర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని తలపించడంతో పాటు, పోలీసు శాఖలోని క్రమశిక్షణ, చట్టాల అమలు, అధికారుల బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు సింగనగర్ ప్రాంతంలోని ఓ కానిస్టేబుల్ నివాసంలో తలదాచుకున్నారనే ప్రచారం ఉదయం నుంచే జోరందుకుంది, ఈ సమాచారం వెలుగులోకి రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా, కృష్ణలంక ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళన వ్యక్తం చేయడం మరింత చర్చకు దారితీసింది. వారు నాగరాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పూర్తి విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ కనిపించడంతో పరిస్థితి రాజకీయ రంగు పులుముకున్నట్టుగా మారింది. అయితే, ఈ పరిణామాలపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసు అధికారులే చట్టపరమైన ప్రక్రియలకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తూ, సాధారణ ప్రజలకు ఒక విధానం, అధికారులకు మరో విధానమా అని నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాజీ అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని, కానీ చట్టపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసేలా నిరసనలు, ఒత్తిళ్లు తీసుకురావడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పోలీసు శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ పూర్తయ్యే వరకు చట్టం తన పని తాను చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. సీఐ నాగరాజుకు మద్దతుగా కొందరు వీధుల్లోకి రావడం, అరెస్ట్ చేయొద్దంటూ డిమాండ్ చేయడం పట్ల సామాజిక మాధ్యమాల్లో కూడా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి, చట్టం ముందు అందరూ సమానమే అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రత్యేక రక్షణ ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, విచారణ ఏ దశలో ఉంది, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలపై ఆసక్తి కొనసాగుతోంది. మీడియా ముందు అధికారికంగా వివరాలు వెల్లడిస్తారా? లేక విచారణ అనంతరం మాత్రమే చర్యలు ప్రకటిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పోలీసు శాఖలో పనిచేసే అధికారిపై ఆరోపణలు వచ్చినప్పుడు, చట్టపరమైన ప్రక్రియలు పారదర్శకంగా సాగాలని, ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. చట్టాలను అమలు చేసే వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే, బాధ్యులపై చట్టం ముందు సమానత్వం కనిపించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు.1
- బద్వేలు నియోజకవర్గంలో కూటమినేతలు వర్గపోరు మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, సబ్ జైలు లాంటి ఉన్న వ్యవస్థలు మూతపడుతుంటే కొత్త సంస్థలు తెస్తామని హామీలు ఇవ్వడం సిగ్గుచేటని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ తీవ్రంగా డిమాండ్ చేశారు. సబ్ జైలు మూసివేత వలన పోలీసులపై ప్రయాణ భారం పడనున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణమే మూసివేత ఉత్తర్వులను వెనక్కు తీసుకొని యధావిధిగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. స్థానిక భగత్ సింగ్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు, సంస్థలను సాధించడంలో కూటమినేతలు విఫలమయ్యారని విమర్శించారు. దశాబ్దాల కాలం నాటి సబ్ జైలును రిపేర్ల పేరుతో మూసివేయాలని నెల కిందట అనగా 18-05-2026న ఆర్డర్ రాగా, 17-06-2026న మూసివేశారని తెలిపారు. అక్కడున్న డిప్యూటీ జైలర్ను రాజంపేటకు, సిబ్బందిని కడప సెంట్రల్ జైలుకు, జమ్మలమడుగుకు తరలిస్తుంటే అధికార పార్టీ నేతలు పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. దీనివల్ల నియోజకవర్గంలోని కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల వంటి ప్రాంతాల నుండి ఖైదీలను కడప సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి తిరిగి రావాలంటే అర్థరాత్రి వరకు ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేల్ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం పనులు మధ్యలోనే ఆగిపోయాయని, ట్రాఫిక్ కార్యాలయం, డి.ఎస్.పి కార్యాలయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వీటిపై దృష్టి పెట్టకుండా అధికార పార్టీ నేతలు సంపాదనపైనే దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే పులివెందుల మెడికల్ కాలేజీ తరలిపోయిందని, ఉక్కు పరిశ్రమ ఊసే లేదని ఆయన అన్నారు. ఉన్న సంస్థలను కాపాడుకోలేని నేతలు కొత్త పరిశ్రమలు, గిద్దలూరు భాకరాపేట రైల్వే లైన్, సోమశిల వెనక జలాలను బద్వేలు పెద్ద చెరువుకు తరలించి మినీ రిజర్వాయర్ చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని, చేతనైతే ఉన్న కార్యాలయాలను కాపాడి చూపించాలని ఆయన సవాల్ చేశారు. ప్రజలు మీ ప్రగల్భాలను నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కే జకరయ్య, నియోజకవర్గ కమిటీ సభ్యులు కే బాబు, విజయరావు, రామరాజు, జయరామరాజు, పట్టణ కమిటీ సభ్యులు ఈశ్వర్ పోతురాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.1
- కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది, నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో జరిగింది. మృతి చెందిన వారిలో 18 ఏళ్ల జయవర్ధన్ రెడ్డి, 16 ఏళ్ల రాజా వర్ధన్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు అక్రమ ఇసుక తవ్వకాలే ప్రధాన కారణమని పలువురు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.1