logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ముంజంపల్లి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివాజీ దేశభక్తి, పరాక్రమం నేటి యువతకు ఆదర్శమని పేర్కొంటూ సమాజంలో ఐక్యత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

2 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
2 hrs ago

ముంజంపల్లి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివాజీ దేశభక్తి, పరాక్రమం నేటి యువతకు ఆదర్శమని పేర్కొంటూ సమాజంలో ఐక్యత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Bharath Newz
    1
    Post by Bharath Newz
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలో బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ,సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా సమాజ అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన బోధించిన సన్మార్గం సమానత్వం సామాజిక న్యాయం సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని సమాజంలోని ప్రతి వర్గం ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజేన్, ఐటిడిఎ పీఓ యువరాజ్ మార్మాట్,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు బంజారా సమాజ పెద్దలు బంజారా సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలో బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ,సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా సమాజ అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన బోధించిన సన్మార్గం సమానత్వం సామాజిక న్యాయం సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని సమాజంలోని ప్రతి వర్గం ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజేన్, ఐటిడిఎ పీఓ యువరాజ్ మార్మాట్,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు బంజారా సమాజ పెద్దలు బంజారా సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Adilabad Urban, Telangana•
    16 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ
రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్‌కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం పై అలకబూనారు. ఢిల్లీకి రావాలని పిలిచిన వెళ్లకుండా సొంత పనుల్లో జీవన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అవమానపరిచేలా పార్టీ పెద్దలు వ్యవహరించారని జీవన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సంజయ్ ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం తమకు తప్పవు వేధింపులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ గా కాంగ్రెస్ పెద్దల తీరును జీవన్ రెడ్డి నిరసిస్తున్నారు. జీవన్ రెడ్డి అలకబూనడంపై పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
    1
    కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం పై అలకబూనారు. ఢిల్లీకి రావాలని పిలిచిన వెళ్లకుండా సొంత పనుల్లో జీవన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అవమానపరిచేలా పార్టీ పెద్దలు వ్యవహరించారని జీవన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సంజయ్ ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం తమకు తప్పవు వేధింపులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ గా కాంగ్రెస్ పెద్దల తీరును జీవన్ రెడ్డి నిరసిస్తున్నారు. జీవన్ రెడ్డి అలకబూనడంపై పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    19 hrs ago
  • నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    1
    నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ  జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష,  జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన బ్రిడ్జి ప్రారంభమైనప్పటి నుంచి మురుగు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులు, కూరగాయల మార్కెట్, వివిధ దుకాణాలు, ఎరువుల షాపులకు వెళ్లే ప్రధాన దారిగా ఉండటంతో రోజూ ప్రయాణికులు బురద నీటిలోనే వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యపై మున్సిపల్ కొత్త పాలకమండలి, కమిషనర్ తక్షణ చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    1
    కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన బ్రిడ్జి ప్రారంభమైనప్పటి నుంచి మురుగు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులు, కూరగాయల మార్కెట్, వివిధ దుకాణాలు, ఎరువుల షాపులకు వెళ్లే ప్రధాన దారిగా ఉండటంతో రోజూ ప్రయాణికులు బురద నీటిలోనే వెళ్లాల్సి వస్తోంది.
ఈ సమస్యపై మున్సిపల్ కొత్త పాలకమండలి, కమిషనర్ తక్షణ చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జన్మదిన సందర్బంగా అధికారిక ఉత్సవాలు నిర్వహించిన్న సందర్బంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. బంజారా సమాజాన్ని ఎక్కతటి పైకి తీసుకొచ్చిన సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో అందరూ నడవాలని సమాజం కొరకు ప్రతి ఒక్కరు సమయాన్ని కేటాహించాలని బంజారాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావిస్తానని అన్నారు. ఈ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,ఐటీడీఎ పివో యువరాజ్ మార్మట్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ మౌనిక గార్లతో కలిసి భోగ్ సమర్పించారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జన్మదిన సందర్బంగా అధికారిక ఉత్సవాలు నిర్వహించిన్న సందర్బంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. బంజారా సమాజాన్ని ఎక్కతటి పైకి తీసుకొచ్చిన సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో అందరూ నడవాలని సమాజం కొరకు ప్రతి ఒక్కరు సమయాన్ని కేటాహించాలని బంజారాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావిస్తానని అన్నారు. ఈ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,ఐటీడీఎ పివో యువరాజ్ మార్మట్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ మౌనిక గార్లతో కలిసి భోగ్ సమర్పించారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Adilabad Urban, Telangana•
    16 hrs ago
  • అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్య రెడ్డి, మోసినా పర్వీన్, దేశాల భోపాల్ ఆర్టీఐ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 మే 14న రాష్ట్ర సమాచార కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకునే నాటికి 17 వేలా 808 రెండవ అప్పిళ్లు రాష్ట్ర కమిషన్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాలలో పర్యటించి అక్కడే వాదనలు విన్నామని తెలిపారు. ఇలా సుమారు 9 వేల అప్పిళ్లను పరిష్కరించామన్నారు. ఇంత త్వరగా అప్పిళ్లను పరిష్కరించడం దేశంలోనే మొదటిసారిగా పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని తెలిపారు. సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మిగిలిన జిల్లాల్లో పర్యటించి పెండింగ్ కేసులన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. అర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల ప్రయోజనం కోసమేనని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారులతో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. దరఖాస్తులు, ఫిర్యాదులు, పరిష్కారం, పెండింగ్ దరఖాస్తులు, పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై పిఐఓలతో కమిషనర్లు చర్చించారు.
    1
    అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు.  కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్య రెడ్డి, మోసినా పర్వీన్, దేశాల భోపాల్  ఆర్టీఐ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 మే 14న రాష్ట్ర సమాచార కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకునే నాటికి 17 వేలా 808 రెండవ అప్పిళ్లు రాష్ట్ర కమిషన్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాలలో పర్యటించి అక్కడే వాదనలు విన్నామని తెలిపారు. ఇలా సుమారు 9 వేల అప్పిళ్లను పరిష్కరించామన్నారు. ఇంత త్వరగా అప్పిళ్లను పరిష్కరించడం   దేశంలోనే మొదటిసారిగా పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని తెలిపారు. సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మిగిలిన జిల్లాల్లో పర్యటించి పెండింగ్ కేసులన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. అర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని తెలిపారు. 
ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల ప్రయోజనం కోసమేనని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారులతో  సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. దరఖాస్తులు, ఫిర్యాదులు, పరిష్కారం, పెండింగ్ దరఖాస్తులు, పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై పిఐఓలతో కమిషనర్లు చర్చించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.