logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం, సీజనల్ వ్యాధులు మరియు వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులపై జిల్లా సమీక్షా సమావేశం మరియు టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా కలెక్టర్ (రెవిన్యూ) శ్రీరాములు గారు పాల్గొన్నారు. సమావేశంలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో 28వ తేదీన 459 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు 76,365 మంది పిల్లలకు పల్స్ పోలియో వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 86 అర్బన్, 353 గ్రామీణ, 20 గిరిజన ప్రాంతాలతో పాటు 24 ట్రాన్సిట్ రవాణా కేంద్రాలు (బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు) మరియు 24 మొబైల్ టీమ్‌ల ద్వారా పల్స్ పోలియో నిర్వహించబడుతుంది. సుమారుగా 1836 మంది ఆరోగ్య, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. 28వ తేదీన పల్స్ పోలియో కేంద్రాలలో, 29 మరియు 30 తేదీలలో ఇంటింటికి తిరిగి పల్స్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఐదేళ్లలోపు పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందజేయడం, అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, జిల్లా సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, డిఆర్డిఏ, పంచాయతీరాజ్, రైల్వే, ఆర్టీసీ, ఐఎంఏ, ఎన్జీవోల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని, వైద్యులు, వైద్య సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా, జిల్లాలో వాతావరణ మార్పులు మరియు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఐసిడిఎస్, ఫిషరీస్, విద్యాశాఖ, డిఆర్డిఏ, ఐకెపి, మున్సిపల్, డి పి ఆర్ ఓ సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటివి ప్రబలకుండా జిల్లా సమన్వయ కమిటీ అంతా కలిసి చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమల నియంత్రణలో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మున్సిపల్ కార్పొరేషన్ల వార్డ్ మెంబర్లు అందరినీ భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. ఓఆర్ఎస్, అన్ని గ్రామాలలో మందులు అందుబాటులో ఉంచాలని, తక్షణ చర్యల కోసం జిల్లాలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను (ఆర్ఆర్టీ) ఏర్పాటు చేసి, ప్రతి మండలంలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ద్వారా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డెంగ్యూ కేసుల వివరాలను తెలుసుకుని చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ ఆసుపత్రుల వారు డెంగ్యూ పైన భయం కల్పించకుండా ఆదేశాలు పంపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా డిప్యూటీ కలెక్టర్, వైద్యాధికారులు, జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డిపిహెచ్ఎన్ ఆర్ఎస్ పద్మ, నాందేవ్ శ్రీనివాస్, రవి కిరణ్ మరియు మలేరియా నిర్మూలనలో పాలుపంచుకుంటున్న వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు పల్స్ పోలియో మరియు వ్యాధుల నివారణ చర్యలపై పోస్టర్లను, బ్యానర్లను విడుదల చేశారు.

1 hr ago
user_RAJESH KUMAR (GODsSON)
RAJESH KUMAR (GODsSON)
Social Media Manager మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
1 hr ago
9b20b070-900f-4680-8783-1b2cffce1ec1

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం, సీజనల్ వ్యాధులు మరియు వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులపై జిల్లా సమీక్షా సమావేశం మరియు టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా కలెక్టర్ (రెవిన్యూ) శ్రీరాములు గారు పాల్గొన్నారు. సమావేశంలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో 28వ తేదీన 459 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు 76,365 మంది పిల్లలకు పల్స్ పోలియో వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 86 అర్బన్, 353 గ్రామీణ, 20 గిరిజన ప్రాంతాలతో పాటు 24 ట్రాన్సిట్ రవాణా కేంద్రాలు (బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు) మరియు 24 మొబైల్ టీమ్‌ల ద్వారా పల్స్ పోలియో నిర్వహించబడుతుంది. సుమారుగా 1836 మంది ఆరోగ్య, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. 28వ తేదీన పల్స్ పోలియో కేంద్రాలలో, 29 మరియు 30 తేదీలలో ఇంటింటికి తిరిగి పల్స్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఐదేళ్లలోపు పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందజేయడం, అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, జిల్లా సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, డిఆర్డిఏ, పంచాయతీరాజ్, రైల్వే, ఆర్టీసీ, ఐఎంఏ, ఎన్జీవోల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని, వైద్యులు, వైద్య సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా,

00765eda-182c-4daf-922d-ffdda6053154

జిల్లాలో వాతావరణ మార్పులు మరియు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఐసిడిఎస్, ఫిషరీస్, విద్యాశాఖ, డిఆర్డిఏ, ఐకెపి, మున్సిపల్, డి పి ఆర్ ఓ సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటివి ప్రబలకుండా జిల్లా సమన్వయ కమిటీ అంతా కలిసి చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమల నియంత్రణలో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మున్సిపల్ కార్పొరేషన్ల వార్డ్ మెంబర్లు అందరినీ భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. ఓఆర్ఎస్, అన్ని గ్రామాలలో మందులు అందుబాటులో ఉంచాలని, తక్షణ చర్యల కోసం జిల్లాలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను (ఆర్ఆర్టీ) ఏర్పాటు చేసి, ప్రతి మండలంలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ద్వారా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డెంగ్యూ కేసుల వివరాలను తెలుసుకుని చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ ఆసుపత్రుల వారు డెంగ్యూ పైన భయం కల్పించకుండా ఆదేశాలు పంపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా డిప్యూటీ కలెక్టర్, వైద్యాధికారులు, జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డిపిహెచ్ఎన్ ఆర్ఎస్ పద్మ, నాందేవ్ శ్రీనివాస్, రవి కిరణ్ మరియు మలేరియా నిర్మూలనలో పాలుపంచుకుంటున్న వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు పల్స్ పోలియో మరియు వ్యాధుల నివారణ చర్యలపై పోస్టర్లను, బ్యానర్లను విడుదల చేశారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో వర్షం పడితే నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత పాఠశాలలో మూడు ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. విద్యార్థుల కోసం అదనంగా రెండు తరగతి గదులను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న మరో రెండు గదులను ఆధునికరించాలని ఆయన కోరారు. అలాగే, పాఠశాలలకు సరిపడా మున్సిపల్ నీటిని సరఫరా చేయాలని, పనిచేయని పాత బోరుబావి స్థానంలో కొత్త బోరుబావిని వేసి విద్యార్థులకు తగిన నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా క్లాస్ రూమ్‌లపైకి చేరిన పెద్ద చెట్లను వెంటనే తొలగించాలని, గాలి దుమారం వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన రెండు రేకుల షెడ్లు విరిగిపోయి శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునికరించాలని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, వారికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నాయని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతుందన్న స్ఫూర్తిని పాలకులు విస్మరిస్తున్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, చదువులు కొనుక్కునే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాసుదేవరెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు పుల్లెల మల్లయ్య, డి. నరేష్, శ్రీకాంత్, సూర్య, అరవింద్, భాస్కర్, ఇస్సాక్, ఆకాష్, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
    3
    కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో వర్షం పడితే నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత పాఠశాలలో మూడు ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. విద్యార్థుల కోసం అదనంగా రెండు తరగతి గదులను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న మరో రెండు గదులను ఆధునికరించాలని ఆయన కోరారు. అలాగే, పాఠశాలలకు సరిపడా మున్సిపల్ నీటిని సరఫరా చేయాలని, పనిచేయని పాత బోరుబావి స్థానంలో కొత్త బోరుబావిని వేసి విద్యార్థులకు తగిన నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా క్లాస్ రూమ్‌లపైకి చేరిన పెద్ద చెట్లను వెంటనే తొలగించాలని, గాలి దుమారం వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన రెండు రేకుల షెడ్లు విరిగిపోయి శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునికరించాలని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు.

ప్రభుత్వ బడుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, వారికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నాయని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతుందన్న స్ఫూర్తిని పాలకులు విస్మరిస్తున్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, చదువులు కొనుక్కునే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాసుదేవరెడ్డి పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు పుల్లెల మల్లయ్య, డి. నరేష్, శ్రీకాంత్, సూర్య, అరవింద్, భాస్కర్, ఇస్సాక్, ఆకాష్, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లాలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు పంచుతారా లేక సీపీఐ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమించుకోమంటారా తక్షణమే తెలపాలని ఆయన సూటి ప్రశ్న వేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఈ ధర్నా సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నగరంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చింతకుంట ప్రాంతంలో దాదాపు 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినప్పటికీ, అవి నిర్మించి పదేళ్లు కావస్తున్నా నేటికీ అర్హులైన వారికి కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్నాయని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఈ ఇళ్లను ఇప్పటివరకు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఆ ఇళ్లను ఆక్రమించుకునేలా చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సీపీఐ నాయకులు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సీపీఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, ఈ. భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు పంచుతారా లేక సీపీఐ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమించుకోమంటారా తక్షణమే తెలపాలని ఆయన సూటి ప్రశ్న వేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ డిమాండ్ చేశారు.

ఈ ధర్నా సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నగరంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చింతకుంట ప్రాంతంలో దాదాపు 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినప్పటికీ, అవి నిర్మించి పదేళ్లు కావస్తున్నా నేటికీ అర్హులైన వారికి కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్నాయని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఈ ఇళ్లను ఇప్పటివరకు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఆ ఇళ్లను ఆక్రమించుకునేలా చేస్తామని ఆయన డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం సీపీఐ నాయకులు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సీపీఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, ఈ. భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామంలో గతంలో మూసివేయబడిన ప్రాథమిక పాఠశాలను సోమవారం రోజు గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మరియు మండల విద్యాధికారి శోభారాణి పునఃప్రారంభించారు. విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ గ్రామానికి ఇతర చోట్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేదని, ఉన్న ఊరిలోనే పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ జిల్లా విద్యాధికారిని కలిసినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహంతో, నియోజకవర్గ ఇన్ చార్జ్ వొడితల ప్రణవ్ చొరవతో ఈ పాఠశాలను ప్రారంభించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    1
    వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామంలో గతంలో మూసివేయబడిన ప్రాథమిక పాఠశాలను సోమవారం రోజు గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మరియు మండల విద్యాధికారి శోభారాణి పునఃప్రారంభించారు. విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో నిండిపోయింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ గ్రామానికి ఇతర చోట్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేదని, ఉన్న ఊరిలోనే పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ జిల్లా విద్యాధికారిని కలిసినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహంతో, నియోజకవర్గ ఇన్ చార్జ్ వొడితల ప్రణవ్ చొరవతో ఈ పాఠశాలను ప్రారంభించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    user_T. sridhar✍️
    T. sridhar✍️
    వీణవంక, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    10 hrs ago
  • కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
    1
    కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థిని కేవలం మూడు నిముషాల ఆలస్యం కారణంగా నీట్ పరీక్ష రాయలేకపోయింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉన్నప్పటికీ, విద్యార్థిని కొండగట్టు జేఎన్టీయూ నీట్ పరీక్షా కేంద్రానికి ఒంటి గంట 33 నిముషాలకు చేరుకుంది. అప్పటికే గేట్లు మూసివేసిన అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని విద్యార్థిని తల్లి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నా, నిబంధనల ప్రకారం ప్రవేశం కల్పించలేమని అధికారులు స్పష్టం చేశారు. గొల్లపల్లి మండలం రాపల్లి నుంచి ఆటోలో రావడం వల్ల ఆలస్యమైందని విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల కారణంగా కన్నీటి పర్యంతమై వారు వెనుతిరిగారు. ఈ నిముషం ఆలస్యం నిబంధనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విద్యార్థిని భావోద్వేగ పరిస్థితిని చూసిన స్థానికులు, తోటి విద్యార్థులు సైతం విచారం వ్యక్తం చేశారు.
    4
    జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థిని కేవలం మూడు నిముషాల ఆలస్యం కారణంగా నీట్ పరీక్ష రాయలేకపోయింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉన్నప్పటికీ, విద్యార్థిని కొండగట్టు జేఎన్టీయూ నీట్ పరీక్షా కేంద్రానికి ఒంటి గంట 33 నిముషాలకు చేరుకుంది. అప్పటికే గేట్లు మూసివేసిన అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు.

పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని విద్యార్థిని తల్లి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నా, నిబంధనల ప్రకారం ప్రవేశం కల్పించలేమని అధికారులు స్పష్టం చేశారు. గొల్లపల్లి మండలం రాపల్లి నుంచి ఆటోలో రావడం వల్ల ఆలస్యమైందని విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల కారణంగా కన్నీటి పర్యంతమై వారు వెనుతిరిగారు. ఈ నిముషం ఆలస్యం నిబంధనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విద్యార్థిని భావోద్వేగ పరిస్థితిని చూసిన స్థానికులు, తోటి విద్యార్థులు సైతం విచారం వ్యక్తం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    23 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల 'విద్యా మాఫియా' దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్‌వీ నాయకులు జిల్లా విద్యాధికారి (డీఈఓ)కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రైవేట్ సంస్థలు నోట్‌బుక్స్, యూనిఫామ్స్, స్టేషనరీల పేరుతో పేదలను నిలువునా దోచుకుంటున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డిఫెన్స్ అకాడమీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రెండు రోజుల్లో అక్రమ పుస్తక నిల్వల పూర్తి వివరాలను డీఈఓకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ ఉద్యమ తరహాలో శాంతియుత పోరాటాలు చేస్తామని, అవసరమైతే విద్యాసంస్థలపై దాడులకూ వెనకాడబోమని అనిల్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం బాధాకరమని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల్లో 100% రాయితీ కల్పించాలని డీఈఓను విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఈఓ స్పందిస్తూ, జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, వీటిని ఉల్లంఘించే పాఠశాలలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ నాయకులు మధుసూదన్ రెడ్డి, చుక్క శ్రీనివాస్, బొంకూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
    3
    కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల 'విద్యా మాఫియా' దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్‌వీ నాయకులు జిల్లా విద్యాధికారి (డీఈఓ)కి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రైవేట్ సంస్థలు నోట్‌బుక్స్, యూనిఫామ్స్, స్టేషనరీల పేరుతో పేదలను నిలువునా దోచుకుంటున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డిఫెన్స్ అకాడమీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రెండు రోజుల్లో అక్రమ పుస్తక నిల్వల పూర్తి వివరాలను డీఈఓకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ ఉద్యమ తరహాలో శాంతియుత పోరాటాలు చేస్తామని, అవసరమైతే విద్యాసంస్థలపై దాడులకూ వెనకాడబోమని అనిల్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం బాధాకరమని కూడా ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల్లో 100% రాయితీ కల్పించాలని డీఈఓను విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఈఓ స్పందిస్తూ, జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, వీటిని ఉల్లంఘించే పాఠశాలలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ నాయకులు మధుసూదన్ రెడ్డి, చుక్క శ్రీనివాస్, బొంకూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.