ఐనోల్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ అచ్చంపేట, ఫిబ్రవరి 17,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి):నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ మంగళవారం అచ్చంపేట మండల పరిధిలోని ఐనోల్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రతపై కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. కిచెన్ షెడ్, నిల్వ ఉంచిన కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర సరుకులను తనిఖీ చేసి, మెనూ ప్రకారం వంటలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, వంట ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చూడాలని హెచ్చరించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థినులను సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలకు మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని విద్యార్థినులకు సూచించారు. తనిఖీ సందర్భంగా తరగతి గదులను సందర్శించిన కలెక్టర్, విద్యార్థినుల గణిత, ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పరిశీలించారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

- కల్వకుర్తి మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఐదుగురు కౌన్సిలర్లు విజయం సాధించిన సందర్భంగా ఈరోజు బిజెపి కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు గుర్రాల జ్యోతి రాంభూపాల్ రెడ్డి, బోడ నరసింహ, వరికుప్పల శ్రీరాములు, ఎనుగొండ రామకృష్ణ,కేతావత్ రేణుకలు మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం కల్పించిన కల్వకుర్తి పట్టణ ప్రజలకు రుణపడి ఉంటామని వార్డు అభివృద్ధికి నిరంతరం పాటు పడతామని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని బిజెపి పార్టీ ఉన్నతికి కృషి చేస్తామని బీజేపీ కౌన్సిలర్లు తెలియజేశారు సన్మానం అనంతరం బిజెపి శ్రేణులతో భారీగా ర్యాలీగా కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయానికి తరలివెళ్లి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు యేన్నం శేఖర్ రెడ్డి,బండల రామచంద్రారెడ్డి, సూర్య కృష్ణ గౌడ్,మోహన్ రెడ్డి,నరెడ్ల శేఖర్ రెడ్డి,గుండోజు గంగాధర్, పాలకూర రవిగౌడ్, సురేందర్ గౌడ్, జూలూరు బాలస్వామి,ధన్నోజు నరేష్ చారి,నాప శివ, నాయకులు కార్యర్తలు పాల్గొన్నారు4
- రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ ఎదిరె మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కళ్యాణ మహోత్సవ దృశ్యాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.1
- నల్లగొండలో ఎక్కువ బిజినెస్ జరిగే ప్రాంత రోడ్డు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందని,నిత్యం యాక్సిడెంట్స్ అవుతున్నాయని,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన స్థానికులు,వ్యాపారులు...* మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సాహసోపేత నిర్ణయ అభివృద్ధి పనులకు మద్దతుగా మేముంటామని ప్రకటించిన స్థానికులు, వ్యాపారులు1
- కేటీ దొడ్డి: మండలంలోని వివిధ గ్రామాల పంట పొలాల్లో సాగు అవుతున్న మామిడి తోటలకు ఈ సంవత్సరం అధిక వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. మామిడి తోటలు ఎక్కువగా సాగు అవుతున్న మండలంలో కేటి దొడ్డి ఉంది. పచ్చని ఆకులతో నిండుగా కనబడుతున్న చెట్లను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు.1
- కదులుతున్న రైలుపై విమానం ల్యాండింగ్: ఇటలీ పైలట్ సాహసం! గాలిలో సాహస విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇటలీ పైలట్ డారియో కోస్టా తాజాగా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక కార్గో రైలు కంటైనర్‌పై తన విమానాన్ని అత్యంత చాకచక్యంగా ల్యాండ్ చేసి, మరుక్షణమే టేకాఫ్ అయ్యారు. కేవలం కొద్ది మీటర్ల వెడల్పు ఉన్న కంటైనర్‌ను రన్‌వేగా మార్చుకుని ఆయన చేసిన ఈ సాహసం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత ప్రమాదకరమైన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.1
- Beef is being sold openly near Darushifa Ground, right where Metro Rail work is in progress. GHMC needs to instruct these Everyday shop open 8:pm1
- హైదరాబాద్:హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాదర్గుల్ కి చెందిన కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి టిప్పర్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెపోతుల వర్ధన్(19)నాదర్గోల్ కృష్ణ సాయి కాలనీలో నివాసం బాలాపూర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ITI మొదటి సంవత్సరం చదువుతున్నాడు నాదర్గుల్ నుండి బడంగ్పేట్ వైపు వెళ్లే AP04TT4717 నంబర్ గల టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో రోడ్డు ప్రక్కన నిలిపివేసిన ఆటో ఒకసారిగా రోడ్డుమీదికి రావడంతో ఆటో తగిలి బైక్(AP35AD8497)అదుపు తప్పి లారీ ముందు చక్రాల కింద పడింది. ప్రమాదం అనంతరం సుమారు 50 మీటర్ల వరకు లారీ బైకర్‌ను ఈడ్చుకెళ్లినట్లు సీసీ కెమెరాలు నమోదయ్యాయి సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.4
- కేశంపేట మండలం పరిధిలోని కాకునూరు గ్రామం లో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి కాకునూరు సుందరాపురం ప్రభ ఎదుర్కోళ్ళు ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు కలిసి ఏర్పాట్లు చేశారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో హారతులు, భజనలు, సాంప్రదాయ వాద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదానం, ప్రసాద పంపిణీ నిర్వహించి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ముగించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.1