logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రేవంత్ సర్కార్‌పై తీన్మార్ మల్లన్న నిప్పులు.. జనగామ టీఆర్‌పీ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ భిక్షపతి ప్రకటన! జనగామ, జూలై 31 (ప్రజా గొంతుక): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికార, ప్రతిపక్ష పార్టీలపై తన శైలిలో నిప్పులు చెరిగారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో టీఆర్‌పీ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, యూత్ ప్రెసిడెంట్ పిట్టల సురేష్ ఆధ్వర్యంలో ‘బీసీ బహుజన విద్యార్థి యువ చైతన్య సభ’ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లన్న.. విద్యార్థుల సమస్యలు, పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్, విద్యా వ్యాపారం చేస్తున్న రాజకీయ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ​ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ భిక్షపతిని తీన్మార్ మల్లన్న అధికారికంగా ప్రకటించారు. 20 ఏళ్ల పాటు సైన్యంలో దేశానికి సేవ చేసిన ముదిరాజ్ బిడ్డ భిక్షపతిని గెలిపించుకోవాలని, అప్పుడే జనగామలో పేద బిడ్డలకు ఉచిత విద్య, మెరుగైన భవిష్యత్తు అందుతుందని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ మహిళా నేత వనజక్క.. సీతక్క కంటే సీనియర్ మావోయిస్టు అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ​ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల సొమ్ము మాయం: 74 కోట్లు ఏమైనట్టు? ​గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన శానిటైజేషన్ స్కూల్ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మల్లన్న మండిపడ్డారు. ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయించిన 74 కోట్ల రూపాయలను దొంగతనంగా ఎత్తుకపోయి తిన్నారని ఆయన రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ​స్కాలర్‌షిప్ నిధుల దారి మళ్ళింపు.. కుక్కకున్న విలువ విద్యార్థులకు లేదా? ​రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందాల్సిన 1900 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధులలో కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసి, మిగిలిన సొమ్మును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర పనులకు దారి మళ్లించిందని మల్లన్న ఆరోపించారు. "పోలీసు శాఖలోని ఒక కుక్క ఆహారం కోసం నెలకు 16,000 రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, హాస్టల్‌లో ఉండి చదువుకునే పేద బిడ్డలకు కనీసం 2000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. కుక్కకు ఉన్న విలువ కూడా విద్యార్థులకు లేదా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ​శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇతర రాష్ట్రాల విద్యార్థుల ర్యాంకులను తమవిగా చూపించుకుంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేవలం కార్పొరేట్ కాలేజీల్లో సీట్లు నింపడం కోసమే పదవ తరగతిలో అందరినీ పాస్ చేస్తున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనన్నారు. ​విద్యా చట్టాల అమలులో వైఫల్యం.. ​'రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009' ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు దక్కాల్సిన 25% ఉచిత సీట్ల గురించి ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని, ఆ చట్టాన్ని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. భారతదేశంలో విద్య కోసం అత్యంత తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, దీనివల్ల రాష్ట్ర విద్యా వ్యవస్థ దేశంలోనే 18వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ मुख्यमंत्री మనవడు అమెరికాలో చదువుకుంటుంటే, పేద విద్యార్థులు మాత్రం కూలిపోయే స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ​జనగామలో విద్యా వ్యాపారం.. పల్లా, కొమ్మూరిలపై ఆగ్రహం ​జనగామ నియోజకవర్గంలో రాజకీయం విద్యా వ్యాపారవేత్తల చేతుల్లో బందీ అయిందని మల్లన్న విమర్శించారు. ఒకవైపు అనురాగ్ యూనివర్సిటీ యజమాని పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరోవైపు కొమ్మూరి ఇన్స్టిట్యూట్ అధినేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విద్యను అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నారని ధ్వజమెత్తారు. "1,26,000 బీసీ ఓట్లున్న జనగామలో కేవలం 11,000 ఓట్లున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీళ్ళే ఎందుకు ఏలాలి? ఈ విద్యా వ్యాపారుల నుంచి జనగామను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆయన పిలుపునిచ్చారు. ​కత్తెర గుర్తుతో చరిత్ర మారుద్దాం! ​అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందుతోందని, తెలంగాణలో కూడా ప్రతి ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అందే వరకు టీఆర్‌పీ పోరాడుతుందని మల్లన్న స్పష్టం చేశారు. మన తలరాతలు మారాలంటే, అమెరికా తరహా విద్య మన పేద బిడ్డలకు దక్కాలంటే రాబోయే రోజుల్లో 'కత్తెర' గుర్తుపై ఓటు వేసి రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. ​ఘనంగా పార్టీ జెండా ఆవిష్కరణ ​సమావేశం అనంతరం తీన్మార్ మల్లన్న స్థానిక 5 మరియు 13వ వార్డుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు మల్లన్నకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, మహిళా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పుష్ప లీలా, మైనారిటీ అధ్యక్షులు సల్మాన్, యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి ప్రవీణ్ రాజ్, సహాయక కార్యదర్శి గిరగాని బిక్షపతి గౌడ్, యూత్ జనరల్ సెక్రటరీలు వీరమల్లు అనిల్, పోలు రాజు, మహిళా ఉపాధ్యక్షురాలు చేసుకూరి మౌనిక యాదవ్, రాష్ట్ర నాయకులు సుతారపు రంగన్న, స్టేట్ ఆఫీసు కోఆర్డినేటర్ లింగం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు రేణుగుంట్ల మురళి బైండ్ల, బోడ రమేష్ నేత, నియోజకవర్గ ఇంచార్జి సీసా శ్రీధర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గుజ్జుక రాజు తదితర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

14 hrs ago
user_Parushuram goud
Parushuram goud
Singer జనగాం, జనగాం, తెలంగాణ•
14 hrs ago
a572c554-4a0b-4fb0-8c2c-06a82fc47340

రేవంత్ సర్కార్‌పై తీన్మార్ మల్లన్న నిప్పులు.. జనగామ టీఆర్‌పీ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ భిక్షపతి ప్రకటన! జనగామ, జూలై 31 (ప్రజా గొంతుక): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికార, ప్రతిపక్ష పార్టీలపై తన శైలిలో నిప్పులు చెరిగారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో టీఆర్‌పీ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, యూత్ ప్రెసిడెంట్ పిట్టల సురేష్ ఆధ్వర్యంలో ‘బీసీ బహుజన విద్యార్థి యువ చైతన్య సభ’ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లన్న.. విద్యార్థుల సమస్యలు, పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్, విద్యా వ్యాపారం చేస్తున్న రాజకీయ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ​ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ భిక్షపతిని తీన్మార్ మల్లన్న అధికారికంగా ప్రకటించారు. 20 ఏళ్ల పాటు సైన్యంలో దేశానికి సేవ చేసిన ముదిరాజ్ బిడ్డ భిక్షపతిని గెలిపించుకోవాలని, అప్పుడే జనగామలో పేద బిడ్డలకు ఉచిత విద్య, మెరుగైన భవిష్యత్తు అందుతుందని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ మహిళా నేత వనజక్క.. సీతక్క కంటే సీనియర్ మావోయిస్టు అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ​ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల సొమ్ము మాయం: 74 కోట్లు ఏమైనట్టు? ​గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి

f32f79e6-2bf4-4cc0-8bc4-c3c41912fcfe

చదువుతున్న ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన శానిటైజేషన్ స్కూల్ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మల్లన్న మండిపడ్డారు. ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయించిన 74 కోట్ల రూపాయలను దొంగతనంగా ఎత్తుకపోయి తిన్నారని ఆయన రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ​స్కాలర్‌షిప్ నిధుల దారి మళ్ళింపు.. కుక్కకున్న విలువ విద్యార్థులకు లేదా? ​రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందాల్సిన 1900 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధులలో కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసి, మిగిలిన సొమ్మును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర పనులకు దారి మళ్లించిందని మల్లన్న ఆరోపించారు. "పోలీసు శాఖలోని ఒక కుక్క ఆహారం కోసం నెలకు 16,000 రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, హాస్టల్‌లో ఉండి చదువుకునే పేద బిడ్డలకు కనీసం 2000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. కుక్కకు ఉన్న విలువ కూడా విద్యార్థులకు లేదా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ​శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇతర రాష్ట్రాల విద్యార్థుల ర్యాంకులను తమవిగా చూపించుకుంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేవలం కార్పొరేట్ కాలేజీల్లో సీట్లు నింపడం కోసమే పదవ తరగతిలో అందరినీ పాస్ చేస్తున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనన్నారు. ​విద్యా చట్టాల అమలులో వైఫల్యం.. ​'రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009' ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు దక్కాల్సిన

f910721d-98d4-4df6-85de-0019ec2f3666

25% ఉచిత సీట్ల గురించి ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని, ఆ చట్టాన్ని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. భారతదేశంలో విద్య కోసం అత్యంత తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, దీనివల్ల రాష్ట్ర విద్యా వ్యవస్థ దేశంలోనే 18వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ मुख्यमंत्री మనవడు అమెరికాలో చదువుకుంటుంటే, పేద విద్యార్థులు మాత్రం కూలిపోయే స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ​జనగామలో విద్యా వ్యాపారం.. పల్లా, కొమ్మూరిలపై ఆగ్రహం ​జనగామ నియోజకవర్గంలో రాజకీయం విద్యా వ్యాపారవేత్తల చేతుల్లో బందీ అయిందని మల్లన్న విమర్శించారు. ఒకవైపు అనురాగ్ యూనివర్సిటీ యజమాని పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరోవైపు కొమ్మూరి ఇన్స్టిట్యూట్ అధినేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విద్యను అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నారని ధ్వజమెత్తారు. "1,26,000 బీసీ ఓట్లున్న జనగామలో కేవలం 11,000 ఓట్లున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీళ్ళే ఎందుకు ఏలాలి? ఈ విద్యా వ్యాపారుల నుంచి జనగామను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆయన పిలుపునిచ్చారు. ​కత్తెర గుర్తుతో చరిత్ర మారుద్దాం! ​అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందుతోందని, తెలంగాణలో కూడా ప్రతి ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అందే వరకు టీఆర్‌పీ పోరాడుతుందని మల్లన్న స్పష్టం చేశారు.

f3e2748d-2c80-4df1-b5a4-5d357d5552d6

మన తలరాతలు మారాలంటే, అమెరికా తరహా విద్య మన పేద బిడ్డలకు దక్కాలంటే రాబోయే రోజుల్లో 'కత్తెర' గుర్తుపై ఓటు వేసి రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. ​ఘనంగా పార్టీ జెండా ఆవిష్కరణ ​సమావేశం అనంతరం తీన్మార్ మల్లన్న స్థానిక 5 మరియు 13వ వార్డుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు మల్లన్నకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, మహిళా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పుష్ప లీలా, మైనారిటీ అధ్యక్షులు సల్మాన్, యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి ప్రవీణ్ రాజ్, సహాయక కార్యదర్శి గిరగాని బిక్షపతి గౌడ్, యూత్ జనరల్ సెక్రటరీలు వీరమల్లు అనిల్, పోలు రాజు, మహిళా ఉపాధ్యక్షురాలు చేసుకూరి మౌనిక యాదవ్, రాష్ట్ర నాయకులు సుతారపు రంగన్న, స్టేట్ ఆఫీసు కోఆర్డినేటర్ లింగం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు రేణుగుంట్ల మురళి బైండ్ల, బోడ రమేష్ నేత, నియోజకవర్గ ఇంచార్జి సీసా శ్రీధర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గుజ్జుక రాజు తదితర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.
    2
    తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత 
హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.
    user_P Jithender, Sr Reportar
    P Jithender, Sr Reportar
    Local News Reporter జనగాం, తెలంగాణ•
    57 min ago
  • సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.
    1
    సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు....
ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    16 hrs ago
  • ప్రజల నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో నర్సంపేట ప్రజా జనం వరంగల్ జిల్లా ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో
    1
    ప్రజల నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో నర్సంపేట ప్రజా జనం
వరంగల్ జిల్లా ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
    1
    రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
    user_SHEKHAR
    SHEKHAR
    రాజపేట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
  • మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం
    1
    మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం
    user_Sudagani HariKrishna goud
    Sudagani HariKrishna goud
    Nedu news paper గుండాల, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    1
    భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ...
భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు
రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య
పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు
పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    14 hrs ago
  • నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.
    1
    నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం
వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    19 hrs ago
  • పార్టీతో పనిలేదు ప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంత ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం పార్టీతో పనిలేదుప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంతఇల్లు... అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ఇది కేవలం పథకం కాదు - గౌరవంతో జీవించే హక్కు... నిరుపేదలకు భరోసా ఇందిరమ్మ ఇల్లు... కప్పు లేని గుడిసెలకు ఆశ్రయమిచ్చి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం నింపే ఇందిరమ్మ ఇల్లు...!! ఆత్మగౌరవ ప్రతీక కేవలం ఇటుకల నిర్మాణం కాదు, నిరుపేద కుటుంబానికి దక్కిన ఆత్మగౌరవప్రతిక ఇందిరమ్మ ఇల్లు..!! ఎన్నో ఏళ్ల కలల సహకారం ఇందిరమ్మ ఇల్లు.. సొంతింటి కల సహకారమై ప్రతి పేదల ముఖంలో చిరునవ్వులు పూయించే సువర్ణ అవకాశం ప్రజా ప్రభుత్వం చేస్తుంది..!! ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..!! జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోని అమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..* *మీ.. సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు
    1
    పార్టీతో పనిలేదు ప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంత ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
పార్టీతో పనిలేదుప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంతఇల్లు... అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..
ఇది కేవలం పథకం కాదు - గౌరవంతో జీవించే హక్కు...
నిరుపేదలకు భరోసా ఇందిరమ్మ ఇల్లు...
కప్పు లేని గుడిసెలకు ఆశ్రయమిచ్చి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం నింపే ఇందిరమ్మ ఇల్లు...!!
ఆత్మగౌరవ ప్రతీక 
కేవలం ఇటుకల నిర్మాణం కాదు, నిరుపేద కుటుంబానికి దక్కిన ఆత్మగౌరవప్రతిక ఇందిరమ్మ ఇల్లు..!!
ఎన్నో ఏళ్ల కలల సహకారం ఇందిరమ్మ ఇల్లు..
సొంతింటి కల సహకారమై ప్రతి పేదల ముఖంలో చిరునవ్వులు పూయించే సువర్ణ అవకాశం ప్రజా ప్రభుత్వం చేస్తుంది..!!
ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం..
ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం..
ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..!!
జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 
జై సోని అమ్మ 
జై జై రాహుల్ అన్న 
జయహో రేవంతన్న 
*కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..*
*మీ.. సిలివేరు అనిల్*
యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.