logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వార్డు నం. 28, 26 లలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్: పట్టణంలోని నౌగాం బస్తిలో గల వార్డు నంబర్ 28 భాజపా అభ్యర్థి ఈర్ల విశ్వేశ్వర్ రావు, వార్డు నంబర్ 26 భాజపా అభ్యర్థి ఆడేటి శంకర్ గార్లకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నౌగాం బస్తిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని , డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని తెలిపారు. స్థానికులు కరెంట్ పోల్స్ సమస్య మరియు రోడ్ల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని, ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించి భాజపా బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ కుమార్, వార్డు ఇంచార్జీలు కుంచాల విజయ్, తేలే బాపు, దుర్గం మోతిరాం, రేహన్, ఖారా తిరుపతి, షఫీ తదితరులు పాల్గొన్నారు.

8 hrs ago
user_Banka Srinivas
Banka Srinivas
Insurance Agent కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
8 hrs ago

వార్డు నం. 28, 26 లలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్: పట్టణంలోని నౌగాం బస్తిలో గల వార్డు నంబర్ 28 భాజపా అభ్యర్థి ఈర్ల విశ్వేశ్వర్ రావు, వార్డు నంబర్ 26 భాజపా అభ్యర్థి ఆడేటి శంకర్ గార్లకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నౌగాం బస్తిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని , డ్రైనేజీ

సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని తెలిపారు. స్థానికులు కరెంట్ పోల్స్ సమస్య మరియు రోడ్ల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని, ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించి భాజపా బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ కుమార్, వార్డు ఇంచార్జీలు కుంచాల విజయ్, తేలే బాపు, దుర్గం మోతిరాం, రేహన్, ఖారా తిరుపతి, షఫీ తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • జగిత్యాల జిల్లా కేంద్రంలో 20 అడుగుల కలియుగ శ్రీవెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన గురువారం శ్రీమన్ వేణుగోపాల చారి కౌసీక ప్రారంభించనున్నారు శ్రీ వెంకటేశ్వరస్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలోనే మొట్ట మొదటిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లోలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కలియుగ వెంకటేశ్వర స్వామి వారి 3డి సైకత శిల్ప ప్రదర్శన తేదీ 5 గురువారం రోజు నుండి భక్తుల కొరకై ఏర్పాటు చేసిన కలియుగ వెంకటేశ్వర స్వామి వారి 3డి సైకత శిల్ప ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా శ్రీమాన్ నంబి వేణుగోపాల చారి కౌశిక గారిచే ప్రత్యేక పూజలను నిర్వహించి ప్రారంభిస్తారని కావున పట్టణ హిందూ బంధువులు స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రోగ్రాం ఆర్గనైజర్ వేముల ఉమారాణి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు
    1
    జగిత్యాల జిల్లా కేంద్రంలో 20 అడుగుల కలియుగ శ్రీవెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన గురువారం శ్రీమన్ వేణుగోపాల చారి కౌసీక ప్రారంభించనున్నారు   
శ్రీ వెంకటేశ్వరస్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలోనే మొట్ట మొదటిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లోలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కలియుగ వెంకటేశ్వర స్వామి వారి 3డి సైకత శిల్ప ప్రదర్శన తేదీ 5 గురువారం రోజు నుండి భక్తుల కొరకై ఏర్పాటు చేసిన కలియుగ వెంకటేశ్వర స్వామి వారి 3డి సైకత శిల్ప ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా శ్రీమాన్ నంబి వేణుగోపాల చారి కౌశిక గారిచే ప్రత్యేక పూజలను నిర్వహించి ప్రారంభిస్తారని  కావున పట్టణ హిందూ బంధువులు స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రోగ్రాం ఆర్గనైజర్ వేముల ఉమారాణి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    2 hrs ago
  • ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామ్ జాదవ్ తరపున ఇంటింటికి ప్రచారం చేసిన మాజీ డిసిసిబి అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి,మాజీ జెడ్పిటిసి గోకగణేష్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రకాష్ రావు, డేరా కృష్ణారెడ్డి,పోతారెడ్డి,మాధవ్,ఆనంద్ రావు, ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నలిమల సుమ తదితరులు పాల్గొన్నారు
    1
    ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామ్ జాదవ్ తరపున ఇంటింటికి ప్రచారం చేసిన మాజీ డిసిసిబి అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి,మాజీ జెడ్పిటిసి గోకగణేష్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రకాష్ రావు, డేరా కృష్ణారెడ్డి,పోతారెడ్డి,మాధవ్,ఆనంద్ రావు, ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నలిమల సుమ తదితరులు పాల్గొన్నారు
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Adilabad Urban, Telangana•
    1 hr ago
  • వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుండి వరదల్లా నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. వేములవాడను అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని నాంపల్లి, తిప్పాపూర్, వేములవాడ అంజనీ నగర్, మహంకాళి చౌరస్తా వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీకి నయాపైసా ఇయ్యలేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారన్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసపూరిత హామీలతో ఓట్ల కోసం మీ ముందుకు వస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారని, ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే... వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బెదిరింపులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆయనకే వంతపాడుతున్నారని విమర్శించారు. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఊరుకునేది లేదని, డీజీపీ, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
    1
    వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుండి వరదల్లా నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. వేములవాడను అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని నాంపల్లి, తిప్పాపూర్, వేములవాడ అంజనీ నగర్, మహంకాళి చౌరస్తా వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీకి నయాపైసా ఇయ్యలేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  అమలు చేయకుండా మోసం చేశారన్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసపూరిత హామీలతో ఓట్ల కోసం మీ ముందుకు వస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారని, ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే... వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బెదిరింపులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆయనకే వంతపాడుతున్నారని విమర్శించారు. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఊరుకునేది లేదని, డీజీపీ, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యానికి తాళం వేసిన కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు చెల్లించడం లేదని గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ రామ్మూర్తి
    1
    పెద్దపల్లి జిల్లా 
సుల్తానాబాద్ మున్సిపల్ కార్యానికి తాళం వేసిన కాంట్రాక్టర్
రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు చెల్లించడం లేదని గేటుకు తాళం వేసి నిరసన  వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ రామ్మూర్తి
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • kishanpura
    1
    kishanpura
    user_Shivam Shivam
    Shivam Shivam
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి బుధవారం పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న మున్సిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కోసం చేసుకున్న ప్లాన్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి పరిశీలించారు. స్కూల్, కళాశాల ఆవరణల్లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు. అలాగే సిరిసిల్ల, వేములవాడ పట్టణంలోని సీ నారాయణరెడ్డి కళా మందిరాల్లో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.కౌంటింగ్ హాల్‌లో భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, తాగునీరు, తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం చదును చేస్తున్న స్థలాన్ని సందర్శించారు. కళా మందిరం లోపల స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కోసం ఎన్ని టేబుల్స్, అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కోసం చేస్తున్న ఏర్పాట్లను సందర్శిచారు. వాహనాల పార్కింగ్, క్రమబద్ధమైన రాకపోకలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటుపై సూచనలు చేశారు. పరిశీలనలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, ప్రవీణ్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ తదితరులు ఉన్నారు.
    1
    ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి బుధవారం పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న మున్సిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కోసం చేసుకున్న ప్లాన్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి పరిశీలించారు. స్కూల్, కళాశాల ఆవరణల్లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు. అలాగే సిరిసిల్ల, వేములవాడ పట్టణంలోని సీ నారాయణరెడ్డి కళా మందిరాల్లో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.కౌంటింగ్ హాల్‌లో భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, తాగునీరు, తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం చదును చేస్తున్న స్థలాన్ని సందర్శించారు. కళా మందిరం లోపల స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కోసం ఎన్ని టేబుల్స్, అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కోసం చేస్తున్న ఏర్పాట్లను సందర్శిచారు. వాహనాల పార్కింగ్, క్రమబద్ధమైన రాకపోకలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటుపై సూచనలు చేశారు.
పరిశీలనలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, ప్రవీణ్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ తదితరులు ఉన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • *ఈరోజుకు కూడా నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే నే... ఎమ్మెల్యే సంజయ్* జగిత్యాల ఫిబ్రవరి 4 ; లోని మోతే కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ మీట్..నేను జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న..గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది.. అదే నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లెటర్ రావడం జరిగింది..ఆ తర్వాత జూన్ నెలలో నేను అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడంతో నేను కాంగ్రెస్ పార్టీ లో చేరాను అని దుష్ప్రచారం చేస్తూ నా దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా నా ఆస్పత్రి ఇంటిపై బి ఆర్ఎస్ నాయకులు దాడులు కూడా చేశారు..కనీసం నా నుండి ఒక వివరణ కూడా తీసుకోలేదు. అదే రోజు ఎమ్మెల్యేగా నన్ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కు లేఖ రాశారు..నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు..ఇప్పటివరకు బి ఆర్ ఎస్ అధిష్టానాన్ని, స్థానిక నాయకులను నేను విమర్శించలేదు. నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్న మంత్రులు కూడా అందుకు సహకరిస్తున్నారు. కాబట్టి రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను.
    1
    *ఈరోజుకు కూడా నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే నే... ఎమ్మెల్యే సంజయ్*
జగిత్యాల ఫిబ్రవరి  4 ; లోని మోతే కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ మీట్..నేను జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న..గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది.. అదే నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లెటర్ రావడం జరిగింది..ఆ తర్వాత జూన్ నెలలో నేను అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడంతో నేను కాంగ్రెస్ పార్టీ లో చేరాను అని దుష్ప్రచారం చేస్తూ నా దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా నా ఆస్పత్రి ఇంటిపై బి ఆర్ఎస్ నాయకులు దాడులు కూడా చేశారు..కనీసం నా నుండి ఒక వివరణ కూడా తీసుకోలేదు. 
అదే రోజు ఎమ్మెల్యేగా నన్ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కు లేఖ రాశారు..నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు..ఇప్పటివరకు బి ఆర్ ఎస్ అధిష్టానాన్ని, స్థానిక నాయకులను నేను విమర్శించలేదు. నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్న మంత్రులు కూడా అందుకు సహకరిస్తున్నారు. కాబట్టి రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను.
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    6 hrs ago
  • సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ లోని భగత్ నగర్ లో గల ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు. జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.
    1
    సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. 
కరీంనగర్ లోని భగత్ నగర్ లో గల ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.  అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు.
జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ పట్టణం భగత్ నగర్ లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు. జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
    1
    సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. 
కరీంనగర్ పట్టణం భగత్ నగర్ లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.  అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు.
జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.