logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*🔹మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ మాతృమూర్తికి ఆత్రం సుగుణక్క నివాళి* ఆసిఫాబాద్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మాజీ డీసీసీ *ప్రెస్ రిలీజ్* *తేదీ:19-04-2026* అధ్యక్షులు విశ్వప్రసాద్ మాతృమూర్తి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు.విశ్వప్రసాద్ మాతృమూర్తి మరణం వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.ఈ సందర్బంగా విశ్వప్రసాద్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు జిల్లా ప్రజల తరఫున ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.సుగుణక్క వెంట ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇరుకుల మంగా,డీసీసీ వైస్ ప్రెసిడెంట్ భీమ్ రావ్, ప్రధాన కార్యదర్శి గాదివేణి మల్లేష్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. *డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్*

2 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
ఇచ్చోడ, ఆదిలాబాద్, తెలంగాణ•
2 hrs ago
3ed796a8-a0da-478c-863c-c1a243252b25

*🔹మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ మాతృమూర్తికి ఆత్రం సుగుణక్క నివాళి* ఆసిఫాబాద్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మాజీ డీసీసీ *ప్రెస్ రిలీజ్* *తేదీ:19-04-2026* అధ్యక్షులు విశ్వప్రసాద్ మాతృమూర్తి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి

b2e7362a-fbb7-4ce1-9a7d-d1107fcf405b

పార్థివ దేహానికి నివాళులర్పించారు.విశ్వప్రసాద్ మాతృమూర్తి మరణం వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.ఈ సందర్బంగా విశ్వప్రసాద్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు జిల్లా ప్రజల తరఫున ఆమె ఆత్మకు

0c15e3fa-13d2-494e-a8bc-07441de725b9

శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.సుగుణక్క వెంట ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇరుకుల మంగా,డీసీసీ వైస్ ప్రెసిడెంట్ భీమ్ రావ్, ప్రధాన కార్యదర్శి గాదివేణి మల్లేష్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. *డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్*

More news from తెలంగాణ and nearby areas
  • ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ. స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼
    1
    ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము.
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ.
స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    ఇచ్చోడ, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • బజార్ హత్నూర్ మండలంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 31 మందికి కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చెక్కుల వేరిఫైలను అధికారులు ఆలస్యం చేయొద్దని తన దగ్గరకు వచ్చిన రోజే సంతకం చేసే బాధ్యత తనదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    బజార్ హత్నూర్ మండలంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 31 మందికి కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చెక్కుల వేరిఫైలను అధికారులు ఆలస్యం చేయొద్దని తన దగ్గరకు వచ్చిన రోజే సంతకం చేసే బాధ్యత తనదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Bazarhatnoor, Adilabad•
    2 hrs ago
  • దిలార్పూర్ మండల కేంద్రంలో వాతావరణ మార్పులు ఒక్కసారిగా తీవ్రమవుతున్నాయి. ఎండ తీవ్రత మధ్యలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని వర్షం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అనూహ్య మార్పులతో మొక్కజొన్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పారీలతో కప్పుతూ అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నారు.
    1
    దిలార్పూర్ మండల కేంద్రంలో వాతావరణ మార్పులు ఒక్కసారిగా తీవ్రమవుతున్నాయి. ఎండ తీవ్రత మధ్యలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని వర్షం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అనూహ్య మార్పులతో మొక్కజొన్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పారీలతో కప్పుతూ అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నారు.
    user_Ravula Purushotham
    Ravula Purushotham
    దిలావర్‌పూర్, నిర్మల్, తెలంగాణ•
    19 hrs ago
  • raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel
    1
    raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel
    user_Katta Thirupathi
    Katta Thirupathi
    Grain Wholesaler బుగ్గారం, జగిత్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • కుమురం భీమ్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో ఏప్రిల్ 19న ‘నా ఊరు–నా బాధ్యత’ కార్యక్రమం కింద యువత స్వచ్ఛందంగా శ్రమదానం నిర్వహించారు. గ్రామ ఎక్స్‌రోడ్ వద్ద రహదారి పక్కన పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని యువత అవగాహన కల్పించారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మద్దతు తెలుపుతూ యువత సేవలను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.
    1
    కుమురం భీమ్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో ఏప్రిల్ 19న ‘నా ఊరు–నా బాధ్యత’ కార్యక్రమం కింద యువత స్వచ్ఛందంగా శ్రమదానం నిర్వహించారు. గ్రామ ఎక్స్‌రోడ్ వద్ద రహదారి పక్కన పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు.
గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని యువత అవగాహన కల్పించారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మద్దతు తెలుపుతూ యువత సేవలను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • బాబుకు ఆపరేషన్ గురించి
    1
    బాబుకు ఆపరేషన్ గురించి
    user_Andugula sagargoud
    Andugula sagargoud
    రుద్రూర్, నిజామాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • బజార్ హత్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో పీఏసీఎస్ బజార్ హత్నూర్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులను ఎమ్మెల్యే సన్మానించి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతి గింజ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    బజార్ హత్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో పీఏసీఎస్ బజార్ హత్నూర్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులను ఎమ్మెల్యే సన్మానించి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతి గింజ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Bazarhatnoor, Adilabad•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.