logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పంటల యాజమాన్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎర్రగొండపాలెం ఏడిఏ వెంకట రమణ సూచించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు పంటల యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యర్రగొండపాలెం ఏడిఏ వెంకట రమణ సూచించారు. మండలంలోని మర్రివేముల, గాజులపాలెం గ్రామాల్లో మంగళవారం “పొలం పిలుస్తోంది” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక రైతు సేవా కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించారు. కంది పంటలో తేమ ఒత్తిడిని తగ్గించేందుకు పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని, కందిపంటలో అధిక మొక్కల సాంద్రత ఉన్న చోట ధిన్నింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అంతరకృషి ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమను సంరక్షించుకోవచ్చని తెలిపారు.13.0.45. ఒక్క కేజీ,బొరాక్స్ 40 గ్రాములు పిచికారీ చేస్తే పత్తిలో బెట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకోవచ్చన్నారు.నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా మినుములు, పెసర వంటి తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని మండల రైతులకు సూచించారు.ప్రకృతి వ్యవసాయం,పీఎండియస్ విధానం రైతులకు ఎంతో ప్రయోజనమన్నారు. భీజామృతం ద్వారా విత్తనాన్ని శుద్ధిచేసుకుని, నాటితే చీడ పీడలు దరికి చేరవన్నారు. రైతులందరూ ఈ నెల ఆఖరులోగా సాగు చేసుకునే పంటలను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)లో నమోదు చేసుకోవాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విఏఏ కొండా నాయక్, రైతులు,వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

1 day ago
user_ఏడుకొండలు. జర్నలిస్ట్
ఏడుకొండలు. జర్నలిస్ట్
Local News Reporter పుల్లలచెరువు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
1 day ago
0c2adce6-9150-4f04-b4b7-794ad75c3c4b

పంటల యాజమాన్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎర్రగొండపాలెం ఏడిఏ వెంకట రమణ సూచించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు పంటల యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యర్రగొండపాలెం ఏడిఏ వెంకట రమణ సూచించారు. మండలంలోని మర్రివేముల, గాజులపాలెం గ్రామాల్లో మంగళవారం “పొలం పిలుస్తోంది” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక రైతు సేవా కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించారు. కంది పంటలో తేమ ఒత్తిడిని తగ్గించేందుకు పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని, కందిపంటలో అధిక మొక్కల సాంద్రత ఉన్న చోట ధిన్నింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అంతరకృషి ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమను సంరక్షించుకోవచ్చని తెలిపారు.13.0.45.

2ed8ebbf-9708-4acf-b610-921a51253095

ఒక్క కేజీ,బొరాక్స్ 40 గ్రాములు పిచికారీ చేస్తే పత్తిలో బెట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకోవచ్చన్నారు.నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా మినుములు, పెసర వంటి తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని మండల రైతులకు సూచించారు.ప్రకృతి వ్యవసాయం,పీఎండియస్ విధానం రైతులకు ఎంతో ప్రయోజనమన్నారు. భీజామృతం ద్వారా విత్తనాన్ని శుద్ధిచేసుకుని, నాటితే చీడ పీడలు దరికి చేరవన్నారు. రైతులందరూ ఈ నెల ఆఖరులోగా సాగు చేసుకునే పంటలను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)లో నమోదు చేసుకోవాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విఏఏ కొండా నాయక్, రైతులు,వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు
    1
    రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు 
పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.
    1
    జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు.
ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    1 hr ago
  • ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు
    1
    ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం
మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    3 hrs ago
  • ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • **విద్యార్థులలో విద్య సామర్థ్యాలను పెంపొందించాలి*** *- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి.. *- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. *- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. *- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్. విద్యార్థులలో కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని, ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    2
    **విద్యార్థులలో  విద్య సామర్థ్యాలను
పెంపొందించాలి***
*- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి..
*- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.
*- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్..

*- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్.
విద్యార్థులలో  కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం  విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు.  ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో  పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని,  ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స  తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ  కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    17 hrs ago
  • స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.
    1
    స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ  మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    20 hrs ago
  • *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
    1
    *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర  బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి*
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
    user_Senior Jounalist @saidulu
    Senior Jounalist @saidulu
    Local News Reporter దేవరకొండ, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.