Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్ పరిశీలించిన జిల్లా కలెక్టర్... ఎస్పీలు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర బుధవారం పరిశీలించారు. అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించి ట్రాఫిక్, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు, బారికేడ్ల ఏర్పాట్లపై సూచనలు చేశారు. నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు నిర్వహించాలని ప్రజలకు సూచించారు.
Vukkalkar Rajendernath
కామారెడ్డిలో గణేష్ నిమజ్జన రూట్ పరిశీలించిన జిల్లా కలెక్టర్... ఎస్పీలు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర బుధవారం పరిశీలించారు. అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించి ట్రాఫిక్, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు, బారికేడ్ల ఏర్పాట్లపై సూచనలు చేశారు. నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు నిర్వహించాలని ప్రజలకు సూచించారు.
More news from Telangana and nearby areas
- 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ మెదక్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వినతి -ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కోరుతూ మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మెదక్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం1
- బోధన్ రకాసిపేట్‌లోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాలు.. విద్యార్థులకు ఘనంగా బహుమతుల ప్రదానం బోధన్: బోధన్ రకాసిపేట్ ప్రాంతంలోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాల సందర్భంగా ఘనంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మదర్సా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు, ధార్మిక విద్య, క్రమశిక్షణ కూడా అందించడం ఎంతో అవసరమని తెలిపారు. సమాజంలో జ్ఞానం, నైతికత, మానవత్వం కోసం మదర్సాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రెసెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మీర్ జావేద్ అలీ మాట్లాడుతూ.. దైవిక విద్యను అభ్యసించడం గొప్ప అదృష్టమని, విద్యార్థులు దైవిక విద్యతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఆధునిక విద్యను కూడా అభ్యసించాలని సూచించారు. వివిధ భాషల విద్యను అందించే ఉపాధ్యాయుల ఏర్పాటుకు తన వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మదర్సా అధ్యక్షుడు సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ మాట్లాడుతూ.. విద్యార్థులు ధార్మిక విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో హాఫిజ్‌లు, ఆలిమ్‌లుగా ఎదగాలని ఆకాంక్షించారు. దైవిక విద్యతో పాటు ఆధునిక విద్య, కంప్యూటర్ విద్య కూడా అవసరమని, విద్యార్థుల కోసం కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. మదర్సా ప్రధాన నిర్వాహకులు హాజీ సుల్తాన్ ఖాద్రీ పర్యవేక్షణలో విద్యార్థులకు ధార్మిక విద్యతో పాటు విద్యా రంగంలో కూడా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నారు. హాఫిజ్ అబ్దుల్ మతీన్ విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జీ టుడే న్యూస్ చానల్ చీఫ్ ఎడిటర్ నాసిర్ మిర్జా పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా బహుమతులు అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ, జనరల్ సెక్రటరీ అక్బర్ ఖాన్ ఖాద్రీ, గౌస్ ఖాద్రీ, లతీఫ్ అహ్మద్ ఖాద్రీ, కౌన్సిలర్ రఫీ, కౌన్సిలర్ జావేద్, మీర్ జావేద్ అలీ, సనా పటేల్, హాఫిజ్ అబ్దుల్ మతీన్, ప్రధాన నిర్వాహకులు సుల్తాన్ ఖాద్రీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.1
- రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో మూడవరోజు స్వామి వారి దర్శనం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- సిరిసిల్లలో పెట్రోల్‌లో నీరు వచ్చిందంటూ వాహనదారుడి ఆందోళన. సిరిసిల్ల: పెట్రోల్‌లో నీరు కలిసిందని ఆరోపిస్తూ ఓ వాహనదారుడు ఆందోళనకు దిగాడు. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం మొరాయించిందని జిల్లెల్లకు చెందిన కృష్ణ తెలిపారు. పరిశీలించగా పెట్రోల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు.1
- పెండింగ్ జీతాలు చెల్లించడంతో కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలని నిరసన తెలుపడంతో అధికారులు పాలకులు దిగివచ్చి జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ కార్మికులు సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేర్ చౌరస్తా వద్ద ఉదయం వేళలో మున్సిపల్ కార్మికులు సమావేశమై పెండింగ్ జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ చైర్మన్కు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు1
- భజరంగ్దళ్ గణేష్ మండలి వద్ద చిన్నారులు పెద్దలచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని బజరంగ్దళ్ గణేష్ మండలి వద్ద ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం సందర్బంగా చిన్నారులు, యువకులు, పెద్దలు కలిసి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగ వినాయకునికి ఆంజనేయ స్వామికి పూజలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఈరోజు ప్రత్యేక అభిషేకం పూజలు మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయలవల దుర్గా భవాని మాత ఆలయంలో పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆలయ పూజారులుమంజిరానది జలాలతో అభిషేకము పట్టు వస్తలంకరణ పుష్పాలంకరణ పసుపు కుంకుమ సుందరంగా అలంకరించారు కోరిన కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి బోనాలు ఓడి బియ్యం తలనీలాల సమర్పిస్తున్నారు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే.1
- విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- వెంకటరత్నాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బైకులను ధ్వంసం చేయడంతో గ్రామస్థుల్లో ఆందోళన తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బైకులను ధ్వంసం చేయడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. రత్నాపూర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో గ్రామస్థులు తమ ద్విచక్ర వాహనాలను తూప్రాన్ వైపు రహదారి పక్కన పార్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అక్కడ నిలిపి ఉంచిన బైకులపై గుర్తుతెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఓ బైక్ హ్యాండిల్ డోమ్‌ను ధ్వంసం చేయడంతో పాటు మరో ఐదు బైకుల్లో ఇసుక పోసి, వాటికి సంబంధించిన పైపులను తొలగించినట్లు పేర్కొన్నారు. ఉదయం బైకుల పరిస్థితిని గమనించిన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, బైకులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.1