అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుర్మార్గులను శిక్షించాలి. పలమనేరు అక్టోబర్ 3( ప్రజా ప్రతిభ) వెదురు కుప్పం మండలం దేవళం పేట గ్రామం వద్ద అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, జిల్లా యువజన నాయకులు సోమరాజు, మానవ హక్కుల కార్యదర్శి మణి, మహిళా నాయకురాలు సరస్వతి, డప్పు కళాకారుల సంఘం నాయకులు గుర్రం సుబ్రమణ్యం, టైలర్ యూనియన్ నాయకులు సూర శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు నారాయణప్ప డిమాండ్ చేశారు. అందులో భాగంగా దేవలంపేట విగ్రహం సంఘటనపై నారాయణ శెట్టి అధ్యక్షతన పలమనేర్ పట్టణంలో జాతీయ మానవ హక్కుల కార్యాలయం నందు ప్రజా సంఘాలు సమావేశం నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశంలోని అన్ని కులాలు మతాలకు సంబంధించిన మహా మేధావి అని అలాంటి విగ్రహాన్ని నిప్పు పెట్టడం పిరికిపంద చర్యగా అభి వర్ణించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ సూత్రాల వలనే భారతదేశ పరిపాలన కొనసాగుతున్నదనే విషయం విగ్రహాలు పగలగొట్టే నీచమైన నికృష్టమైన వ్యక్తులు తెలుసుకొని ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. దేవళం పేట వద్ద విగ్రహం ద్వంసానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని, పోలీసులు స్పందించి ఈ ఘటన విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించకుండా పారదర్శంగా విచారణ జరిపి శిక్షలు పడే విధంగా చూడాలని, ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంబశివ, ఆనంద్, అనసూయ, వాణి, వెంకటేష్, శ్రీదేవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.