logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రీ-సర్వే లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం, ఫిబ్రవరి 17: జిల్లాలో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలను తక్షణమే సరిదిద్దాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి మంగళవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన రీ-సర్వే పురోగతిపై గణాంకాలతో సహా సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో 4వ దశ రీ-సర్వే 167 గ్రామాల్లో లక్ష్యంగా పెట్టుకోగా, ఫిబ్రవరి 16 నాటికి 24 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మిగిలిన 143 గ్రామాల్లో సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో 'ఇతరులు' అనే పేరుతో ఉన్న భూముల వివరాలను పరిశీలిస్తే, జిల్లా వ్యాప్తంగా 29,953 సర్వే నంబర్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన మొత్తం భూమి విస్తీర్ణం 7,709.22 ఎకరాలుగా ఉందన్నారు. వీటిపై కూడా రెవెన్యూ యంత్రాంగం తగిన దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే మొత్తం 1,74,941 ఎల్.పి.ఎంలలో ఇంకా పెండింగ్‌లో ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్చరించారు. రికార్డుల అప్‌లోడింగ్‌లో ఎటువంటి తప్పులు జరగకూడదని, రైతులు ఇబ్బంది పడకుండా సర్వే ప్రక్రియ పారదర్శకగా సాగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే పట్టాదారు పాస్‌బుక్కుల జారీ ప్రక్రియపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,133 ఖాతాలను పరిశీలించగా, అందులో 4,576 ఖాతాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయని, ఇంకా 1,764 ఖాతాల్లో వ్యక్తిగత సమాచార సవరణలు అవసరమని, మరో 190 ఖాతాల్లో మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించిన కలెక్టర్, వీటిని తక్షణమే పరిష్కరించి వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు మండలాల నుంచి తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Dr.Gangu Manmadharao
Dr.Gangu Manmadharao
జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
942e4568-c3f6-450d-9ddd-094dc24e6cd6

More news from Parvathipuram Manyam and nearby areas
  • Post by APPARAO KONCHADA
    1
    Post by APPARAO KONCHADA
    user_APPARAO KONCHADA
    APPARAO KONCHADA
    Palakonda, Parvathipuram Manyam•
    2 hrs ago
  • సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.
    4
    సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
    1
    పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు  వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.
    1
    చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత
ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
    1
    కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.
    1
    జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    19 hrs ago
  • Post by APPARAO KONCHADA
    1
    Post by APPARAO KONCHADA
    user_APPARAO KONCHADA
    APPARAO KONCHADA
    Palakonda, Parvathipuram Manyam•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.